మారుతి బాలెనో CNGతో పోలిస్తే టాటా ఆల్ట్రోజ్ؚ అధికంగా అందించిన 5 ఫీచర్‌ల వివరాలు
టాటా ఆల్ట్రోస్ 2020-2023 కోసం ansh ద్వారా ఏప్రిల్ 24, 2023 11:33 am ప్రచురించబడింది
- 53 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
టాటా CNG హ్యాచ్ؚబ్యాక్ బుకింగ్ؚలు ప్రారంభమయ్యాయి మరియు డెలివరీలు వచ్చే నెల నుండి ప్రారంభమవుతాయి
అల్ట్రోజ్ CNGని టాటా ఆటో ఎక్స్‌పో 2023లో ప్రదర్శించింది మరియు ఈ వాహన బుకింగ్‌లను ఇటీవలే ప్రారంభించింది, తద్వారా విడుదల త్వరలోనే ఉంటుందని సూచించింది. ఈ ప్రీమియం CNG హ్యాచ్‌బ్యాక్ నేరుగా మారుతి బాలెనో CNGతో అంతేకాకుండా టయోటా గ్లాంజా CNGతో పోటీ పడనుంది. ఈ రెండిటి కంటే ఎక్కువగా ఇదేం అందిస్తోందో చూద్దాం:
సన్ؚరూఫ్
చెప్పుకోదగిన ఫీచర్ జోడింపు అయిన సన్‌రూఫ్ నుండి ప్రారంభిద్దాం. ఆల్ట్రోజ్ CNGలో ఈ ఫీచర్ జోడింపు ఉంటుందని ఇటీవలే టీజర్ؚతో టాటా నిర్ధారించింది. ఆటో ఎక్స్ؚపో ప్రదర్శనలో దీని ప్రివ్యూ చూపించింది. ఈ CNG హ్యాచ్‌బ్యాక్ؚ విడుదల అయిన తరువాత, ఈ విభాగంలో ఈ ఫీచర్ؚను అందించే ఏకైక మోడల్‌గా ఇది నిలుస్తుంది.
ఇది కూడా చదవండి: ఈ ఏప్రిల్‌లో రూ.35,000 వరకు ప్రయోజనాలతో టాటా కార్ؚను కొనుగోలు చేయండి
టాటా ఆల్ట్రోజ్ పెట్రోల్ మరియు డీజిల్ వేరియెంట్‌లలో కూడా సన్‌రూఫ్ ఫీచర్‌ను జోడించవచ్చు, హ్యుందాయ్ i20 తరువాత ఈ విభాగంలో సన్‌రూఫ్ؚను కలిగిన రెండవ మోడల్‌గా ఇది నిలుస్తుంది.
రెండు-సిలిండర్ సాంకేతికత


CNG-ఆధారిత కార్ؚలతో తరచుగా ఎదురయ్యే ఇబ్బందులలో, భారీ CNG సిలిండర్ కారణంగా బూట్‌స్పేస్ నష్టపోవడం. ట్విన్-సిలిండర్ సెటప్ؚను సృష్టించడం ద్వారా టాటా ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొన్నది, ఈ సెటప్ؚలో భారీ CNG ట్యాంక్ؚకు బదులుగా, సమానమైన సామర్ధ్యం కలిసిన రెండు చిన్న సిలిండర్‌లను బూట్ బెడ్ క్రింద అమర్చబడాయి. ఈ విధంగా, కస్టమర్‌లు తమ లగేజీని తేలికగా ఉంచేందుకు బూట్ స్పేస్‌ను పొందగలరు.
CNG మోడ్ؚలో నేరుగా స్టార్ట్ చేయడం
బాలెనో మరియు గ్లాంజా CNGతో సహా అనేక CNG-ఆధారిత కార్‌లను ముందుగా పెట్రోల్ మోడ్ؚలో ప్రారంభించి, తర్వాత CNGకి మారాలి. ఆల్ట్రోజ్ వంటి టాటా CNG మోడల్‌లలో, CNG మోడ్ؚలో నేరుగా స్టార్ట్ చేయగలిగే ఫీచర్ؚను కలిగి ఉన్నాయి. ఇది చిన్న సౌకర్యం కావచ్చు, కానీ ఒక దశాబ్ధం కంటే ఎక్కువ కాలం నుండి CNG మోడల్‌లను అందిస్తున్న మారుతిలో ఇది లేదు.
రెయిన్ సెన్సింగ్ వైపర్
టాటా ఆల్ట్రోజ్, XZ మరియు ఆపై టాప్ వేరియెంట్ؚలు, రెయిన్-సెన్సింగ్ వైపర్ వంటి ప్రీమియం ఫీచర్‌లతో వస్తాయి. పోటీదారుల విధంగా కాకుండా, కొత్త CNG వేరియెంట్‌లను కూడా ఈ ఫీచర్‌ల ఎంపికతో అందిస్తున్నారు కాబట్టి, ఈ విభాగంలో వీటిని అందించే ఏకైక వాహనంగా ఆల్ట్రోజ్ CNG నిలుస్తుంది. ఈ ఫీచర్ పేరుకు తగినట్లుగా, డ్రైవర్ నుండి ఎటువంటి ఇన్‌పుట్ లేకుండా, వాన పడినప్పుడు స్వయంచాలకంగా వైపర్‌లను క్రియాశీలం చేస్తుంది, మారుతి మరియు టయోటా-బ్యాడ్జ్ కలిగిన పోటీదారులలో ఈ ఫీచర్ అందుబాటులో లేదు.
క్రూజ్ కంట్రోల్
టాప్-వేరియెంట్ؚలకు CNG పవర్‌ట్రెయిన్ؚను అందించడం ద్వారా ఈ హ్యాచ్ؚబ్యాక్ؚకు టాటా అందించిన మరొక సౌకర్యం ఏమిటంటే, ఆల్ట్రోజ్ CNGని క్రూజ్ కంట్రోల్ ఫీచర్ؚతో అందించడం, హైవే డ్రైవింగ్ కోసం ఇది చాలా ఉపయోగకరమైన ఫీచర్. బాలెనో మరియు గ్లాంజాలో ఈ ఫీచర్ ఉన్నపటికి, ఈ రెండు మిడ్-సైజ్ వేరియెంట్ؚలలో మాత్రమే CNG పవర్ట్రెయిన్ؚను అందిస్తుంది కాబట్టి వీటిలో ఏ CNG మోడల్ ఈ ఫీచర్ లేదు.
CNG ఆల్ట్రోజ్ؚను టాటా నాలుగు వేరియెంట్‌లలో అందిస్తుంది: XE, XM+, XZ మరియు XZ+ S, రూ.6.45 లక్షల నుండి రూ.10.40 లక్షల (ఎక్స్-షోరూమ్) పరిధిలో ధర ఉండే ప్రామాణిక ఆల్ట్రోజ్‌తో పోలిస్తే వీటి ధర ఒక లక్ష రూపాయల వరకు అధికంగా ఉంటుందని అంచనా.
ఇక్కడ మరింత చదవండి : టాటా ఆల్ట్రోజ్ ఆన్ؚరోడ్ ధర