• English
  • Login / Register

ఆనంద్ మహీంద్రా ఇపుడు ఫార్ములా-E జీవనాధార కమిటీలో సభ్యత్వాన్ని పొందింది

డిసెంబర్ 10, 2015 12:57 pm nabeel ద్వారా ప్రచురించబడింది

  • 16 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: 

Mahindra Racing

ముందు ఇచ్చిన నివేదిక ప్రకారం "ఎఫ్.ఐయ్.ఎ ఫార్ములా-E చ్యాంపియన్ షిప్ లో పాల్గొనే మొత్తం 10 టీమ్ లలో ఇండియా నుండి ఉన్న ఏకైక టీమ్ మహీంద్రా మాత్రమే. అక్టోబర్ లో జరిగిన ఏమ్2ఎలెక్ట్రొ ఫార్ములా-E రేస్ లో మూడవ స్టానం లో గెలిచి  నిక్ హెడ్ఫెల్డ్  తన జట్టు యొక్క మొదటి పోడియం ను పొందాడు. ఈ విజయంతో మహీంద్రా  ఒక కొత్త మైలురాయి చేరుకుంది. అంతేకాకుండా మహీంద్రా గ్రూప్ గౌరవ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఇపుడు ఫార్ములా-E రేసింగ్ ల యొక్క జీవనాధార కమిటీలో సభ్యత్వాన్ని పొందడం కూడా ఒక కొత్త శకానికి నాంది పలకనుంది. ప్రముఖ పర్యావరణ సమస్యలను గురించి చర్చించడానికి ఈ కమిటీలో వివిధ దేశాలకు చెందిన గ్లోబల్ కార్పొరేషన్లు సభ్యులుగా ఉంటాయి. 

Mahindra Racing

ఈ కమిటీలో మిస్టర్ మహీంద్రా, లియోనార్డో డికాప్రియో లతో పాటు వివిధ సిరీస్ లకు చెందిన ఇతర కంపెనీల సి ఈ వో లు కూడా ఉంటారు. వీరందరి తో ఉన్న ఈ కమిటీ, పట్టణ సంచారములో అభ్యున్నతికి మరియు సాంకేతికతల అభివృద్ధికి  కృషి చేస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలను వాడడం కోసం ప్రజల దృష్టిని మార్చడం వంటి వాటికి తోడ్పడుతుందని మహీంద్రా రేసింగ్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. మహీంద్రా గ్రూప్ గౌరవ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ ," ముఖ్యంగా పట్టణ కేంద్రాల్లో, ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచడానికి కృషి చేస్తున్న ఫార్ములా-E జీవనాధార కమిటీలో సభ్యత్వాన్ని పొందడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. మహీంద్రా గ్రూప్ యొక్క ఈ ఫ్యూచర్ మొబిలిటీ  దృష్టి తో, ప్రపంచ వ్యాప్తంగా మహీంద్రా ఆపరేట్ చేస్తున్న అన్ని దేశాలలో ఒక సానుకూల మార్పు కోసం కృషి చేస్తుందని తెలిపారు. ఫార్ములా-E యొక్క సి ఈ వో  అలెజాండ్రో ఆగగ్ మాట్లాడుతూ," మిస్టర్ మహీంద్రా ఫార్ములా-ఈ జీవనాధార కమిటీకి ఒక విలువైన చేరికగా మేము భావిస్తున్నాము. అతని అమూల్యమైన అనుభవం మరియు జ్ఞానం కేవలం  స్థిరమైన రవాణా సాంకేతికతల అభివృద్ధికి మాత్రమే పరిమితమై  ఉండకుండా, మా గ్లోబల్ స్వరాల సహకారంతో సమస్యలను పరిష్కరించడానికి మరియు ముఖ్యమైన పర్యావరణ సమస్యలకు పరిష్కారాలు కనుగొనేందుకు మరియు మరింత స్థిరమైన భవిష్యత్తు వైపు వెళ్ళేందుకు మా ప్రయాణంలో తోడ్పాటును అందిస్తారని ఆశిస్తున్నాము. 

ఇది కూడా చదవండి: 

ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రెండు కొత్త మోడల్స్ ను ప్రారంభించటానికి సిద్దంగా ఉన్న మహీంద్రా

ముంబై లో రహస్యంగా పట్టుబడిన మహీంద్రా S101

ఆకర్షణీయమైన విడుదలలు: కొనసాగింపులో ముందున్న మహీంద్రా XUV500 AT @15.36 లక్షలు

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience