2024 సోనెట్ టీజర్‌ను మళ్ళీ విడుదల చేసిన Kia, డిసెంబర్ 14న విడుదల
కియా సోనేట్ కోసం rohit ద్వారా డిసెంబర్ 13, 2023 07:50 pm ప్రచురించబడింది
- 173 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
360-డిగ్రీల కెమెరా మరియు కనెక్టెడ్ LED టెయిల్‌లైట్‌లతో వస్తుంది అని కొత్త టీజర్ తిరిగి నిర్ధారించింది
-
సోనెట్ త్వరలోనే మొదటిసారిగా భారీ నవీకరణను పొందనుంది.
-
కొత్త టీజర్ؚలో సవరించిన గ్రిల్ మరియు పొడవైన ఫ్యాంగ్-ఆకారపు LED DRLలు కూడా కనిపించాయి.
-
క్యాబిన్ మార్పులలో కొత్త అప్ؚహోల్ؚస్ట్రీ మరియు క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్ ఉండవచ్చు.
-
రెండు 10.25-అంగుళాల డిస్ప్లేలు, సన్ؚరూఫ్, ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు (ప్రామాణికంగా) మరియు ADASలతో వస్తుంది.
-
ప్రస్తుత మోడల్ؚలో ఉన్న పవర్ؚట్రెయిన్ ఎంపికలను కొనసాగించనుంది- డీజిల్-MT కలయికను తిరిగి అందించనున్నారు.
-
2024 ప్రారంభంలో విడుదల అవుతుందని అంచనా, దీని ధరలు రూ.8 లక్షల (ఎక్స్ షోరూమ్) నుండి ప్రారంభం కావచ్చు.
నవీకరించిన కియా సోనెట్ డిసెంబర్ 14వ తేదీన విడుదల కానుంది. అయితే దీని కంటే ముందు, కారు తయారీదారు ఇప్పటికే కొన్ని టీజర్‌లను విడుదల చేశారు. కియా ప్రస్తుతం మరొక టీజర్ؚను విడుదల చేసింది, ఇది కొత్త SUV (స్కెచ్ؚలలో కూడా చూపింది) త్వరిత వీక్షణను చూపింది.
ఏమి పరిశీలించవచ్చు?
టీజర్ؚలో, సవరించిన మల్టీ-రిఫ్లెక్టర్ LED హెడ్ؚలైట్ؚలు మరియు పొడవైన ఫ్యాంగ్-ఆకారపు LED DRLలను గమనించవచ్చు. ముందు వైపు, ముందు కెమెరాను కలిగి ఉన్న పునఃనిర్మించిన గ్రిల్ మరియు ముందు పార్కింగ్ సెన్సార్ؚలతో సవరించిన బంపర్ ఉన్నాయి. నవీకరించిన SUV వెనుక భాగం కూడా టీజర్ؚలో కనిపించింది, ఇక్కడ కొత్త కనెక్టెడ్ LED టెయిల్ ల్యాంప్ సెట్ؚఅప్ؚను కలిగి ఉంది.
ఆశించిన క్యాబిన్ మరియు ఫీచర్ అప్ؚడేట్ؚలు
కొత్త టీజర్ؚలో 2024 కియా సోనెట్ ఇంటీరియర్ కనిపించకపోయినా, మునుపటి రహస్య చిత్రాలు మరియు టీజర్ؚలలో ఇప్పటికే, ఇది సరికొత్త అప్ؚహోల్ؚస్ట్రీ మరియు క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్ؚలను పొందే అవకాశం గురించి సూచించారు.
మునుపటి టీజర్ؚలో 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్ సిస్టమ్ నిర్ధారించబడింది, సెల్టోస్ؚలో ఉన్న అదే 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లేను మరియు 360-డిగ్రీల కెమెరాతో కొత్త సోనెట్ వస్తుంది. సన్ؚరూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్ؚలు, వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్ మరియు క్రూయిజ్ కంట్రోల్ؚలను కూడా అందించనుంది.
దీని సేఫ్టీ ఫీచర్‌లలో అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ؚను (ADAS) పొందునుంది, మరిన్ని వివరాలు మా ‘కొత్త సోనెట్ ADAS ఫీచర్‌ల వివరణ’ కథనంలో అందుబాటులో ఉన్నాయి. దీనిలో ఉన్న ఇతర భద్రత సాంకేతికతలలో ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు (ప్రామాణికంగా), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ISOFIX చైల్డ్ సీట్ మౌంట్ؚలు మరియు హిల్-హోల్డ్ అసిస్ట్ కూడా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: క్యాలెండర్ ఇయర్ ముగింపులో కొత్త కారును కొనుగోలుచేయడం వలన కలిగే అన్ని లాభాలు మరియు నష్టాలు
మరిన్ని పవర్ؚట్రెయిన్ؚలు
కొత్త సోనెట్ؚను ఇంతకు ముందు విధంగానే పెట్రోల్ మరియు డీజిల్ పవర్‌ట్రెయిన్ ఎంపికలు రెండిటిలో అందించనున్నారు. అయితే, ఈ నవీకరణతో కియా డీజిల్-MT కలయికను కూడా తిరిగి అందించనుంది.
స్పెసిఫికేషన్ |
1.2-లీటర్ N.A పెట్రోల్ |
1-లీటర్ టర్బో-పెట్రోల్ |
1.5-లీటర్ డీజిల్ |
పవర్ |
83 PS |
120 PS |
116 PS |
టార్క్ |
115 Nm |
172 Nm |
250 Nm |
ట్రాన్స్ؚమిషన్ |
5-స్పీడ్ MT |
6-స్పీడ్ iMT, 7-స్పీడ్ DCT |
6-స్పీడ్ MT (కొత్తది), 6-స్పీడ్ iMT, 6-స్పీడ్ AT |
అంచనా విడుదల మరియు ధర
కియా సోనెట్ ఫేస్ؚలిఫ్ట్ 2024 ప్రారంభంలో విడుదల కానుంది, దీని ధరలు రూ.8 లక్షల (ఎక్స్-షోరూమ్) లక్షల నుండి ప్రారంభం కావచ్చు. ఇది టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV300, రెనాల్ట్ కైగర్ మరియు నిస్సాన్ మాగ్నైట్ؚలతో పోటీని కొనసాగిస్తుంది.
ఇక్కడ మరింత చదవండి: సోనెట్ ఆటోమ్యాటిక్
0 out of 0 found this helpful