దక్షిణ్ డేర్ యొక్క 7 వ ఎడిషన్ ప్రారంభించబోతున్న మారుతి సుజుకి
ఆగష్టు 03, 2015 12:23 pm bala subramaniam ద్వారా ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
చెన్నై: మారుతి సుజుకి దక్షిణ్ డేర్ యొక్క 7 వ ఎడిషన్ ను 2015, 2 వ ఆగష్టు నిన్న ఓరియన్ మాల్ వద్ద బెంగుళూర్ లో ప్రారంభించడం జరిగింది. ఈ 2015 దక్షిణ్ డేర్ ర్యాలీ లో 40 % ఎక్కువ మంది పాల్గొనడం జరిగింది. దీనితో పాటు 105 మంది జట్టు కలిగిన 170 పాల్గునే వారితో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ, 6 రోజుల వ్యవధిలో మొత్తం 2000 కిలోమీటర్లను కవర్ చేస్తుంది. అంతేకాకుండా, ఈ ర్యాలీ ను మూడు వర్గాలుగా విభజించారు. అవి వరుసగా, ఎండ్యూరెన్స్, అల్టిమేట్ కార్ మరియు అల్టిమేట్ బైక్.
ఈ 2015 దక్షిణ్ డేర్, దేవంగిరే, షిమోగా, హంపి, గుల్బర్గా, చిత్రదుర్గ మరియు బెల్లారీ వంటి ప్రకృతిసిద్ధమైన టెర్రైన్స్ లో పాల్గునే వారిని కవర్ చేస్తుంది. ఈ ర్యాలీ లో విజేతలుగా గెలిచిన వారిని ముత్యాల నగరమైన హైదరాబాద్ లో ఆగస్ట్టు 8, 2015 న సత్కరించడం తో ముగిస్తారు.