2019 రెనాల్ట్ క్విడ్: వేరియంట్స్ వివరణ
రెనాల్ట్ క్విడ్ 2015-2019 కోసం dhruv ద్వారా ఏప్రిల్ 23, 2019 11:34 am ప్రచురించబడింది
- 101 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
డ్రైవర్ ఎయిర్బాగ్ మరియు ABS వంటి భద్రతా లక్షణాలు ఇప్పుడు ప్రామాణికంగా ఉన్నాయి
రెనాల్ట్ సంస్థ 2019 లో క్విడ్ ని నవీకరించింది, ఎలా అంటే దాని యొక్క ప్రాధమిక బేసిక్ లక్షణాలు అయిన డ్రైవర్-సైడ్ ఎయిర్బాగ్ మరియు ABS వంటి లక్షణాలను ఈ హ్యాచ్‌బ్యాక్ యొక్క బేస్ స్పెక్ వేరియంట్ నుండి అందించడం ప్రారంభించింది. ఈ కొత్త లక్షణాలు ఇచ్చిన తరువాత మనం ఈ క్విడ్ లో ఉన్న అన్ని వేరియంట్స్ ని ఒకదాని తరువాత ఒకటి చూసి మీకు ఏది సరిగా సరిపోతుందో చూద్దాం.
రెనాల్ట్ సంస్థ క్విడ్ కోసం అందించే రంగు ఎంపికలను చూద్దాము: ఫైరీ రెడ్, ఐస్ కూల్ వైట్, మూన్లైట్ సిల్వర్, అవుట్‌బ్యాక్ బ్రాంజ్, ప్లానెట్ గ్రే మరియు ఎలక్ట్రిక్ బ్లూ వంటి రంగులను అందిస్తుంది. ఇప్పుడు వేరియంట్స్ తో మొదలు పెడదాము.
రెనాల్ట్ క్విడ్ STD: చాలా ఎముకల గూడులా ఉంటుంది తప్ప ఏమీ ఉండదు, సిఫార్సు చేయబడదు
ధర (ఎక్స్-షోరూమ్ న్యూఢిల్లీ) - రూ. 2.67 లక్షలు
క్విడ్ STD వెర్షన్ చిన్న సామర్థ్యం కలిగిన 0.8-లీటర్ ఇంజన్ తో మరియు మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో మాత్రమే అందుబాటులో ఉంది. ఇక్కడ దాని ముఖ్య లక్షణాలు ఉన్నాయి:
-
బ్లాక్ హబ్ క్యాప్స్
-
మోనో-టోన్ డాష్బోర్డ్
-
హీటర్ (AC లేదు)
-
మాన్యువల్ స్టీరింగ్ వీల్ (పవర్ స్టీరింగ్ లేదు)
-
ఫ్రంట్ సీట్లు రిక్లైన్ మరియు స్లయిడ్
-
గేర్ షిఫ్ట్ ఇండికేటర్
-
ELR తో ముందు మరియు వెనుక సీటు బెల్ట్ (అత్యవసర లాకింగ్ రెట్రాక్టర్)
-
ఫ్రంట్ సీట్లు ఇంటిగ్రేటెడ్ హెడ్ రెస్ట్లు
-
వెనుక సీట్లు ఇంటిగ్రేటెడ్ హెడ్ రెస్ట్లు
-
EBD తో ABS
-
డ్రైవర్ ఎయిర్బాగ్
-
డ్రైవర్ మరియు ప్రయాణీకుల సీటు బెల్ట్ రిమైండర్
-
స్పీడ్ అలర్ట్ వ్యవస్థ
ఇది కొనుగోలు చేసుకొనేందుకు విలువైనదా?
రెనాల్ట్ ఈ వేరియంట్ కి ప్రాథమిక భద్రతా లక్షణాలను జోడించినప్పటికీ, మేము క్విడ్ యొక్క STD వేరియంట్ ని సిఫార్సు చేయము. ఇది ఎయిర్ కండిషనింగ్ మరియు పవర్ స్టీరింగ్ పొందడం లేదు మరియు రెండు లక్షణాలు ఎంట్రీ-లెవల్ స్పేస్ లో కూడ ప్రస్తుత రోజుల్లో ఉన్న ఆధునిక కారులలో ఆశించే ప్రాథమిక లక్షణాలు. ఈ ధర యొక్క పాయింట్ దగ్గర చాలా మంది కొనుగోలుదారులు టూ-వీలర్ నుండి ఫోర్-వీలర్ కి పెంచుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే ఇది కొనుగోలు చేస్తారు. కారు నుండి వాళ్ళకి ఉండే కనీస డిమాండ్ ఏమిటంటే A.C. ఇది పవర్ స్టీరింగ్ ని కూడా మిస్ అవుతుంది, ఇది మళ్ళీ నెగిటివ్ గా ఉంది. STD వేరియంట్ మొత్తాన్ని దాటవేసి, తదుపరి దానిని చూడండి.
రెనాల్ట్ క్విడ్ RXE: టైట్ బడ్జెట్ లో ఉన్నప్పుడు మాత్రమే మీరు దీనిని ఎంచుకోండి
ధర (ఎక్స్-షోరూమ్ న్యూఢిల్లీ) – రూ. 3.10 లక్షలు
STD వేరియంట్ పై ప్రీమియం - రూ. 43,000
క్విడ్ యొక్క RXE వేరియంట్ కూడా చిన్న సామర్ధ్యం 0.8 లీటర్ పెట్రోల్ ఇంజిన్ మరియు మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో మాత్రమే అందుబాటులో ఉంది. దాని లక్షణాలను పరిశీలించండి (మునుపటి వేరియంట్లలో):
-
డోర్స్ మీద బ్లాక్ డెకల్స్
-
అడ్జస్టబుల్ సెంట్రల్ ఎయిర్ వెంట్స్ మూసి వేయబడతాయి కూడా
-
వెనుక సీటు ఒక ఫోల్డబుల్ బ్యాక్‌రెస్ట్ తో వస్తుంది
-
ఎయిర్ కండీషనర్
-
లోవర్ గ్లోవ్ బాక్స్
-
ప్రయాణీకుల వైపు సన్ విజర్
-
ఇంజిన్ ఇమ్మొబలైజర్
ఇది కొనుగోలు చేసుకొనేందుకు విలువైనదా?
RXE వేరియంట్ రూ. 43,000 అధనపు ధరను మనల్ని అడుగుతుంది, దీనిలో ఏకైక ముఖ్యమైన లక్షణం ఏదైనా ఉంది అంటే అది ఎయిర్ కండిషనింగ్, ఈ ఒక్క లక్షణం కోసం రూ.43,000 ఖర్చు పెట్టాలి అంటే అది కొంచెం ఎక్కువే అని చెప్పవచ్చు. మీరు ఖచ్చితమైన బడ్జెట్ లో ఉంటే మరియు మరింత అంత కంటే ఎక్కువ ఖర్చు చేయలేకుంటే, అప్పుడు మాత్రమే RXE కోసం వెళ్లండి. కానీ గుర్తుంచుకోండి, మీరు ఇంకా దీనిలో పవర్ స్టీరింగ్ ని పొందడం లేదు.
రెనాల్ట్ క్విడ్ RXL: 1.0-లీటర్ ఇంజిన్ అవసరం లేనివారికి ఇది మేము సిఫార్సు చేస్తాము
ధర (ఎక్స్-షోరూమ్ న్యూఢిల్లీ) - రూ .3.36 లక్షలు
RXE వేరియంట్ మీద ప్రీమియం - రూ. 26,000
క్విడ్ యొక్క ఈ RXL వేరియంట్ కూడా 0.8-లీటర్ ఇంజిన్ తో మరియు మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో మాత్రమే ఉంటుంది. క్విడ్ RXE వేరియంట్ లో ఇది అందించే అదనపు లక్షణాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
-
బాడీ-కలర్ బంపర్స్
-
ఫాగ్ ల్యాంప్స్
-
ఫుల్ వీల్ కవర్స్
-
డోర్స్ మీద ఫుల్ సైజ్ బ్లాక్ డెకల్స్
-
ఇంటెన్స్ రెడ్ అపోలిస్ట్రీ
-
ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్
-
ఫ్రంట్ పవర్ విండోస్
-
రేడియో AM / FM, MP3 తో సింగిల్ DIN స్టీరియో
-
బ్లూటూత్ ఆడియో స్ట్రీమింగ్ & హ్యాండ్స్ ఫ్రీ టెలిఫోనీ USB మరియు AUX-ఇన్
-
ఫ్రంట్ స్పీకర్లు (x2)
-
12V పవర్ సాకెట్
-
రిమోట్ సెంట్రల్ లాకింగ్
కొనుగోలు చేసుకొనేందుకు సరైనదా?
RXE వేరియంట్ కంటే కేవలం 26,000 రూపాయల ప్రీమియంతో(మరియు STD వేరియంట్ మీద రూ. 69,000) ధరను కలిగి ఉంది, క్విడ్ యొక్క RXL వేరియంట్ అనేది డబ్బుకి మరింత విలువైనదిగా ఉంటుందని చెప్పవచ్చు. ఇది చాలా ప్రాథమికంగా పరిగణించే అనేక లక్షణాలను కలిగి ఉంటుంది, ఉదాహరణకు ఆడియో సిస్టమ్ మరియు ముందు పవర్ విండోస్ వంటివి. ఒకవేళ మీరు క్విడ్ గనుక కొనుక్కుందాము అనుకుంటే కనీసం మీరు ఈ RXL వేరియంట్ అయినా తీసుకోగలిగేలా ప్లాన్ చేసుకోవాలి, అప్పుడే కొంచెం బాగుంటుంది.
రెనాల్ట్ క్విడ్ RXT: అన్ని పవర్ట్రెయిన్ కలయికలు మరియు ఎక్కువ ఫీచర్లను అందిస్తుంది
-
0.8 లీటర్ల (ఎక్స్-షోరూమ్ న్యూఢిల్లీ) ధర - రూ .3.83 లక్షలు
-
1.0 లీటర్ MT (ఎక్స్ షోరూమ్ న్యూఢిల్లీ) ధర - రూ 4.05 లక్షలు
-
1.0 లీటర్ AMT (ఎక్స్-షోరూమ్ న్యూఢిల్లీ) ధర - రూ 4.35 లక్షలు
-
RXL వేరియంట్ మీద 0.8 లీటర్ RXT వేరియంట్ చెల్లించిన ప్రీమియం – రూ. 26,000
క్విడ్ యొక్క RXT వేరియంట్ చిన్న సామర్థ్యం కలిగిన 0.8 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో లభ్యమవుతుంది, ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటుంది. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా AMT తో ఉన్న పెద్ద 1.0-లీటర్ ఇంజన్ తో కూడా అందుబాటులో ఉంది. RXL కి పైగా RXT వేరియంట్ మీద ఉన్న అదనపు లక్షణాలు ఇక్కడ ఉన్నాయి:
-
ముందు గ్రిల్ పై క్రోమ్ మరియు నాబ్
-
డ్యుయల్ టోన్ గ్లోసీ గ్రే ORVMs (1.0-లీటర్ మాత్రమే)
-
డోర్స్ మీద 'స్పీడ్-స్పోర్ట్' డిజైనర్ గ్రాఫిక్స్ - పూర్తి పరిమాణం (1.0-లీటరు మాత్రమే)
-
డ్యుయల్ టోన్ డాష్‌బోర్డ్
-
ఛాంపియన్ రెడ్ అప్హోస్టరీ
-
అప్పర్ గ్లోవ్ బాక్స్
-
రేర్ పార్సెల్ ట్రే
-
టైమర్ తో క్యాబిన్ లైటింగ్ మరియు ఫేడ్ అవుట్
-
7-అంగుళాల మీడియాNAV టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్
-
వెనుక పార్కింగ్ కెమెరా
-
వెనుక ప్రయాణీకులకు 12V సాకెట్
-
సెంట్రల్ లాకింగ్ తో రిమోట్ కీలెజ్ ఎంట్రీ
-
వాషింగ్ సమయంలో ఇంటర్మిటెంట్ ఫ్రంట్ వైపర్ & ఆటో వైపింగ్
-
ఆపిల్ కార్ప్లే / ఆండ్రాయిడ్ ఆటో
-
వాయిస్ రికగ్నిషన్
-
USB ద్వారా వీడియో ప్లేబ్యాక్
-
USB వేగవంతమైన ఛార్జర్
ఇది కొనుగోలు చేసుకొనేందుకు విలువైనదా?
RXT వేరియంట్ ఒక టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్థను కలిగి ఉండడం మాత్రమే కాకుండా లోపల భాగాలు కూడా చాలా అందంగా ఉండి చాలా మందిని ఆకర్షిస్తాయి, దీనికి గానూ కాస్మెటిక్ యాడ్- ఆన్ లకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. 0.8 లీటర్ ఇంజిన్ ఎంచుకున్నట్లయితే, RXL వేరియంట్ పై అధనంగా రూ.26,000 ప్రీమియం చెల్లించినట్లయితే అదనపు కిట్ ని పొందవచ్చు, ఈ అధనపు కిట్ ద్వారా మీ డబ్బుకి విలువ అందుతుంది. ఎవరైతే 1.0-లీటరు వేరియంట్ ని లేదా ఒక AMT వేరియంట్ ను కొనుగోలు చేసుకోవాలనుకున్నారో వారికి, ఇది అతి తక్కువ వ్యయంతో కూడుకున్నది మరియు మంచి లక్షణాలతో అందించబడుతుందని చెప్పవచ్చు. దీనిలో మిస్ అయిన ప్రధాన లక్షణాలలో ఒకటి వెనుక పవర్ విండోస్ మరియు వెనుక పార్కింగ్ సెన్సార్లు.
రెనాల్ట్ క్విడ్ క్లైంబర్: మీరు సౌందర్య నవీకరణలను ఇష్టపడితే ఎంచుకోండి
-
1.0 లీటర్ MT కోసం ధర (ఎక్స్-షోరూమ్ న్యూఢిల్లీ) – రూ. 4.33 లక్షలు
-
1.0 లీటర్ AMT కోసం ధర (ఎక్స్ షోరూమ్ న్యూఢిల్లీ) – రూ. 4.63 లక్షలు
-
RXT వేరియంట్ పై 1.0-లీటర్ MT కి చెల్లించిన ప్రీమియం – రూ. 28,000
-
RXT వేరియంట్ మీద 1.0 లీటర్ AMT కోసం చెల్లించిన ప్రీమియం – రూ. 28,000
రెనాల్ట్ క్వైడ్ యొక్క క్లైంబర్ వేరియంట్ మాత్రమే పెద్ద సామర్ధ్యం కలిగిన 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో మాత్రమే లభిస్తుంది. అయితే, మీరు దీనిలో మాన్యువల్ ట్రాన్స్మిషన్ మరియు AT ల మధ్య ఎంచుకొనే సధుపాయాన్ని కలిగి ఉన్నారు. మీరు RXT వేరియంట్ పై క్విడ్ క్లైంబర్ లో ఈ క్రింద అదనపు లక్షణాలు పొందుతారు:
-
డ్యుయల్-టోన్ ఆరెంజ్ ORVMలు
-
రగ్గడ్ బంపర్ ఓవర్ రైడ్ కానీ ఒక క్రోమ్ గ్రిల్ ని మిస్ అవుతుంది
-
ఫ్రంట్ & రేర్ టెర్రైన్ ప్రొటెక్టర్
-
ఆర్కింగ్ రూఫ్ బార్లు
-
ముందు డోర్స్ మరియు వెనుక విండ్ షీట్లో "క్లైంబర్" అనే చిహ్నం
-
డోర్ ప్రొటక్షన్ క్లాడింగ్
-
స్పోర్టి స్టీరింగ్ వీల్ "క్లైంబర్" చిహ్నం తో ఉంటుంది
-
స్టీరింగ్ వీల్, సైడ్ ఎయిర్ వెంట్స్ మరియు గేర్ నాబ్ (మాన్యువల్ వెర్షన్) మీద ఆరెంజ్ షేడ్స్
-
రియర్ సెంటర్ ఆర్మ్ రెస్ట్
-
"క్లైంబర్" చిహ్నంతో ఆరెంజ్ అప్హోల్స్టరీ
కొనుగోలు చేసుకొనేందుకు సరైనదా?
క్లైంబర్ వేరియంట్ అనేది అన్ని సౌందర్య మార్పులు కోసమే ఉన్నట్టుగా ఉంటుంది. RXT పై ఉన్న ఒక అదనపు లక్షణం మరియు మెచ్చుకోదగిన లక్షణం ఏమిటంటే (వెనుకవైపు కూర్చోడానికి మీరు దాన్ని కొనుగోలు చేసినట్లయితే మాత్రమే) వెనుక ఆరంరెస్ట్. క్లైంబర్ ఖరీదైన అప్గ్రేడ్ లాగా ఉండవచ్చు మరియు ఎవరికైతే తమ కారు మిగిలిన జనాల కార్ల కంటే కొంచెం భిన్నంగా ఉండాలని అనుకుంటారో వారికి ఇది సరైనది.
was this article helpful ?