2020 టాటా టియాగో మరియు టిగోర్ BS 6 ఫేస్‌లిఫ్ట్ జనవరి 22 న లాంచ్ కానున్నాయి
టాటా టిగోర్ 2017-2020 కోసం sonny ద్వారా జనవరి 24, 2020 11:39 am ప్రచురించబడింది
- 24 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
రెండూ పెట్రోల్ తో మాత్రమే అందించబడే సమర్పణలుగా మారతాయి
- ఫేస్‌లిఫ్టెడ్ టియాగో మరియు టిగోర్ కి BS6 నారంస్ కి అనుగుణంగా ఉండే 1.2-లీటర్ పెట్రోల్ అలాగే దానితో పాటూ మాన్యువల్ మరియు AMT ఎంపికలతో అందుబాటులో ఉంటుంది.
- టిగోర్ కోసం LED DRL ఉండబోతున్నాయి, అలాగే రెండింటికి తిరిగి డిజైన్ చేసిన బంపర్ మరియు గ్రిల్‌తో కొత్త ఫ్రంట్ ఎండ్ లభిస్తుంది.
- రెండూ ఫేస్‌లిఫ్ట్‌తో ఫీచర్ అప్‌డేట్స్ పొందుతాయని భావిస్తున్నాము.
- ప్రస్తుత పెట్రోల్ వేరియంట్ ధరల కంటే రెండింటి ధర 10,000 రూపాయల ప్రీమియంతో ఉంటుంది.
టాటా BS6 ఇంజిన్ అప్‌డేట్ తో పాటు టియాగో, టిగోర్ లకు ఫేస్ లిఫ్ట్ ఇవ్వనుంది. నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌తో పాటు ఈ రెండూ కూడా మనలన్ని వాటి చిత్రాలతో ఊరించడం జరిగింది మరియు ఇప్పుడు వాటి ప్రారంభం జనవరి 22 న ధృవీకరించబడింది.
ఫేస్‌లిఫ్టెడ్ మోడల్స్ రెండూ 1.05-లీటర్ డీజిల్ ఇంజిన్‌ను తొలగిస్తున్నాయి, అలాగే 1.2-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ BS 6-కంప్లైంట్‌గా తీర్చి దిద్దబడుతుంది. ఈ రెండూ కూడా 85Ps పవర్ మరియు 114Nm టార్క్ రేటింగ్ ని కలిగి ఉంటాయని భావిస్తున్నాము. టాటా అదే 5-స్పీడ్ మాన్యువల్ మరియు AMT ఆప్షన్లతో పెట్రోల్ ఇంజిన్ ను అందిస్తుందని భావిస్తున్నాము.
2020 టియాగో మరియు టిగోర్ కొత్త ఫ్రంట్ బంపర్‌ను తిరిగి డిజైన్ చేసిన ఫాగ్ లాంప్ హౌసింగ్‌లతో కలిగి ఉండగా, కొత్త ఫ్రంట్ గ్రిల్ డిజైన్ హెక్సాగొనల్ డిజైన్ తో Y-ఆకారాలతో భర్తీ చేయబడింది. సబ్ -4m సెడాన్ మాత్రమే కొత్త ఫ్రంట్ బంపర్‌లో LED DRL లను పొందుతుంది. వెనుక ఉన్న అప్‌డేట్స్ ని ఇంకా చూడలేదు, అయితే రెండూ ఒకే సైడ్ ప్రొఫైల్‌ను కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది. ఫేస్‌లిఫ్టెడ్ కాంపాక్ట్ సమర్పణలకు కొన్ని ఫీచర్ నవీకరణలు లభిస్తాయని టాటా పేర్కొంది, అవి ఇంకా ఏమిటనేవి నిర్ధారించబడలేదు.
టాటా ఇప్పటికే ఫేస్‌లిఫ్టెడ్ టియాగో మరియు టిగోర్ కోసం బుకింగ్‌లను అంగీకరిస్తోంది. ప్రస్తుత పెట్రోల్ వేరియంట్ తో పోలిస్తే వీటి ధర సుమారు 10,000 రూపాయలు కొద్దిగా ఎక్కువ ఉంది, టియాగోకు రూ .4.55 లక్షల నుంచి రూ .6.47 లక్షలు ధర పరిధి ఉండగా, టిగోర్ కు రూ .5.65 లక్షల నుంచి రూ .7.50 లక్షలు(ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ధర పరిధి ఉంది.
మరింత చదవండి: టాటా టిగోర్ ఆన్ రోడ్ ప్రైజ్
0 out of 0 found this helpful