Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

6 కొత్త హ్యుందాయ్ క్రెటా 2020 ప్రత్యర్థులు 2021 నాటికి చేరుకోనున్నాయి

హ్యుందాయ్ క్రెటా 2020-2024 కోసం sonny ద్వారా మార్చి 19, 2020 03:34 pm ప్రచురించబడింది

కాంపాక్ట్ SUV విభాగంలో కొరియన్ సమర్పణ యొక్క రెండవ తరం ప్రత్యర్థిగా మరికొన్ని కార్లు ప్రవేశించనున్నాయి

కియా సెల్టోస్ నుండి సెగ్మెంట్ సింహాసనాన్ని తిరిగి పొందటానికి రెండవ తరం హ్యుందాయ్ క్రెటా మార్చి 16 న ప్రయోగించడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుత ప్రత్యర్థుల పైన, కొత్త క్రెటా త్వరలో రాబోతున్న కొన్ని కాంపాక్ట్ SUV ల నుండి పోటీని కూడా ఎదుర్కోనుంది. ఈ ప్రత్యర్థులలో చాలామంది ఆటో ఎక్స్‌పో 2020 లో కూడా ప్రివ్యూ చేయబడ్డారు. ఇక్కడ అవి ఉన్నాయి:

మారుతి సుజుకి S-క్రాస్ పెట్రోల్

ప్రారంభం: ఏప్రిల్ 2020

ఆశించిన ధర: రూ .8.5 లక్షల నుంచి రూ .12 లక్షలు

మారుతి S-క్రాస్ భారతదేశంలో తొలిసారిగా పెట్రోల్ ఇంజన్ పొందనుంది. దీని 1.3-లీటర్ డీజిల్ ఇంజిన్ స్థానంలో ఎర్టిగా, XL 6, సియాజ్ మరియు ఫేస్‌లిఫ్టెడ్ విటారా బ్రెజ్జాలో లో అందించే BS6-కంప్లైంట్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ అందించబడుతుంది. పెట్రోల్ యూనిట్ 105Ps పవర్/ 138Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది మరియు 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ కలిగి ఉంటుంది. S-క్రాస్ ఆటోమేటిక్ ఆప్షన్ ని పొందడం ఇదే మొదటిసారి.

రెనాల్ట్ డస్టర్ టర్బో

ఊహించిన ప్రారంభం: ఆగస్టు 2020

ఆశించిన ధర: రూ .13 లక్షలు

మారుతి మాదిరిగా, BS 6 యుగంలో రెనాల్ట్ డీజిల్ ఇంజన్లను నిలిపివేస్తుంది. కొత్త టర్బో వేరియంట్ కోసం డస్టర్ కొత్త 1.3-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ ను పొందనుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు CVT ఆటోమేటిక్ ఎంపికతో 156Ps పవర్ మరియు 250Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన డస్టర్ టర్బో లో సాధారణ SUV కంటే స్పోర్టియర్ కాస్మెటికిస్ కూడా ఉన్నాయి. ఇది భారతదేశంలో అత్యంత శక్తివంతమైన కాంపాక్ట్ SUV గా ఉంటుంది, కొత్త క్రెటా మరియు సెల్టోస్‌ లలో లభించే 1.4-లీటర్ టర్బో-పెట్రోల్ కంటే ఎక్కువ పనితీరును అందిస్తుంది. ఈ 1.3-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ తరువాత నిస్సాన్ కిక్స్ కూడా SUV కి జోడించబడుతుందని భావిస్తున్నాము.

వోక్స్వ్యాగన్ టిగువాన్

హ్యుందాయ్ క్రెటా డీజిల్ఊహించిన ప్రారంభం: ఏప్రిల్ 2021

ఆశించిన ధర: రూ .10 లక్షల నుంచి రూ .16 లక్షలు

వోక్స్వ్యాగన్ తన డీజిల్ ఇంజిన్లను BS 6 ఎరా కోసం తొలగిస్తోంది మరియు భారతదేశంలో పలు రకాల SUV లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. టైగన్ కాంపాక్ట్ SUV వోక్స్వ్యాగన్ యొక్క మొట్టమొదటి సమర్పణ, దాని కొత్త స్థానికీకరించిన MQB A0 IN ప్లాట్‌ఫారమ్‌లో నిర్మించబడింది. ఇది రెండు కొత్త టర్బో-పెట్రోల్ ఇంజన్లతో పవర్ ని అందుకుంటుంది: ఒకటి 1.0-లీటర్ TSI (110 Ps / 200 Nm) మరియు ఇంకొకటి 1.5-లీటర్ TSI యూనిట్ (150 Ps/ 250 Nm) CNG వేరియంట్‌ తో తరువాత అందించబడుతుందని భావిస్తున్నాము. 1.0-లీటర్ టర్బో యూనిట్ ఇప్పటికే భారతదేశంలో BS 6-కంప్లైంట్ పోలో మరియు వెంటోలో ప్రారంభమైంది. వోక్స్వ్యాగన్ టైగన్ యొక్క రెండు ఇంజిన్ ఎంపికలను 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ అలాగే DSG (డ్యూయల్-క్లచ్) ఆటోమేటిక్ (1.5-లీటర్) ట్రాన్స్మిషన్లతో అందిస్తుందని భావిస్తున్నాము. ఈ కాంపాక్ట్ SUV క్రెటా కంటే చిన్నది కాని ఇది కనెక్ట్ చేయబడిన కార్ టెక్, 10.25-ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు పెద్ద సెంట్రల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లను ప్యాక్ చేస్తుంది.

స్కోడా విజన్

ఊహించిన ప్రారంభం: ఏప్రిల్ 2021

ఆశించిన ధర: రూ .10 లక్షల నుంచి రూ .16 లక్షలు

వోక్స్వ్యాగన్ టైగన్ మాదిరిగానే VW గ్రూప్ యొక్క MQB AO IN ప్లాట్‌ఫామ్‌ లో కూడా స్కోడా SUV నిర్మించబడుతుంది మరియు ఆటో ఎక్స్‌పో 2020 లో విజన్ IN కాన్సెప్ట్ ద్వారా ప్రివ్యూ చేయబడింది. టైగన్ మాదిరిగానే 1.0-లీటర్ మరియు 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్లతో ఇది అందించబడుతుంది. రెండు ఇంజన్లు మాన్యువల్, ఆటోమేటిక్ మరియు DSG ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ల ఎంపికతో అందించబడతాయి. స్కోడా కాంపాక్ట్ SUV కి CNG వేరియంట్ కూడా లభిస్తుంది. ఇది టైగన్‌ తో దాని ఫీచర్ జాబితాను పంచుకుంటుందని మరియు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సన్‌రూఫ్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు రిమోట్ ఫంక్షన్లతో కనెక్ట్ చేయబడిన టెక్ కలిగి ఉంటుంది.

MG ZS

ఊహించిన ప్రారంభం: 2021 ఫ్రారంభంలో

ఆశించిన ధర: రూ .12 లక్షల నుంచి రూ .17 లక్షలు

MG ZS ప్రస్తుతం భారతదేశంలో దాని స్వచ్ఛమైన EV అవతారంలో అందించబడుతుంది. అయితే, ZS యొక్క పెట్రోల్ పవర్డ్ వెర్షన్ హ్యుందాయ్ క్రెటా తో పోటీ పడేందుకు భారతదేశానికి చేరుకుంటుంది. ZS ను ఫేస్‌లిఫ్టెడ్ అవతార్‌లో ఇక్కడికి తీసుకురానుంది మరియు 1.3-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజిన్‌ తో 160 Ps మరియు 230Nm ని ఉత్పత్తి చేస్తుంది. అంతర్జాతీయ స్పెక్‌లో, MG ZS ఆరు ఎయిర్‌బ్యాగులు, 10.1- ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కనెక్ట్ చేయబడిన కార్ టెక్ మరియు పనోరమిక్ సన్‌రూఫ్ వంటి లక్షణాలను అందిస్తుంది.

హవల్ F5

ఊహించిన ప్రారంభం: 2021

ఆశించిన ధర: రూ .12 లక్షల నుంచి రూ .17 లక్షలు

ఆటో ఎక్స్‌పో 2020 చైనీస్ ఆటోమోటివ్ గ్రూప్ గ్రేట్ వాల్ మోటార్స్ (GWM) యొక్క భారతీయ తొలి ప్రదర్శనగా నిలిచింది, వారు దాని హవల్ బ్రాండ్ SUV లను ప్రదర్శించారు. హవల్ F5 భారతదేశంలో కాంపాక్ట్ SUV విభాగానికి బ్రాండ్‌ లోకి ప్రవేశిస్తుంది మరియు 2021 లో GWM యొక్క మొట్టమొదటి ప్రారంభం కావచ్చు. F5 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ తో పనిచేస్తుంది, ఇది 168Ps / 285 Nm ఉత్పత్తిని కలిగి ఉంటుంది, అయితే 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్‌ తో జతచేయబడుతుంది. అయితే, ఇండియా-స్పెక్ మోడల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎంపికను కూడా అందిస్తుంది. ప్రస్తుత చైనా-స్పెక్ మోడల్ 12.3-ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 9-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు మరిన్నింటితో ఈ క్రెటా ప్రత్యర్థి కూడా ఫీచర్-రిచ్ ఆఫర్‌ గా ఉంటుంది.

మరింత చదవండి: హ్యుందాయ్ క్రెటా డీజిల్

s
ద్వారా ప్రచురించబడినది

sonny

  • 49 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన హ్యుందాయ్ క్రెటా 2020-2024

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర