• English
  • Login / Register

డిసెంబర్ 14న విడుదల కానున్న Kia Sonet ADAS ఫీచర్లు వెల్లడి

కియా సోనేట్ కోసం rohit ద్వారా డిసెంబర్ 09, 2023 08:35 pm ప్రచురించబడింది

  • 291 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

హ్యుందాయ్ వెన్యూ N లైన్ యొక్క 10 ADAS ఫీచర్లు కొత్త కియా సోనెట్‌లో ఉండనున్నాయి.

2024 Kia Sonet ADAS

  • సోనెట్ ఫేస్ లిఫ్ట్ డిసెంబర్ 14 న భారతదేశంలో విడుదల కానుంది.

  • హ్యుందాయ్ వెన్యూ N లైన్ తరువాత ADAS ఫీచర్ పొందిన ఏకైక సబ్-4ఎమ్ SUV అవుతుంది.

  • ఇందులో లేన్ కీప్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, హై బీమ్ అసిస్ట్ వంటి అధునాతన భద్రతా ఫీచర్లు ఉండనున్నాయి.

  • అంటే కాక ఇందులో 360 డిగ్రీల కెమెరా, ప్రామాణికంగా 6 ఎయిర్ బ్యాగులు, డ్యూయల్ డిస్ ప్లే వంటి భద్రతా ఫీచర్లు కూడా ఉండనున్నాయి.

  • డీజిల్ ఇంజిన్ మునుపటి మాదిరిగానే 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఎంపికతో అందించబడుతుంది.

  • ఇది 2024 ప్రారంభంలో విడుదల అయ్యే అవకాశం ఉంది, దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 8 లక్షలు ప్రారంభమవుతుంది.

కియా సోనెట్ ఫేస్ లిఫ్ట్ విడుదల కావడానికి ఇంకా వారం రోజుల కంటే తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉండగా, ఈ SUV యొక్క తాజా వివరాలను వెల్లడిస్తూ అనేక స్పై షాట్లు, టీజర్లు ఆన్ లైన్ లో విడుదలయ్యాయి. ఇటీవల లీకైన సమాచారం ప్రకారం, కొత్త సోనెట్ మరోసారి డీజిల్ ఇంజిన్ తో మాన్యువల్ గేర్ బాక్స్ ఎంపికను పొందుతుంది. అధునాతన డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) కింద వచ్చే కొన్ని ఫీచర్లతో సోనెట్ ను కూడా అందించనున్నట్లు ఇప్పుడు ధృవీకరించబడింది. హ్యుందాయ్ వెన్యూ N లైన్ తరువాత, సోనెట్ ఫేస్ లిఫ్ట్ దాని సెగ్మెంట్ లో ఈ భద్రత టెక్నాలజీని అందించే ఏకైక సబ్-4ఎమ్ SUV అవుతుంది.

ADAS ఫీచర్ వివరాలు

లీకైన డాక్యుమెంట్ ప్రకారం, కియా సోనెట్ ఫేస్ లిఫ్ట్ 10 అధునాతన డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్ ఫీచర్లను కలిగి ఉంటుంది. వీటిలో కొలిషన్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, హై-బీమ్ అసిస్ట్, డ్రైవర్ అటెన్సివ్నెస్ అలర్ట్ మరియు ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్ ఉన్నాయి. ఈ ADAS ఫీచర్లన్నీ హ్యుందాయ్ వెన్యూ N లైన్ లో కూడా ఉన్నాయి. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ రెండు SUV కార్లలో ADAS కింద అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ లేదు. లీకైన డాక్యుమెంట్ ప్రకారం, కియా SUV టాప్ వేరియంట్ X-లైన్ లో మాత్రమే ADAS ఉంటుంది. అంటే మ్యాట్ గ్రే కలర్ మోడళ్లలో మాత్రమే ఈ టెక్నాలజీ అందుబాటులో ఉండనుంది. కానీ దీని తుది విడుదల మోడల్ కూడా భిన్నంగా ఉంటుంది.

ఇతర ఫీచర్లు

కియా సోనెట్ ఫేస్ లిఫ్ట్ లో ప్రామాణికంగా ఆరు ఎయిర్ బ్యాగులు, ఫ్రంట్ మరియు రేర్ పార్కింగ్ సెన్సార్లు, హిల్ హోల్డ్ అసిస్ట్, ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజ్ వంటి భద్రతా ఫీచర్లను కూడా అందించనున్నారు.

2024 Kia Sonet 10.25-inch touchscreen

కియా కొత్త SUVలో 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, సన్ రూఫ్, 360 డిగ్రీల కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో అవుట్ గోయింగ్ మోడల్ నుండి వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్ లెస్ ఫోన్ ఛార్జింగ్ మరియు ఆటో ఎసి ఫంక్షన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఇది కూడా చదవండి: ఏడాది చివర్లో కారు కొనడం వల్ల కలిగే లాభాలు, నష్టాలు ఏంటో తెలుసుకోండి

పవర్ట్రెయిన్ ఎంపికలు

కొత్త సోనెట్ SUVలో ఒక చిన్న మార్పుతో మునుపటి ఇంజన్ మరియు గేర్ బాక్స్ ఎంపికలు ఇవ్వబడతాయి. ఇందులో 83 PS 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ మరియు 120 PS 1-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఎంపికలు ఉన్నాయి. 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు టర్బో-పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ iMT మరియు 7-స్పీడ్ DCTతో అందించబడుతుంది.

కియా 6-స్పీడ్ iMT మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో 116 PS 1.5-లీటర్ డీజిల్ యూనిట్ కూడా అందిస్తున్నారు. ఈ ఇంజిన్ తో మరోసారి 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ ఎంపిక కూడా అందుబాటులోకి రానుంది.

ఆశించిన ధర మరియు విడుదల

2024 Kia Sonet LED tail lamps

కొత్త కియా సోనెట్ 2024 ప్రారంభంలో విడుదల అయ్యే అవకాశం ఉంది. కొత్త సోనెట్ ప్రారంభ ధర రూ. 8 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది మారుతి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV300, టాటా నెక్సాన్, రెనాల్ట్ కిగర్, నిస్సాన్ మాగ్నైట్ మరియు మారుతి ఫ్రాంక్స్ వంటి మోడళ్ళకి ప్రత్యర్థిగా ఉంటుంది.

మరింత చదవండి : సోనెట్ ఆటోమేటిక్

was this article helpful ?

Write your Comment on Kia సోనేట్

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience