ఎక్కువ అమ్మకాలను కలిగిన ప్రీమియం హాచ్బాక్ విభాగంలో ఉండే ఐ 20 వాహన స్థానాన్ని పొందిన బాలెనో
జనవరి 25, 2016 03:10 pm sumit ద్వారా ప్రచురించబడింది
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మారుతి యొక్క కొత్త ఉత్పత్తి అయిన బాలెనో వాహనం, అత్యద్భుతమైన ప్రదర్శనతో, అగ్ర అమ్మకాలను కలిగిన ప్రీమియం హాచ్బాక్ విభాగంలో ఉండే ఐ 20 వాహన స్థానాన్ని పొందింది. డిసెంబర్ 2015 లో హ్యుందాయ్ వారు ఐ 20 వాహనాలను 10,372 యూనిట్ల ను విక్రయించారు దీనితో పోలిస్తే, ఇండో జపనీస్ కార్ల తయారీదారుడు, ఇదే డిసెంబర్ 2015 లో 10,572 యూనిట్ల ను విక్రయించి విజయాన్ని సాదించాడు. మారుతి, 2016 ఆటో ఎక్స్పో కోసం దాని శ్రేణిలో తో సిద్ధంగా ఉంది. మూడు కార్లు ఆటోమొబైల్ కార్యక్రమం లో ప్రదర్శించబడతాయి వాటిలో ఒకటి, స్పోర్టీ లుక్ తో వచ్చే బాలెనో ఆర్ ఎస్. కమెపెనీ ప్రదర్శించనున్న మిగిలిన రెండు వాహనాలు వరుసగా, విటారా బ్రెజ్జా మరియు ఇగ్నిస్ కాన్సెప్ట్.
బాలెనో వాహనం, 1.3 లీటర్ డీజిల్ మరియు 1.2 లీటర్ పెట్రోల్ అను రెండు ఇంజన్ ఎంపికలతో మూడు నెలల క్రితం ప్రారంభించబడింది. అయితే, కార్ల తయారీదారుడు ఈ వాహనం యొక్క కొత్త లుక్స్ తో మరియు కొత్త అంతర్గత భాగాలతో అనేక ప్రశంసలను పొందాడు మరోవైపు, అండర్ పవర్ ఇంజన్ ల కోసం విమర్శలను ఎదుర్కొన్నాడు. ముందుగా 1.3 లీటర్ డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే, ఈ ఇంజన్ అత్యధికంగా 74 బి హెచ్ పి పవర్ ను విడుదల చేస్తుంది మరోవైపు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే అత్యధికంగా 83 బి హెచ్ పి పవర్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.
అభిప్రాయాలను అందుకొని వాటిపై పనిచేస్తూ, కార్ల తయారీదారుడు ఇప్పుడు, అత్యధికంగా 110 బి హెచ్పి పవర్ ను అదే విధంగా 170 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే అత్యంత శక్తివంతమైన 1.0 లీటర్ ఇంజన్ పై పని చేస్తున్నాడు. బాలెనో ఆర్ ఎస్ వాహనం, ఈ ఇంజన్ తో వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. కారు వినియోగదారులకు ఒక ఏకైక అనుభవాన్ని ఇవ్వడం కోసం ఎస్- క్రాస్ వాహనం తో పాటు ఈ వాహనాలను నెక్సా షోరూమ్ చానల్ ద్వారా అమ్మకాలు జరుపుతున్నారు. వీటన్నింటితో ఈ బాలెనో వాహనం, అగ్ర అమ్మకాలను కలిగిన ప్రీమియం హాచ్బాక్ విభాగంలో ఉండే ఐ 20 వాహన స్థానాన్ని సాదించింది. అయితే, హ్యుందాయ్ యొక్క వాహనం తిరిగి దాని స్థానాన్ని సాదించే అవకాశం ఎక్కువ ఉంది. ఈ ప్రీమియం హాచ్బాక్ విభాగంలో ఐ 20 వాహనం, దీర్ఘ కాలంగా ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించింది మరియు దక్షిణ కొరియన్ వాహన తయారీదారుడు ఈ స్పాట్ అందుకునే అవకాశం తక్కువగా కనిపిస్తోంది.
ఇది కూడా చదవండి:
మారుతి బాలెనో బూస్టర్ జెట్ ని ఈ సంవత్సరం పోస్ట్-IAE 2016 షోకేస్ లో ప్రారంభించవచ్చు.