2020 మహీంద్రా XUV 500 లోపల కనెక్టెడ్ స్క్రీన్‌లతో టెస్టింగ్ చేయబడుతూ మా కంట పడింది
మహీంద్రా ఎక్స్యూవి500 కోసం dhruv attri ద్వారా నవంబర్ 22, 2019 11:48 am ప్రచురించబడింది
- 33 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మహీంద్రా దీనిని తదుపరి తరం సాంగ్‌యాంగ్ కొరాండో SUV పై ఆధారపడే అవకాశం ఉంది
- 2020 సెకండ్-జెన్ మహీంద్రా XUV 500 ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం కనెక్టెడ్ స్క్రీన్స్ తో మా కంటపడింది.
- ఇది సాంగ్‌యాంగ్ కొరాండో-ఉత్పన్నమైన ఇంటీరియర్ మరియు లక్షణాలను పొందవచ్చు.
- కొత్త BS 6-కంప్లైంట్ 2.0-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లను పొందవచ్చని అంచనా.
- ఇదే రేంజ్ లో రూ .122.22 లక్షల నుంచి రూ .15.55 లక్షల వరకు ధరని కలిగి ఉండే అవకాశం ఉంది.
మహీంద్రా 2020 సెకండ్-జెన్ XUV 500 ను కొన్ని నెలలుగా పరీక్షిస్తోంది, అయితే డిజైన్ వివరాలు అనేవి ఇప్పటివరకూ వెళ్ళడించబడలేదు. 2020 లో ప్రారంభించగలిగే కొత్త XUV500 నుండి మనం ఏమి ఆశించవచ్చనే దానిపై తాజా రహస్య చిత్రాలు కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టాయి.
లగ్జరీ కార్ల లో మనం చూసే విధంగా SUV కి flush-fitting door handles ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్ లభిస్తాయని మునుపటి చిత్రాలు వెల్లడించాయి. ఏడు-స్లాట్ గ్రిల్ మరియు సిల్హౌట్ కొద్దిగా అదే విధంగా ఉన్నప్పటికీ “చిరుత రూపకల్పన” అంశాలు అనేవి తీసేసే అవకాశం ఉంది. మేము ఇంకా దాని ఇంటీరియర్‌లను స్పష్టంగా చూడలేకపోతున్నప్పటికీ, కొత్త రహస్య షాట్లు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు సెంటర్ లో ఉంచిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ కోసం కనెక్ట్ చేయబడిన స్క్రీన్ లను కలిగి ఉంటాయని సూచించాయి. ఈ సెటప్ కియా సెల్టోస్ మరియు కొత్త మెర్సిడెస్ బెంజ్ మోడళ్లతో పోలికను కలిగి ఉంటుంది.
క్రొత్త-తరం XUV500 2019 సాంగ్‌యాంగ్ కొరాండో పై ఆధారపడి ఉంటుంది కాబట్టి, కొన్ని లక్షణాలను కూడా షేర్ చేసుకొనే అవకాశం ఉంది. కొరాండోలో 10.25- ఇంచ్ పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు టామ్‌టామ్ నావిగేషన్ సిస్టమ్ మరియు యాంబియంట్ మూడ్ లైటింగ్ తో 9-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ ఉందని తెలియజేయడం మాకు చాలా సంతోషంగా ఉంది.
రెండూ కనెక్ట్ కాదు, కాని రెండు కార్ల డాష్‌బోర్డ్ లేఅవుట్లు భిన్నంగా ఉంటాయని భావిస్తున్నాము. పవర్డ్ టెయిల్‌గేట్, పనోరమిక్ సన్‌రూఫ్, ముందు సీట్ల కోసం వెంటిలేషన్ ఫంక్షన్ తో డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు 7 ఎయిర్‌బ్యాగులు ఆఫర్‌లో ఉంటాయి.
రాబోయే మహీంద్రా XUV 500 కి పవరింగ్ విషయానికి వస్తే, BS6-కంప్లైంట్ 2.0-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లు ఉండవచ్చు. ప్రస్తుతం, XUV500 లో 2.2-లీటర్ డీజిల్ మాత్రమే ఉంది, అది 155PS పవర్ ని అందిస్తుంది, కాని క్రొత్తది దాని కంటే ఎక్కువ అందించగలదు. ఇది 6-స్పీడ్ ఆటోమేటిక్ మరియు AWD వేరియంట్లను పొందనున్నది.
నెక్స్ట్-జెన్ XUV500 ప్రారంభించడంలో ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదు, కాని ఇది 2020 రెండవ భాగంలో షోరూమ్ అంతస్తులకు చేరుకుంటుందని మేము భావిస్తున్నాము. ప్రస్తుతం రూ .122.22 లక్షల నుండి 18.55 లక్షల (ఎక్స్-షోరూమ్ ముంబై) శ్రేణిలో ధరలను కలిగి ఉంటుందని భావిస్తున్నాము. ప్రారంభించినప్పుడు, ఇది కియా సెల్టోస్ మరియు హ్యుందాయ్ క్రెటాతో పాటు MG హెక్టర్ (5- మరియు 7-సీటర్లు), టాటా హారియర్ (5- మరియు 7-సీటర్లు) తో పోటీపడుతుంది.
మరింత చదవండి: XUV500 డీజిల్
0 out of 0 found this helpful