2024లో 3 కొత్త కార్లను విడుదల చేయనున్న kia
కియా సోనేట్ కోసం rohit ద్వారా డిసెంబర్ 20, 2023 09:37 pm సవరించబడింది
- 285 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
కియా 2023 లో ఒకే ఒక కారును విడుదల చేసినప్పటికీ, 2024 లో భారతదేశంలో కొన్ని ఫ్లాగ్షిప్ ఆఫర్‌లతో మూడు కొత్త కార్లను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఫేస్లిఫ్ట్ కియా సెల్టోస్ 2023 లో కంపెనీ నుండి భారతదేశంలో విడుదల చేయబడిన ఏకైక కారు. దాని ప్రత్యర్థులతో పోలిస్తే కియా ఈ సంవత్సరం నెమ్మదిగా ఉన్నట్టు కనిపించింది. ఏదేమైనా, ఫ్లాగ్షిప్ EV సహా 2024లో 3 కొత్త కార్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. 2024లో ఏ కార్లు విడుదల అవ్వనున్నాయో తెలుసుకోండి.
కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్
ఫేస్ లిఫ్టెడ్ కియా సోనెట్ ఇటీవల భారతదేశంలో ఆవిష్కరించబడింది. దీని ఎక్స్టీరియర్, ఇంటీరియర్ కు సంబంధించిన అన్ని వివరాలు వెల్లడయ్యాయి. కొత్త నవీకరణతో, సబ్-4m SUV మునుపటి కంటే బోల్డ్ గా మరియు పదునుగా మారడమే కాకుండా, అనేక ఫీచర్లను (భద్రతా ఫీచర్ నవీకరణలతో సహా) పొందుతుంది. ఇందులో ఇప్పటికీ పాత సోనెట్ కారు వంటి పవర్ట్రెయిన్ ఎంపికలను అందించారు. ఈ SUV కారులో డీజిల్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ ఎంపికను కూడా జోడించారు.
ఆశించిన విడుదల తేదీ: జనవరి 2024
అంచనా ధర: రూ.8 లక్షలు
కొత్త కియా కార్నివాల్
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇప్పుడు ఎట్టకేలకు నాలుగో తరం కియా కార్నివాల్ భారతదేశంలో విడుదల కాబోతోంది. ఈ కారు అమ్మకాలు 2024లో ప్రారంభం కానున్నాయి. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో విడుదల అయిన ఫేస్ లిఫ్ట్ వెర్షన్ ను కంపెనీ భారత్ లో విడుదల చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. డిజైన్, ఫీచర్లు, లుక్స్ పరంగా ప్రస్తుత మోడల్ కంటే ఇది చాలా మెరుగ్గా ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో, ఈ కారులో అనేక పవర్ట్రెయిన్ ఎంపికలను అందించారు. భారతదేశంలో రాబోయే 2024 కియా కార్నివాల్ యొక్క పవర్ట్రెయిన్ వివరాలు ఇంకా వెల్లడించబడలేదు.
ఆశించిన విడుదల తేదీ: ఏప్రిల్ 2024
అంచనా ధర: రూ.40 లక్షలు
ఇది కూడా చూడండి: ఈ 7 ఫోటోలలో కొత్త కియా సోనెట్ యొక్క HTX+ వేరియంట్ గురించి తెలుసుకోండి
కియా EV9
కియా తమ ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ కియా EV9ను 2023లో అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేశారు. ఇది బహుళ బ్యాటరీ ప్యాక్లు మరియు ఎలక్ట్రిక్ మోటారు ఎంపికలతో 3-రో ఎలక్ట్రిక్ SUV కారు. ఇందులో రేర్-వీల్-డ్రైవ్ (RWD) మరియు ఆల్-వీల్ డ్రైవ్ (AWD) ఎంపికలు ఉండనున్నాయి. కంపెనీ ఈ ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ కారు యొక్క పరిధిని 541 కిలోమీటర్లకు పైగా ఉందని పేర్కొన్నారు. ఇది అంతర్జాతీయంగా విక్రయించే ఫ్లాగ్ షిప్ కియా టెల్లరైడ్ SUVకి ప్రత్యామ్నాయం. ఇందులో ఎన్నో సౌకర్యాలతో పాటు, భద్రతా సాంకేతిక ఫీచర్లు ఉన్నాయి. పూర్తి బిల్ట్-అప్ యూనిట్ (CBU) గా కియా EV9ను భారత్ లో దిగుమతి చేసుకుని విక్రయించవచ్చని అంచనా.
ఆశించిన విడుదల తేదీ: 2024 ద్వితీయార్థం
అంచనా ధర: రూ.80 లక్షలు
కియా మూడు కార్లను 2024 లో భారతదేశంలో విడుదల చేయనున్నారు. కొత్త కారు లైనప్ మిమ్మల్ని ఉత్సాహపరిచిందా? మీరు ఏ ఇతర కియా కార్లను చూడాలనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.
అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్
0 out of 0 found this helpful