• English
  • Login / Register

542బీహెచ్‌పీ యొక్క భీబత్సం: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌వీఆర్ అమ్మకానికి సిద్దంగా ఉంది

అక్టోబర్ 12, 2015 12:49 pm అభిజీత్ ద్వారా ప్రచురించబడింది

  • 24 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

Range Rover Sport SVR Front

ల్యాండ్ రోవర్ యొక్క ఎస్‌యూవీ అయిన రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌వీఆర్ ఇప్పుడు భారతదేశంలో రూ. 2.12 కోట్ల ధరకి అందుబాటులో ఉంది. దీనికి 5.0-పెట్రోల్ నిండిన V8 ఇంజిను ఉండి, ఇది 542bhp యొక్క శక్తిని ఇంకా 680Nm టార్క్ ని విడుదల చేస్తుంది. ఇది పోర్షే కయేన్ టర్బో ఎస్ ఇంకా మెర్సిడేజ్ ఎంఎల్63 ఏఎంజీ లతో పోటీ పడనుంది.

Range Rover Sport SVR Side

ఈ వాహనం పరీక్షించబడింది మరియూ ఎక్స్-జేఎలార్ అధినేత అయిన జాన్ ఎడ్వర్డ్ గారి పర్యవేక్షణలో నర్బర్గ్‌రింగ్ రేసు సర్క్యూట్ లో ప్రత్యేకంగా మెరుగుపరచబడింది.

పనితీరు గురించి మాట్లాడుతూ, ఇది 4.5 సెకనుల్లో 0 నుండి గంటకి 100 కీ.మీ వేగన్ని చేరుకుంటుంది మరియూ గరిష్టంగా గంటకి 261 కీ.మీ వేగన్ని చేరుతుంది. ఇది సాధించేందుకు, ఇంజినులో ఎంతో సామర్ధ్యం చేర్చడం అయ్యింది. ఇందులో 8-స్పీడ్ ZF గేర్‌బాక్స్ తో ప్యాడల్ షిఫ్టర్స్ మరియూ శశ్వత ఆల్-వీల్ డ్రైవ్ సిస్టము కాకుండా దీనికి మంచి ట్రాక్షన్ కోసం డైనమిక్ ఆక్టివ్ రేర్ లాకింగ్ డిఫరెన్షియల్ టెక్నాలజీ కూడా ఉంది. క్లచ్ టైప్ టార్క్ వెక్టరింగ్ సిస్టములో లాగానే బ్రేకింగ్ విషయంలో డైనమిక్ టార్క్-వెక్టరింగ్ సిస్టము కూడా పనిచేస్తుంది కానీ డైనమిక్ స్టబిలిటీ కంట్రోల్ వేగంలో మరింత పదునుగా పనిచేస్తుంది.

రెండు-ఎగ్జాస్ట్ సిస్టముకి స్వంతంగా పనిచేసే తెలివి ఉంది ఎందుకంటే ఇది వీటి ఎలక్ట్రానికల్లీ కంట్రోల్డ్ వాల్వులు స్పోర్ట్స్ కారు మాదిరి తెరుచుకుంటాయి. జేఎలార్ ల F-టైప్ ప్రపంచంలోనే ఉత్తమమైన స్పోట్స్ కారు మరియూ ఎస్‌వీఆర్ కూడా అవే బెల్లోస్, బార్ప్స్ ఇంకా క్రాకల్స్ కలిగి ఉంటుంది.

ఆఫ్-రోడబిలిటీ గురించి మాట్లాడుతూ, 850mm లోతు వేడింగ్ డెప్త్ కలిగి, లో రేషియో గేర్‌బాక్స్, సెంట్రల్ ట్రాన్స్ఫర్ కేస్ లో ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్ మరియూ ఆల్-వీల్ డ్రైవ్ మెకనిజం కలిగి ఉంటుంది.

ఈ కారు కి 21-అంగుళాల అల్లోయ్ వీల్స్ తో 275/45 R21 టైర్లను జత చేయబడి ఉంటాయి. పైగా ఆప్షనల్ 22-అంగుళాల తో 295/40 R22 కాంటినెంటల్ స్పోర్ట్‌కాంటాక్ట్ 5 రబ్బరు కూడా అందుబాటులో ఉంటాయి. వీటితో పాటుగా పిస్టన్ కాలిపర్ బ్రెంబో బ్రేకులు కూడా ఉంటాయి.

కొన్ని సున్నితమైన మార్పులు ఉన్నాయి. అవి, కొత్త ముందు మరియూ వెనుక బంపర్ తో పెద్ద ముందు ఇంకా వెనుక వైపు బంపర్లతో పెద్ద ఎయిర్ ఇంటేక్, కొత్త గ్రిల్లు ఫినిషింగ్, కొద్దిగా పొడిచినట్టుండే వీల్ అర్చెస్ మరియూ అనుసంధానం అయ్యిన రేర్ డిఫ్యూజర్ తో క్వాడ్ ఎగ్జాస్ట్స్ వంటివి. లోపల వైపు 4 వర్ణాల ఎంపిక గల లెదర్ అప్‌హోల్స్టరీ, అలిమినం ఇంకా కార్బన్ ఫైబర్ ట్రిం లలో ఎంపిక ఇవ్వబడుతుంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience