• English
  • Login / Register

టాటా CNG శ్రేణిలో మరొక కొత్త కారు అల్ట్రోజ్

టాటా ఆల్ట్రోస్ 2020-2023 కోసం rohit ద్వారా మే 23, 2023 08:35 pm ప్రచురించబడింది

  • 36 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఆల్ట్రోజ్ CNG ధరలు రూ.7.55 లక్షల నుండి రూ.10.55 లక్షల వరకు ఉన్నాయి (ప్రారంభ ఎక్స్-షోరూమ్ పాన్-ఇండియా)

Tata Altroz CNG

  • ఏప్రిల్ నుండి బుకింగ్ؚలు ప్రారంభమయ్యాయి, కొన్ని యూనిట్‌లు ఇప్పటికే డీలర్ؚషిప్ؚల వద్దకు చేరుకున్నాయి.

  • ఇది 5-స్పీడ్ MTతో జోడించబడిన 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ (73.4PS/103Nm) నుండి శక్తిని పొందుతుంది.

  • ముఖ్యమైన అంశాలలో రెండు-సిలిండర్‌ల CNG సెట్అప్, 210 లీటర్‌ల బూట్ؚస్పేస్ మరియు సన్ؚరూఫ్ ఉన్నాయి. 

ఇటీవలి వారాలలో విడుదల అయిన టీజర్‌ల తరువాత, ఎట్టకేలకు టాటా ఆల్ట్రోజ్ CNG విడుదల అయ్యింది. దీన్ని జనవరిలో జరిగిన ఆటో ఎక్స్ؚపో 2023లో ఆవిష్కరించారు, ఏప్రిల్ؚలో బుకింగ్ؚలు ప్రారంభమయ్యాయి, దేశవ్యాప్తంగా కొన్ని డీలర్ؚషిప్ؚల వద్దకు ఈ వాహనం ఇప్పటికే చేరుకుంది. ఇది ఆరు వేరియెంట్ؚలలో అందిస్తున్నారు: XE, XM+, XM+ (S), XZ, XZ+ (S), మరియు XZ+ O (S).

ధర తనిఖీ 

వేరియెంట్ 

పెట్రోల్ 

CNG

తేడా 

XE

రూ. 6.60 లక్ష

రూ. 7.55 లక్ష

+రూ. 95,000

XM+

రూ. 7.45 లక్ష

రూ. 8.40 లక్ష

+రూ. 95,000

XM+ (S)

రూ. 8.85 లక్ష

XZ

రూ. 8.50 లక్ష

రూ. 9.53 లక్ష

+రూ. 1.03 లక్ష

XZ+ (S)

రూ. 10.03 లక్ష

XZ+ O (S)

రూ. 10.55 లక్ష

పై పట్టికలో చూస్తే, ప్రామాణిక పెట్రోల్ వేరియెంట్ؚల కంటే CNG వేరియెంట్ؚల ధర సుమారు ఒక లక్ష ఎక్కువగా ఉంది. 

ఇది కూడా చదవండి: త్వరలోనే మీ ఆండ్రాయిడ్ ఫోన్ డ్యాష్ؚక్యామ్ؚగా కూడా పనిచేయగలదు

తగ్గించిన అవుట్ؚపుట్

Tata Altroz CNG powertrain

ఆల్ట్రోజ్ CNGను టాటా 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚతో జోడించిన 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚతో (73.4PS/103Nm) అందిస్తుంది. పెట్రోల్ మోడ్‌లో ఇది 88PS పవర్ మరియు 115Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ పవర్ؚట్రెయిన్ؚకు కారు తయారీదారు “CNG మోడ్ؚలో స్టార్ట్ చేయడం” అనే ఫీచర్ؚను కూడా అందిస్తున్నారు, ఇది CNG విభాగంలోని ఏ ఇతర పోటీదారు అందించడం లేదు.

ఆల్ట్రోజ్ CNG USPలు

Tata Altroz CNG boot spaceనిజానికి, ఆల్ట్రోజ్ CNGలో ఉన్న ముఖ్యమైన అంశం దాని బూట్ స్పేస్. టాటా, ఈ విభాగంలో మొదటిసారిగా రెండు-సిలిండర్‌ల సాంకేతికతను తీసుకువచ్చింది – దీని వలన మొత్తం ట్యాంక్ సామర్ధ్యాన్ని రెండు సిలిండర్‌లుగా విభజించడానికి వీలయ్యింది, ఈ రెండిటినీ కార్గో భాగం అడుగున ఉంచారు. తద్వారా అందుబాటులో ఉన్న 210 లీటర్‌ల స్పేస్ؚను ప్రయాణీకులు తమ లగేజీ కోసం ఉపయోగించుకోవచ్చు.

Tata Altroz CNG sunroof
Tata Altroz CNG wireless phone charger

ఆల్ట్రోజ్ CNGలో మరొక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, మొదటిసారిగా సింగిల్-పేన్ సన్‌రూఫ్‌తో దీన్ని అందిస్తున్నారు, ఈ మోడల్‌లో దీన్ని మొదటిసారిగా పరిచయం చేస్తున్నారు మరియు ఇతర పవర్‌ట్రెయిన్ ఎంపికలలో ఇది ప్రస్తుతం అందుబాటులో లేదు. ఇవే కాకుండా, ప్రామాణిక మోడల్ؚ‌లో వచ్చే 7-అంగుళాల టచ్ؚస్క్రీన్ యూనిట్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ؚబ్యాగ్ؚలు, ఆటో క్లైమేట్ కంట్రోల్, రివర్సింగ్ కెమెరాతో సహా అవే ఎక్విప్మెంట్ؚలతో వస్తుంది. అయితే, అధిక ఫీచర్‌లు కలిగిన వేరియెంట్ؚగా CNG పవర్‌ట్రెయిన్ؚను అందించే మొదటి ప్రీమియం హ్యాచ్ؚబ్యాక్ ఇది. లెదర్ అప్ؚహోల్ؚస్ట్రీ, 16-అంగుళాల అలాయ్ వీల్స్ మరియు వైర్ؚలెస్ ఛార్జింగ్ ప్యాడ్ వంటి సౌకర్యాలను కూడా అందిస్తున్నారు.

ఇది వేటితో పోటీ పడుతుంది?

Tata Altroz CNG rear

ఆల్ట్రోజ్ CNG, మారుతి బాలెనో CNG మరియు టయోటా గ్లాంజా CNGలతో పోటీ పడుతుంది.

ఇక్కడ మరింత చదవండి: ఆల్ట్రోజ్ ఆన్ؚరోడ్ ధర

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Tata ఆల్ట్రోస్ 2020-2023

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience