540 హెచ్ పి కలిగిన డిబి9 మోడల్ బహిర్గతం మరియు 2016 వాన్టేజ్, రాపిడే ఎస్ లను ప్రవేశపెట్టడానికి సిద్దంగా ఉన్న ఆస్టన్ మార్టిన్

modified on జూన్ 25, 2015 03:38 pm by bala subramaniam కోసం ఆస్టన్ మార్టిన్ డిబి9

  • 10 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

చెన్నై:ఆస్టన్ మార్టిన్ యొక్క డిబి9 ను బహిర్గతం చేసింది. ఇప్పుడు, డిబి9 జిటి శక్తివంతమైన 6.0-లీటర్ వి12 ఇంజిన్ తో రానుండి. ఈ ఇంజన్ 540 హెచ్ పి పవర్ ను విడుదల చేశేలా దీనిని రూపొందించి మనకు పరిచయం చేస్తున్నారు. ఈ వారంయుకె లో నిర్వహించనున్న గుడ్వుడ్ ఫెస్టివల్ లో దీనిని బహిరంగంగా ప్రవేశపెట్టబోతున్నారు. అంతేకాకుండా, కంపెనీ, 2016 వాన్టేజ్ మరియు రాపిడ్ఎస్ మోడల్స్ కు సంబందించిన రంగు, వేరియంట్లు మరియు సామగ్రి ఉపకరణాల వివరాలను కూడా ప్రకటించింది.

ఈ కొత్త డిబి9 జిటి 6.0-లీటర్ల వి12 పెట్రోల్ ఇంజన్ 6750 ఆర్ పిఎమ్ వద్ద అత్యధికంగా 540 హెచ్ పి పవర్ ను మరియు 5,500 ఆర్ పి ఎం వద్ద 620 నానో మీటర్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ముందు భాగంలో ఉన్న మధ్య మౌంట్ వి12 క్వాడ్ ఓవర్హెడ్ క్యామ్, అల్లాయ్ రూపం లో వస్తుంది మరియు ఇది రేర్ మిడ్ మౌంట్ టచ్ ట్రానిక్ -2 సిక్స్ స్పీడ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ తో జత చేయబడి ఉంటుంది దీనితో పాటు  ఎలక్ట్రానిక్ షిఫ్ట్-బై-వైర్ నియంత్రణ వ్యవస్థతో రాబోతుంది. ఈ డిబి9 జిటి వాహనం 0 నుండి 60mph వేగాన్ని చేరుకోవడానికి 4.4 సెకన్ల సమయం పడుతుంది. మరోవైపు, ఈ వాహనం అత్యధికంగా 183mph వేగాన్ని చేరుకోగలుగుతుంది. 

అయితే, దీనిలో ఇండిపెండెంట్ డబుల్ విష్బోన్ సస్పెన్షన్ వ్యవస్థ ఉన్నప్పటికీ, డిబి9 జిటి అధనంగా త్రీ స్టేజ్ అడాప్టివ్ డాంపింగ్ సిస్టమ్ ని, సాధారణ, స్పోర్ట్ మరియు ట్రాక్ మోడ్ లలో కలిగి ఉంది. అంతర్భాగాల విషయానికి వస్తే కారు ఎఎంఐII టచ్ సెన్సిటివ్ ఆస్టన్ మార్టిన్ సమాచార వ్యవస్థ ని కలిగి ఉంది. దీనిలో సవరించిన మెను నిర్మాణం అందించబడినది. ఈ వ్యవస్థ ముందు దాని కంటే చాలా మెరుగైనది. ఎ ఎం ఐ II సమాచార ప్యాకేజీ టెక్స్ట్ మెసేజ్ ఇంటిగ్రేషన్, వాహనం స్థితి సమాచారం మరియు విస్తరించిన నేపథ్య థీమ్స్ లో అభివృద్ది పొంది రాబోతుంది.

ఈ కొత్త డిబి 9 జిటి సూక్ష్మమైన జిటి బ్యాడ్జ్లులను కలిగి ఉంటుంది. వీటితో పాటూ నల్ల రంగుతో పెయింట్ చేయబడిన స్ప్లిట్టర్ మరియు డిఫ్యూజర్, నవీకరించబడిన హెడ్ లైట్ మరియు టెయిల్ లైట్ ట్రీట్మెంట్స్, కొత్త 10- స్పోక్-20 అంగుళాల అలాయ్ వీల్స్ మరియు నలుపు ఆనోడైజెడ్ బ్రేక్ కాలిపర్స్లను కూడా కలిగి ఉంది. వీటిలో కార్బన్ ఫైబర్ టైల్ ల్యాంప్ ఇన్సర్ట్స్, సైడ్ స్ట్రాక్స్, ముందు స్ప్లిట్టర్ మరియు వెనక డిఫ్యూజర్; గ్రాఫైట్, డైమండ్ తో మార్పు చేయబడిన 10 స్పోక్ అల్లాయ్ చక్రాలు మరియు ప్రత్యామ్నాయ బ్రేక్ కాలిపర్ రంగులు వినియోగదారులు ఎంచుకొనేందుకు అందుబాటులో ఉన్నాయి. లోపల, 2 + 2 సీటింగ్, 'గ్లెన్ కో' లెథర్ అపోలిస్ట్రీ ను కలిగి దానిపై జిటి అంబ్రోయిడరీ ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, స్టీరింగ్ వీల్ పై ఆల్కాంటరా లెధర్ తో చుట్టబడి ఇరిడియం ఫినిష్ ను కలిగి ఉంటుంది

ఆస్టన్ మార్టిన్ 2016 వాన్టేజ్ మరియు రాపిడే ఎస్ నమూనాల రాకను కూడా ప్రకటించింది. దీనితో పాటూ ట్రిమ్ మరియు ఒక కొత్త టచ్ సెన్సిటివ్ సెంటర్ కన్సోల్ తో పాటుగా పరికరాల విస్తరింపులను తీసుకురాబోతున్నదని ప్రకటించారు. ఎ ఎం ఐ II సమాచార వ్యవస్థ కూడా దీనిలో కొత్తగా రాబోతుందని తెలిపారు. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన Aston Martin డిబి9

Read Full News

trendingకూపే

  • లేటెస్ట్
  • ఉపకమింగ్
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience