రూ. 16.19 లక్షల ప్రారంభ ధరతో విడుదలైన 2023 Tata Safari Facelift
నవీకరించబడిన సఫారీ, ఆధునిక డిజైన్ మరియు కొన్ని కొత్త ఫీచర్లను కలిగి ఉంది
-
ధరలు రూ. 16.19 లక్షల నుండి ప్రారంభమవుతాయి (పరిచయ ధర, ఎక్స్-షోరూమ్).
-
4 వేర్వేరు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది: అవి వరుసగా స్మార్ట్, ప్యూర్, అడ్వెంచర్ మరియు అకంప్లిష్డ్.
-
బాహ్య డిజైన్ మార్పులు, SUV యొక్క ముందు మరియు వెనుక వైపు దృష్టి సారించాయి.
-
ప్రీ-ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ వలె అదే 2-లీటర్ డీజిల్ ఇంజన్‌ను పొందుతుంది.
-
కొత్త ఫీచర్లలో 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 ఎయిర్‌బ్యాగ్‌లు, పవర్డ్ టెయిల్ గేట్ మరియు అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఉన్నాయి.
2023 టాటా సఫారి ఫేస్‌లిఫ్ట్ రూ. 16.19 లక్షల ప్రారంభ ధరతో ప్రారంభించబడింది (పరిచయ ధర, ఎక్స్-షోరూమ్). మధ్య-పరిమాణ 3-వరుస SUV, 4 వేర్వేరు వేరియంట్‌లలో అమ్మకానికి ఉంది: స్మార్ట్, ప్యూర్, అడ్వెంచర్ మరియు అకంప్లిష్డ్, మరియు కొత్త డిజైన్ అలాగే ఆధునిక ఫీచర్‌లను పొందుతుంది.
కొత్త సఫారీ ధర ఎలా ఉందో మరియు అది ఏమి అందిస్తుందో చూడండి:
ధరలు
2023 టాటా సఫారి వేరియంట్‌లు |
పరిచయ ధరలు (ఎక్స్-షోరూమ్) |
స్మార్ట్ |
రూ.16.19 లక్షలు |
ప్యూర్ |
రూ.17.69 లక్షలు |
ప్యూర్ + |
రూ.19.39 లక్షలు |
అడ్వెంచర్ |
రూ. 20.99 లక్షలు |
అడ్వెంచర్ |
రూ.22.49 లక్షలు |
అకంప్లిష్డ్ |
రూ. 23.99 లక్షలు |
అకంప్లిష్డ్+ |
రూ.25.49 లక్షలు |
ఆటోమేటిక్ వేరియంట్లు |
|
ప్యూర్+, అడ్వెంచర్+, అకంప్లిష్డ్, అకంప్లిష్డ్+ |
రూ.20.69 లక్షలు |
#డార్క్ వేరియంట్స్ |
|
ప్యూర్+, అడ్వెంచర్+, అకంప్లిష్డ్, అకంప్లిష్డ్+ |
రూ.20.69 లక్షలు |
టాటా, సఫారి ఫేస్‌లిఫ్ట్ యొక్క అన్ని విభిన్న వేరియంట్‌ల ప్రారంభ ధరలను మాత్రమే విడుదల చేసింది మరియు పూర్తి ధరల జాబితా త్వరలో వెల్లడి చేయబడుతుందని భావిస్తున్నారు. ఇంకా, పనోరమిక్ సన్‌రూఫ్ అనేది ప్యూర్+ వేరియంట్‌లో ఆప్షనల్గా అందించబడుతుంది, అయితే ADAS అనేది సఫారి యొక్క అడ్వెంచర్+ వేరియంట్‌కు అదనంగా జత చేయబడింది.
కొత్త సఫారీ ప్రారంభ ధర, గతంతో పోలిస్తే రూ. 34,000 పెరిగింది. అగ్ర శ్రేణి వేరియంట్‌ల కోసం, సఫారి ఫేస్‌లిఫ్ట్ ఒక లక్షకు పైగా ప్రీమియం ధరను కలిగి ఉంది. ఇప్పుడు కొత్త సఫారీ ఏమి అందజేస్తుందో తెలుసుకుందాం.
ఆధునిక డిజైన్
కొత్త సఫారీ యొక్క మొత్తం ఆకారం మరియు నిష్పత్తులు దాని ముందున్న మాదిరిగానే ఉంటాయి, కానీ ప్రతి మూలలో ఆధునిక అంశాలు జోడించబడ్డాయి. ముందు భాగంలో కనెక్ట్ చేయబడిన DRL సెటప్, కొత్త సొగసైన గ్రిల్, నిలువు ఆధారిత LED హెడ్‌లైట్లు మరియు పునఃరూపకల్పన చేయబడిన బంపర్ అలాగే స్కిడ్ ప్లేట్ ఉన్నాయి.
సైడ్ ప్రొఫైల్ ముందు వెర్షన్ వలె అదే విధంగా ఉంటుంది, కానీ ఇప్పుడు ఇది కొత్త 19-అంగుళాల స్టైలిష్ అల్లాయ్ వీల్స్ మరియు ముందు డోర్లపై "సఫారి" బ్యాడ్జింగ్‌ను పొందుతుంది.
వెనుక భాగం కూడా, ముందు వైపు మాదిరిగానే డిజైన్‌ను కలిగి ఉంటుంది. కనెక్ట్ చేయబడిన టెయిల్ లైట్లు మరియు బూట్ లిప్ అలాగే బంపర్ లు పునరుద్ధరించబడ్డాయి. వెనుక ఉన్న సఫారి లోగో ఇప్పుడు పెద్దదిగా ఉంది. టాటా మూడు కొత్త రంగు ఎంపికలను కూడా అందిస్తోంది: అవి వరుసగా కాస్మిక్ గోల్డ్, సూపర్నోవా కాపర్ మరియు లూనార్ స్లేట్.
లోపల భాగం విషయానికి వస్తే, క్యాబిన్ ప్రభావవంతమైన ఆధునిక డిజైన్ ట్వీక్‌ల యొక్క అదే డిజైన్ను పొందుతుంది. డ్యాష్‌బోర్డ్ లేయర్డ్‌గా ఉంది, చెక్క ఇన్సర్ట్‌లను పొందుతుంది మరియు దిగువన సాఫీగా వంగిన డిజైన్‌ను కలిగి ఉంటుంది. గ్రాబ్ హ్యాండిల్స్ చాలా చక్కగా ఒకే విధంగా ఉంటాయి కానీ బ్యాక్‌లిట్ టాటా లోగో మరియు సెంటర్ కన్సోల్‌లో టచ్-ఎనేబుల్డ్ క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్‌తో కొత్త 4-స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంది.
అదే పవర్‌ట్రెయిన్
నవీకరించబడిన టాటా సఫారి దాని ప్రీ-ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో ఉన్న ఇంజన్‌ను కలిగి ఉంది. 2-లీటర్ డీజిల్ ఇంజన్ 170PS మరియు 350Nm పవర్, టార్క్ లను ఉత్పత్తి చేస్తుంది మరియు ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడుతుంది. ఆటోమేటిక్ వేరియంట్‌లు సౌలభ్యం కోసం పాడిల్ షిఫ్టర్‌లను కూడా పొందుతాయి.
టాటా, SUV కోసం 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను కూడా అభివృద్ధి చేసింది, ఇది నిర్ణీత సమయంలో కొత్త సఫారీకి జోడించబడుతుంది.
విస్తరించిన ఫీచర్ జాబితా
ఈ ఫేస్‌లిఫ్ట్‌తో టాటా, సఫారి ఫీచర్ లిస్ట్‌లో చాలా చేర్పులు చేసింది. ఇది ఇప్పుడు వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్, టచ్-బేస్డ్ AC ప్యానెల్‌తో కూడిన డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 10-స్పీకర్ JBL సౌండ్ సిస్టం మరియు శక్తితో కూడిన టెయిల్ గేట్ వంటి అంశాలను పొందుతుంది.
అంతేకాకుండా వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు (6-సీటర్ వేరియంట్‌లలో 2వ వరుస సీట్లు) వంటి ఇతర ఫీచర్లు అలాగే ఉంచబడ్డాయి. మెమరీ ఫంక్షన్‌తో అగ్ర శ్రేణి వేరియంట్ లో డ్రైవర్ సీటు 6-విధాల పవర్ అడ్జస్టబుల్ ఫంక్షన్ ను కలిగి ఉంది.
భద్రత పరంగా కూడా, సఫారీ ఇప్పుడు 7 ఎయిర్‌బ్యాగ్‌లను పొందుతుంది మరియు దాని ADAS సూట్ ఇప్పుడు అనుకూల క్రూయిజ్ నియంత్రణను కలిగి ఉంది. ఇతర భద్రతా లక్షణాలలో EBDతో కూడిన ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), 360-డిగ్రీ కెమెరా, లేన్ డిపార్చర్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ మరియు ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి భద్రతా అంశాలు ఉన్నాయి.
ప్రత్యర్థులు
టాటా సఫారీ ఫేస్‌లిఫ్ట్- మహీంద్రా XUV700, MG హెక్టర్ ప్లస్ మరియు హ్యుందాయ్ అల్కాజర్‌లతో దాని పోటీని కొనసాగిస్తోంది.