6-సీటర్ వేరియెంట్ؚలు మరియు మరిన్ని ఫీచర్ؚలతో వస్తున్న 2024 Mahindra XUV700, ధరలు రూ.13.99 లక్షల నుండి ప్రారంభం
XUV700 ఎట్టకేలకు తన టాప్-స్పెక్ AX7 మరియు AX7L వేరియెంట్ؚలలో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్ؚలు మరియు కొత్త నలుపు రంగు లుక్ؚను పొందింది
-
2024 మహీంద్రా XUV700 లైన్అప్‌ను మరిన్ని ఫీచర్ؚలతో అప్ؚడేట్ చేశారు మరియు ధరలను కూడా సవరించారు.
-
ఈ SUV ప్రస్తుత టాప్-స్పెక్ వేరియెంట్ؚలలో (AX7 మరియు AX7L) వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్ؚలు మరియు ORVMల కోసం మెమొరీ ఫంక్షన్‌లతో వస్తుంది.
-
ప్రస్తుతం దీన్ని కొత్త నపోలి నలుపు రంగుؚలో కూడా పొందవచ్చు; హయ్యర్ వేరియెంట్ؚలు కూడా డ్యూయల్-టోన్ ఎంపికతో లభిస్తాయి.
-
13 కొత్త ఫంక్షన్ؚలను పరిచయం చేయడం ద్వారా ఈ SUV కనెక్టెడ్ కార్ టెక్ స్యూట్ؚను కూడా మహీంద్రా అప్ؚడేట్ చేసింది.
-
పవర్‌ట్రెయిన్ ఎంపికలలో మార్పు లేదు; ఇప్పటికీ పెట్రోల్ మరియు డీజిల్ యూనిట్ؚలు రెండిటితో, డీజిల్ యూనిట్ؚతో ఐచ్ఛిక AWDతో అందుబాటులో ఉంది.
-
2024 XUV700 కోసం బుకింగ్ؚలు ప్రారంభమయ్యాయి మరియు 25 జనవరి నుండి ఇవి డీలర్ؚషిప్ؚల వద్ద అందుబాటులో ఉంటాయి.
కొత్త సంవత్సరం ప్రారంభంలో, కారు తయారీదారులు తమ కార్ؚల కోసం సరైన ఫేస్ؚలిఫ్ట్ؚను పరిచయం చేయడానికి వేచి ఉండకుండా మోడల్ సంవత్సరం (MY) అప్ؚడేట్ؚలను వెల్లడిస్తారు. ప్రస్తుతం, మహీంద్రా XUV700 కూడా అటువంటి సవరణను అందుకుంది ఇందులో భాగంగా కొన్ని కొత్త వేరియెంట్ؚలు, ఫీచర్‌లు మరియు సరికొత్త పెయింట్ ఎంపిక ఉన్నాయి.
ధర తనిఖీ
2024 XUV700 వివరణాత్మక ధరలను మహీంద్రా వెల్లడించలేదు, అయితే ప్రతి వేరియెంట్ ప్రారంభ ధరలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
కొత్త వేరియెంట్ |
ఎక్స్-షోరూమ్ ధర |
MX |
రూ. 13.99 లక్షలు |
AX3 |
రూ. 16.39 లక్షలు |
AX5 |
రూ. 17.69 లక్షలు |
AX7 |
రూ. 21.29 లక్షలు |
AX7L |
రూ. 23.99 లక్షలు |
అప్ؚడేట్ చేసిన లైన్అప్ؚను పరిచయం చేయడంతో, SUV ప్రారంభ ధర రూ.4,000 వరకు తగ్గింది. ప్రస్తుతం MY2024 XUV700 బుకింగ్ؚలు ప్రారంభం అయ్యాయి, అయితే ఇది జనవరి 25 నుండి మాత్రమే డీలర్ షిప్ؚలలో అందుబాటులో ఉంటుంది.
2024 XUV700 మార్పుల వివరణ
ముందుగా, XUV700 మిడ్-సైజ్ SUV ఎట్టకేలకు మధ్య వరుసలో కెప్టెన్ సీట్లతో 6-సీటర్ కాన్ఫిగరేషన్ؚను పొందింది. ఇది అనేక ఫీచర్‌లను కలిగి ఉన్న AX7 మరియు AX7L వేరియెంట్ؚలకు మాత్రమే పరిమితం. ఈ క్యాబిన్ లేఅవుట్ ఎంపిక XUV700 పోటీదారులలో అందించబడుతోంది, కానీ మహీంద్రా నుండి ఈ తరహా లేఅవుట్ చాలా ఆలస్యంగా వస్తోంది.
మహీంద్రా SUVల శ్రేణి అగ్ర వేరియెంట్ AX7Lలో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్ؚలను అందించడం భారీ మరియు అత్యంత ప్రశంసించదగిన ఫీచర్ అప్ؚడేట్. అంతేకాకుండా, XUV700 కనెక్టెడ్ కార్ టెక్నాలజీని సాఫ్ట్ؚవేర్ అప్ؚడేట్ ద్వారా మరింతగా మెరుగుపరిచారు. చివరిగా, టాప్-స్పెక్ వేరియెంట్ؚలోని డ్రైవర్ సీట్ మెమరీ ఫంక్షన్ ఇప్పుడు ORVMల పొజిషనింగ్ؚؚలను సేవ్ చేయడానికి కూడా అనుమతిస్తుంది, మీరు మీ కార్ؚను ఇతరులతో పంచుకున్నప్పుడు ఇది అనుకూలమైన మరియు ఉపయోగకరమైన ఫీచర్ అవుతుంది.
ప్రస్తుతం XUV700 కొత్త నపోలి నలుపు రంగులో కూడా అందుబాటులో ఉంది. ఈ పెయింట్ ఎంపిక అన్నీ వేరియెంట్ లభిస్తున్నప్పటికీ, టాప్-స్పెక్ AX7 మరియు AX7L వేరియెంట్ؚల కోసం ఈ రంగును ఎంచుకుంటే, గ్రిల్ మరియు అలాయ్ వీల్స్ؚకు కూడా నలుపు రంగు ఫినిష్‌తో వస్తుంది, తద్వారా SUVకి ధృడమైన లుక్ؚను ఇస్తుంది. అంతేకాకుండా, ఈ వేరియెంట్‌లు AC వెంట్‌లు మరియు సెంట్రల్ కన్సోల్ చుట్టూ డార్క్ క్రోమ్ ఫినిష్ؚను కలిగి ఉంటుంది. నలుపు రంగుకు మీరు ప్రాధాన్యత ఇవ్వకపోతే, మరొక ప్రత్యమ్నాయం ఉంది – హయ్యర్-ఎండ్ వేరియెంట్ؚలు ఇప్పుడు బ్లాకెడ్-అవుట్ రూఫ్ؚతో డ్యూయల్-టోన్ రంగు ఎంపికలో అందిస్తున్నారు, ఇవి స్పోర్టియర్ లుక్ؚను కలిగి ఉంటాయి.
బోనెట్ؚలో ఎలాంటి మార్పులు లేవు
SUV బోనెట్ؚలో మహీంద్రా ఎటువంటి మార్పులను చేయలేదు. XUV700 ఇప్పటికీ మునుపటిలాగే పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఎంపికలలోనే విక్రయించబడుతోంది. ఇది చూడండి:
స్పెసిఫికేషన్ |
2-లీటర్ టర్బో-పెట్రోల్ |
2.2-లీటర్ డీజిల్ |
పవర్ |
200 PS |
Up to 185 PS |
టార్క్ |
380 Nm |
450 Nm |
ట్రాన్స్ؚమిషన్ |
6-స్పీడ్ MT, 6-స్పీడ్ AT |
6-స్పీడ్ MT, 6-స్పీడ్ AT |
టాప్-స్పెక్ AX7 మరియు AX7L వేరియెంట్ؚలు ఆల్-వీల్-డ్రైవ్ (AWD) సిస్టమ్ ఎంపికతో కూడా లభిస్తున్నాయి కానీ డీజిల్-ఆటోమ్యాటిక్ యూనిట్ؚతో మాత్రమే.
ఇది కూడా చూడండి: 2024లో విడుదల కావచ్చని ఆశిస్తున్న 5 మహీంద్రా SUVలు
ఇది ఎదుర్కొనే పోటీని ఇప్పుడు చూద్దాం
మహీంద్రా XUV700 6- మరియు 7-సీటర్ వేరియెంట్ؚలు హ్యుందాయ్ ఆల్కజార్, టాటా సఫారి మరియు MG హెక్టార్ ప్లస్ؚలతో పోటీ పడతాయి. దీని 5-సీట్ؚల వర్షన్ హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ మరియు టాటా హ్యారియర్ వంటి హయ్యర్-స్పెక్ వేరియెంట్ؚలతో పోటీ పడుతుంది.
అన్నీ ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరలు
ఇది కూడా చదవండి: XUV700 ఆన్ؚరోడ్ ధర