2019 మారుతి బలేనో ఫేస్ లిఫ్ట్ వేరియంట్స్ వివరణ: సిగ్మా, డెల్టా, జీటా, ఆల్ఫా

ప్రచురించబడుట పైన Mar 07, 2019 09:50 AM ద్వారా Dhruv.A for మారుతి బాలెనో

  • 20 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

2019 Maruti Suzuki Baleno

మారుతీ సుజికీ బలేనో నాలుగు సంవత్సరాలు తరువాత నవీకరణను తీసుకొచ్చింది. ఇది కొత్త ముందర భాగం,కొత్త వీల్స్,నవీకరించబడిన అంతర్భాగాలు మరియు మరిన్ని ప్రాధమిక భద్రతా లక్షణాలను కలిగి ఉంది. ఇది రూ.5.45 లక్షల ధర నుండి రూ.8.77 లక్షల(ఎక్స్-షోరూం ఢిల్లీ) వరకూ ధరను కలిగి ఉంది. ఈ 2019 బలేనో ఫేస్‌లిఫ్ట్ సిగ్మా,డెల్టా,జెటా మరియు ఆల్ఫా అను నాలుగు వేరియంట్లతో అందుబాటులో ఉంది. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.3 లీటర్ డీజిల్ ఇంజన్ ఎంపికలతో కొనసాగిస్తూ అందించబడుతుంది. అయితే దీనిలో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఈ రేంజ్ లో ప్రాధమికంగా ఉండగా, పెట్రోల్ ఆధారిత వెర్షన్ CVT ని కూడా కలిగి ఉంది. అయితే ఏ ఇంజన్ వేరియంట్ మీకోసం బాగుంటుంది?? అది తెలుసుకొనే ముందు కొత్త కలర్ ఆప్షన్లు మరియు భద్రతా లక్షణాలను క్రింద తెలుసుకోండి.

రంగు ఎంపికలు:

. నెక్సా బ్లూ

.ఫోనిక్స్ రెడ్

.ఆటమన్ ఆరెంజ్

.ప్రీమియం సిల్వర్

.మాగ్మా గ్రే

.ఆర్కిటెక్ వైట్

ప్రామాణిక సేఫ్టీ కిట్

.డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్

.EBD తో ABS

.ప్రెటెన్షనర్ మరియు లోడ్ పరిమితులు ఉన్న సీట్బెల్ట్

.ISOFIX చైల్డ్ సీటు యాంకర్స్

.రేర్ పార్కింగ్ సెన్సార్స్

.సీటు బెల్ట్ రిమైండర్

.హై స్పీడ్ వార్నింగ్

మారుతి బలేనో సిగ్మా:  బేస్ వేరియంట్

వేరియంట్      పెట్రోల్                డీజిల్

సిగ్మా        రూ.5.45లక్షలు       రూ.6.60లక్షలు    

 

బయట భాగాలు: బాడీ-కలర్డ్ డోర్ హ్యాండిల్స్,ORVMs, బంపర్,బూట్ స్పాయిలర్,హాలోగెన్ హెడ్‌ల్యాంప్స్,LED టెయిల్‌ల్యాంప్స్ మరియు 15-ఇంచ్ స్టీల్ వీల్స్

లోపల భాగాలు: అడ్జస్టబుల్ ఫ్రంట్ హెడ్రెస్ట్

సౌకర్యాలు: ఫ్రంట్ పవర్ విండోస్,టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్,మాన్యువల్ AC,ఫ్రంట్ మరియు రేర్ ఆక్సిసరీ సాకెట్

ఆడియో: లేదు

ఇది కొనుగోలు చేసేందుకు సరైనదా?

ఇది బలేనో యొక్క బేస్ వేరియంట్ అయినా సరే, అవసరమైన సేఫ్టీ కిట్ ని కలిగి ఉంది. అయితే ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కి కావలసినటువంటి కొన్ని అవసరమైన వాటిని కలిగి లేదు. అంతేకాకుండా,వెనుక కూర్చినే ప్యాసింజర్లకు అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్ లు లేవు మరియు పవర్ విండోస్ లేవు. కానీ ఈ లక్షణాలు లేకపోయినా కూడా, మీరు ఇతర వేరియంట్ కొరకు డబ్బు వెచ్చించలేనట్లయితే ఇది మీకు పర్ఫెక్ట్ వేరియంట్ అని చెప్పవచ్చు. ఇంకా ఏమిటి కావాలి, మీరు ఆడియో యూనిట్ మరియు రేర్ పవర్ విండోస్ కావాలనుకుంటే అధనంగా మార్కెట్ లో పొందవచ్చు. మేము ఏ వేరియంట్ సూచిస్తామో తెలుసుకోవాలనుకుంటే, చదవడం కొనసాగించండి.

2019 Maruti Suzuki Baleno

మారుతి బాలెనో డెల్టా: చాలా అవసరాలను తీరుస్తుంది. టైట్ బడ్జెట్లో ఉన్న బలేనో కొనుగోలుదారులకు సరిపడే వేరియంట్.

వేరియంట్                                             పెట్రోల్                                                                                          డీజిల్

డెల్టా                                             రూ.6.16 లక్షలు                                                                                  రూ. 7.31 లక్షలు

సిగ్మా మీద ప్రీమియం( MT పై CVT కోసం అధనం)         రూ.71,000 (రూ 1.32 లక్షలు)                               రూ. 71,000

బయట భాగాలు: ఫ్రంట్ గ్రిల్ మీద క్రోమ్ యాసెంట్, ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్ తో పవర్-ఫోల్డింగ్ ORVMs లు , ఫుల్ వీల్ కవర్ మరియు గైడ్ లైట్స్ తో LED ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్.

లోపల భాగాలు: మెటల్ ఫిన్షెడ్ డోర్ హ్యాండిల్స్, అడ్జస్టబుల్ రేర్ హెడ్‌రెస్ట్స్ మరియు పార్కింగ్ బ్రేక్.

సౌకర్యాలు: కీలెస్ ఎంట్రీ, రేర్ పవర్ విండోస్, ఆటో అప్ / డౌన్ డ్రైవర్ విండో, క్లైమేట్ కంట్రోల్ మరియు 60:40 రేర్ స్ప్లిట్.

భద్రత: యాంటి పించ్ డ్రైవర్ పవర్ విండో, రేర్ వాషర్, వైపర్ మరియు డీఫాగర్.

ఆడియో: బ్లూటూత్ తో 2-DIN ఆడియో సిస్టమ్, స్టీరింగ్-మౌంటెడ్ నియంత్రణలతో USB మరియు AUX కనెక్టివిటీ.

ఇది కొనుగోలు చేసేందుకు సరైనదా?

మీరు మీ బడ్జెట్ ని ఇంక పెంచుకోలేను అనుకున్నట్లయితే ఇది మీకు సరైన వేరియంట్. ఇది లోపల మరియు బయట ప్రీమియం ఫీల్ ని కలిగి ఉంటుంది మరియు ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఎలా ఉండాలనుకుంటున్నారో, అలానే ఉంటుంది. అదనపు పరికరాలు రూ. 71,000 ఉంటాయి, ఇది విలువైనదిగా కనిపిస్తుంది మరియు మనకు కావలనుకొనేలా ఉంటుంది. దీనిలో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మరియు హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు మాత్రమే మిస్ అయ్యాయి. అయితే ఈ రెండు లక్షణాలు కూడా తరువాత వేరియంట్ నుండి ప్రామాణికంగా ఉంటున్నాయి. మీకు CVT సౌకర్యం కావాలనుకుంటే మీరు మాన్యువల్ వేరియంట్ పై అదనపు రు. 1.32 లక్షలు పెట్టుకోవాలి.

2019 Maruti Suzuki Baleno

మారుతి బలేనో జీటా: దాదాపుగా అన్ని అంశాలు  కవర్ అయ్యాయి.

వేరియంట్                           పెట్రోల్                                  డీజిల్

జీటా                                 రూ. 6.84 లక్షలు                  రూ.7.99లక్షలు

డెల్టా మీద ప్రీమియం       రూ. 68,000 (రూ 1.32 లక్షలు)    రూ.68,000

బయట భాగాలు: క్రోం డోర్ హ్యాండిల్స్ మరియు పెద్ద 16-ఇంచ్ అల్లాయ్ వీల్స్.

లోపల భాగాలు: గ్లోవ్‌బాక్స్, ఫ్రంట్ ఫుట్వెల్ మరియు లగేజ్ బే ఇల్లుమినేషన్, ఆటో డిమ్మింగ్ IRVM,  ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో TFT మల్టీ-ఇన్ఫర్మేషన్ డిస్ప్లే (MID).

సౌకర్యాలు: హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, స్టోరేజ్ బిన్ తో కూడిన ఫ్రంట్-సెంటర్ ఆర్మ్రెస్ట్, పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్, మరియు టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్.

భద్రత: ఫాగ్‌ల్యాంప్స్

ఆడియో: నావిగేషన్, వాయిస్ కమాండ్, ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు రిమోట్ కంట్రోల్ తో  7-ఇంచ్ స్మార్ట్ ప్లే స్టూడియో టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్.

ఇది కొనుగోలు చేసేందుకు సరైనదా?

ఈ వేరియంట్ లక్షణాల విభాగంలో ముందంజలో ఉంటుంది. ఫాగ్‌ల్యాంప్స్ మరియు ఆడియో డిమ్మింగ్ IRVM పక్కన పెడితే మిగతా అన్ని లక్షణాలు కావలసినవే. మీరు బాగా పొడవు వారు అయినా లేదా పొట్టి వారు అయినా, మీకు హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు కావలసి ఉంటుంది. ఈ లక్షణం ఈ వేరియంట్ నుండి మాత్రమే అందించబడుతుంది. మీ షాపింగ్ లిస్ట్ లో టచ్‌స్క్రీన్ ఉన్నట్ట్లైతే, హర్మాన్- డిరైవెడ్ స్మార్ట్ప్లే స్టూడియో యూనిట్ ని కలిగిన తక్కువ  ఖరీధైన వేరియంట్ ఇది.

2019 Maruti Suzuki Baleno

మారుతి బలేనో ఆల్ఫా: అధిక లక్షణాలను కలిగి ఉంది, కానీ బాగా ఖరీదు

వేరియంట్                       పెట్రోల్                                                       డీజిల్

 

ఆల్ఫా                               రూ.7.45 లక్షలు                                       రూ.8.60 లక్షలు

జీటా మీద ప్రీమియం            రూ.61,000 (రూ.1.32లక్షలు)              రూ.61,000

బయట భాగాలు: DRLతో ఆటో LED ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, భిన్నంగా రూపొందించిన LED రేర్ టెయిల్ ల్యాంప్స్ మరియు UV కట్ గ్లాస్.

ఇంటీరియర్స్: లెదర్-వ్రాపెడ్ స్టీరింగ్ వీల్.

భద్రత: రేర్ పార్కింగ్ కెమెరా.

సౌకర్యం: లేదు

కొనుగోలు చేసేందుకు సరైనదా?

ఆల్ఫా వేరియంట్ కొన్ని నూతన లక్షణాలను రేర్ పార్కింగ్ కెమేరా కి అధనంగా పొంది ఉంది. ఇది మా అభిప్రాయం లో జీటా వేరియంట్ నుండి లభ్యమవుతుంది మరియు ప్రీమియం రూ.61,000 డబ్బులు అధనపు ఎక్విప్మెంట్ కి న్యాయం చేయవు. ఇది రూ.30,000 నుండి రూ.35,000 ఎక్కువ ధరను ఉండి ఉంటే గనుక ఎవరైతే జిటా వేరియంట్ చూస్తున్నారో వాళ్ళకి మేము ఇది సిఫార్సు చేసేవాళ్ళము.   

2019 Maruti Suzuki Baleno

ఇప్పుడయితే మేము ఎవరైతే టైట్ బడ్జెట్ తో ఉన్నారో వారికి డెల్టా వేరియంట్ ని సిఫార్సు చేస్తాము మరియు ఎవరికైతే మరింత ప్రీమియం అనుభూతి కావాలో వారికి జీటా వేరియంట్ సిఫార్సు చేస్తాము.

ద్వారా ప్రచురించబడినది

Write your Comment పైన మారుతి బాలెనో

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

ఎక్స్-షోరూమ్ ధర కొత్త ధర
  • ట్రెండింగ్
  • ఇటీవల
×
మీ నగరం ఏది?