కియా సెల్టోస్ ఫేస్ؚలిఫ్ట్ నుండి 2024 హ్యుందాయ్ క్రెటా పొందనున్న 5 అంశాలు
మరిన్ని ఫీచర్‌లను కలిగి ఉన్న కాంపాక్ట్ SUVలలో ఒకటిగా నిలవడానికి, క్రెటా ఫేస్ؚలిఫ్ట్ కొత్త సెల్టోస్ నుండి అనేక ఫీచర్‌లను పొందనుంది
కియా సెల్టోస్ ఫేస్ؚలిఫ్ట్ ఇటీవల భారతదేశంలో ప్రవేశపెట్టారు, త్వరలోనే ఇది మార్కెట్‌లో విడుదల కానుంది. ఈ అప్‌డేట్‌డ్ మోడల్ లుక్ పరంగా లోపల మరియు వెలుపల అనేక మార్పులను, కొత్త ఫీచర్‌లను, మరింత శక్తివంతమైన టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను పొందింది. విడుదలైన నాలుగు సంవత్సరాల నుండి సెల్టోస్ పొందిన మొదటి భారీ అప్‌డేట్ ఇది, వీటిలో అనేక మార్పులు 2024లో రానున్న కొరియన్ మోడల్, హ్యుందాయ్ క్రెటా ఫేస్ؚలిఫ్ట్‌లో కూడా ఉంటాయని అంచనా.
డిజైన్ పరంగా ఈ రెండు వాహనాలు తమ ప్రత్యేకతలను కొనసాగిస్తున్నపటికి, పవర్‌ట్రెయిన్ పరంగా రెండు SUVలు ఒకే విధంగా ఉంటాయని చెప్పవచ్చు. ఫేస్ؚలిఫ్టెడ్ సెల్టోస్ నుండి 2024 క్రెటా పొందగల 5 ముఖ్యమైన ఫీచర్‌లు మరియు అప్ؚడేట్‌లు ఇవి:
డ్యూయల్ 10.25-అంగుళాల డిస్ప్లేలు
సెల్టోస్ؚలో టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్ؚమెంట్ సిస్టమ్ కోసం ఒకటి మరియు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం మరొకటి 10.25-అంగుళాల కనెక్టెడ్ డిస్ప్లేలు ఉన్నాయి. ప్రస్తుతం క్రెటా 10.25-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ యూనిట్ మరియు సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ؚతో వస్తుంది. క్రెటా ఫేస్ؚలిఫ్ట్ؚలో కూడా ఇటువంటి లేఅవుట్ؚను చూడవచ్చు, ఇది క్రెటా క్యాబిన్‌ను మరింత ప్రీమియంగా చేస్తుంది.
ADAS
సెల్టోస్ ఫేస్ؚలిఫ్ట్‌కు ముఖ్యమైన జోడింపులలో ఒకటి రాడార్-ఆధారిత ADAS. ఈ క్రియాశీల భద్రత ఫీచర్‌ల స్యూట్ క్రెటా ఫేస్ؚలిఫ్ట్‌లో కూడా అందించవచ్చు. టక్సన్ SUV మరియు వెర్నా సెడాన్ؚలను అనుసరించి, తమ కార్లలో అనేక ADASతో వస్తాయని హ్యుందాయ్ ఇప్పటికే ధృవీకరించింది.
రిఫరెన్స్ కోసం, సెల్టోస్ ADAS స్యూట్ؚలో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్. లేన్-కీప్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, హై-బీమ్ అసిస్ట్ మరియు అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ ఉన్నాయి.
ఇది కూడా చదవండి: ఈ 15 చిత్రాలలో ఫేస్ؚలిఫ్టెడ్ కియా సెల్టోస్ؚను దగ్గరగా చూడండి
డ్యూయల్-జోన్ AC
సెల్టోస్ ఫేస్ؚలిఫ్ట్ؚలో ఈ విభాగంలోనే మొదటిసారిగా అందిస్తున్న డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్‌తో వస్తుంది, ఇది 2024 క్రెటాలో కూడా ఉండవచ్చు. ఇది మెరుగైన భావనను అందించే ఫీచర్, కొనుగోలుదారులకు అధిక సౌకర్యాన్ని ఇస్తుంది మరియు మహీంద్రా XUV700 వంటి కాంపాక్ట్ SUVలలో అందించే ప్రీమియం ఫీచర్ సెట్ؚలకు సమానంగా దీన్ని నిలుపుతుంది.
1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్
160PS/253Nm 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ؚతో, ఫేస్ؚలిఫ్టెడ్ సెల్టోస్ ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న అత్యంత శక్తివంతమైన కాంపాక్ట్ SUV. వెర్నా మరియు క్యారెన్స్ؚలలో కూడా ఇదే ఇంజన్‌ను చూడవచ్చు మరియు 2024 క్రెటాలో కూడా ఇదే వస్తుంది. సెల్టోస్ؚలోని ఈ ఇంజన్, 6-స్పీడ్ iMT మరియు 7-స్పీడ్ DCTతో జోడించబడుతుంది. అయితే క్రెటాలో iMT (క్లఛ్ పెడల్ లేకుండా మాన్యువల్) ఎంపిక ఉండకపోవచ్చు, కానీ 3-పెడల్ మాన్యువల్ స్టిక్ ఉంటుంది.
ఇది కూడా చదవండి: చిత్రం పోలిక: కొత్త కియా సెల్టోస్ Vs పాతది
స్పోర్టీ లుక్‌తో వెనుక భాగం
ఇంతకముందు తెలిపినట్లు, లుక్ పరంగా సెల్టోస్ మరియు క్రెటా వాటి ప్రత్యేకతలను కొనసాగిస్తున్నపటికి, కానీ ఏదో ఒక రూపంలో వాటి స్టైలింగ్ చిహ్నాలు కొనసాగుతున్నాయి. సెల్టోస్ ఫేస్ؚలిఫ్ట్‌లో భారీ ఎక్స్ؚటీరియర్ మార్పులలో సరికొత్త వెనుక భాగం, కనెక్టెడ్ LED టెయిల్ؚల్యాంపులు మరియు కొత్త డ్యూయల్-టిప్ ఎగ్జాస్ట్ ఉన్నాయి.
వెనుక భాగంలో క్రెటా ఫేస్ؚలిఫ్ట్ కనెక్టెడ్ లైటింగ్ సెట్అప్ؚను కూడా పరిచయం చేయవచ్చు. హ్యుందాయ్ SUV టర్బో-పెట్రోల్ వేరియెంట్ؚలు ఇప్పటికే డ్యూయల్-టిప్ ఎగ్జాస్ట్ؚతో వస్తున్నాయి, సెల్టోస్ ఫేస్ؚలిఫ్ట్ؚలో భిన్నమైన సెట్అప్ ఉంటుంది, బంపర్ ప్రతి చివర ఒక టిప్ ఉంటుంది. ఇది విభిన్నమైన ఎగ్జాస్ట్ నోట్ؚకు దారి తీస్తుంది, 160PS టర్బో-పెట్రోల్ ఇంజన్ పనితీరుతో సరిపోలడానికి దీన్ని కొత్త క్రెటాలో అందించవచ్చు.
కియా సెల్టోస్ ఫేస్ؚలిఫ్ట్ నుండి 2024 హ్యుందాయ్ క్రెటాలో కొనసాగుతాయని ఆశిస్తున్న ముఖ్యమైన అప్ؚడేట్ؚలు మరికొన్ని ఉన్నాయి. ఈ అప్ؚడేట్ؚలతో, హ్యుందాయ్ SUV ప్రస్తుత ధరల కంటే ఎక్కువ ధరలతో వస్తుందని అంచనా, రూ.10.87 లక్షల నుండి 19.20 లక్షల (ఎక్స్-షోరూమ్) పరిధిలో ఉండవచ్చు.
ఇక్కడ మరింత చదవండి : సెల్టోస్ డీజిల్