2018 టాటా టిగార్ వర్సెస్ మారుతి డిజైర్: వేరియంట్ల వివరాలు
టాటా టిగోర్ 2017-2020 కోసం dinesh ద్వారా ఏప్రిల్ 25, 2019 11:27 am ప్రచురించబడింది
- 37 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మారుతి డిజైర్ నుండి కొనుగోలుదారులను వేరు చేయటానికి నవీకరించబడిన టిగార్ తో టాటా తగినంత విధంగా మన ముందుకు వచ్చింది? వాటిని కనుగొంటూ ఆ రెండు వాహనాలను పోల్చుదాం
టాటా ఇటీవల నవీకరించబడిన టిగార్ వాహన ధర రూ 5.20 లక్షల నుంచి రూ .7.38 లక్షల (ఎక్స్- షోరూమ్ ఢిల్లీ) వరకు ప్రారంభమైంది. టాటా సంస్థ ఈ వాహనంలో, 7- అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్థ మరియు ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ వంటి అదనపు ఫీచర్లతో పాటు, నవీకరించబడిన సెడాన్ కు సూక్ష్మమైన సౌందర్య మార్పులతో అందించబడింది. ఈ టాటా టిగార్ వాహనం - మారుతి డిజైర్, హోండా అమేజ్, ఫోర్డ్ అస్పైర్, హ్యుందాయ్ ఎక్సెంట్ మరియు వోక్స్వాగన్ అమియో వంటి పోటీదారులను కొనసాగిస్తోంది. కానీ ఈ నవీకరణలు, టిగార్ ను సెగ్మెంట్ లో అగ్ర వాహనంగా మారుతి డిజైర్ పై విక్రయాల పరంగా ముందంజలో ఉండగలదా? ఈ రెండు కార్లలో, ధర కు తగిన విధంగా లక్షణాల జాబితాను ఏ వాహనం కలిగి ఉందో పూర్తిగా తెలుసుకోవడం ముఖ్యం.
• 2018 టాటా టిగార్ రూ 5.20 లక్షల వద్ద ప్రారంభం
డైవింగ్ కంటే ముందు వివరాలు లోకి వెళితే, రెండు ఉప కాంపాక్ట్ సెడాన్ల యొక్క కొలతలు మరియు ఇంజన్ లను సరి పోల్చాలి.
కొలతలు
-
టిగార్ కంటే డిజైర్ పొడవైనది మరియు విస్తృతను కలిగి ఉంది. అయితే, సెడాన్లలో ఇద్దరూ సమానమైన వీల్బేస్ ను కలిగి ఉన్నారు
-
మా మునుపటి పరీక్ష డేటా ఆధారంగా పరిమాణంలో మార్పులు లేనందున, డిజైర్ మరింత క్యాబిన్ స్థలాన్ని అందించడానికి కొనసాగించాలి
-
సామానులను పెట్టే సామర్ధ్యం విషయానికి వస్తే, టిగార్ పెద్ద బూట్ ను అందిస్తుంది
ఇంజిన్
-
అదే కెపాసిటీ కలిగిన ఇంజిన్లచే కొనసాగుతుంది, ఇక్కడ టిగార్ వాహనమే మరింత శక్తివంతమైన కారు, అయితే స్వల్పంగా మాత్రమే
-
రెండు కార్లు 5- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మరియు 5- స్పీడ్ ఏఎంటి గేర్బాక్స్ ఎంపికలతో అందుబాటులో ఉన్నాయి
-
డిజైర్ ఇక్కడ మరింత శక్తివంతమైన కారు. దాని 1.3- లీటర్ ఇంజిన్, టిగార్ యొక్క 1.05- లీటర్ ఇంజిన్ కంటే 4 పిఎస్ / 50 ఎన్ఎమ్ ఎక్కువ ఉత్పత్తులను విడుదల చేస్తుంది
-
ట్రాన్స్మిషన్ ఎంపికలు సంబంధించి, టిగార్ ఒక 5- స్పీడ్ ఎమ్టి తో మాత్రమే వస్తుంది, అయితే డిజైర్ 5- స్పీడ్ ఏఎంటి తో కూడా వస్తుంది
వేరియంట్లు: సరసమైనవి, మేము ఈ రెండు వాహనాలలో ఒకే రకమైన ధరతో ఉన్న కార్లను మాత్రమే పోల్చాము
టిగార్ ఎక్స్ఎమ్ వర్సెస్ డిజైర్ ఎల్
|
టాటా టిగార్ ఎక్స్ఎమ్ |
డిజైర్ ఎల్ |
తేడా |
పెట్రోల్ |
రూ 5.55 లక్షలు |
రూ 5.60 లక్షలు |
రూ 5,000 (డిజైర్ మరింత ఖరీదైనది) |
డీజిల్ |
రూ 6.41 లక్షలు |
రూ. 6.57 లక్షలు |
రూ 16,000 (డిజైర్ మరింత ఖరీదైనది) |
సాధారణ లక్షణాలు:
భద్రత: డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బాగ్స్
లైట్స్: మల్టీ- రిఫ్లెక్టర్ హాలోజెన్ హెడ్ల్యాంప్స్
ఇతర ఫీచర్లు: మాన్యువల్ ఏసి మరియు టిల్ట్ సర్దుబాటు స్టీరింగ్ వీల్
డిజైర్ తో పోలిస్తే టిగార్ లో అదనంగా అందించబడిన అంశాలు: వీల్ కవర్లు, షార్క్ ఫిన్ యాంటెన్నా, అన్ని నాలుగు పవర్ విండోస్, ఎత్తు సర్దుబాటు డ్రైవర్ సీటు, సర్దుబాటు ముందు సీటు హెడ్ రెస్ట్లు, వెనుక సెంటర్ ఆర్మ్స్ట్రెస్, బ్లూటూత్ మరియు బహుళ డ్రైవింగ్ మోడ్లతో కూడిన కనెక్ట్ నెక్స్ట్ మ్యూజిక్ సిస్టమ్
టిగార్ తో పోలిస్తే డిజైర్ లో అదనంగా అందించబడిన అంశాలు: ఏబిఎస్ తో ఈబిడి మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సీటు యాంకర్లు
తీర్పు: టిగార్, డిజైర్ కంటే మెరుగైన మరియు చాలా సరసమైన ధరను కలిగి ఉంది. అయినప్పటికీ, ఏబిఎస్ తో ఈబిడి మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సీటు యాంకర్లు వంటి ప్రాథమిక భద్రత లక్షణాలతో డిజైర్ ఇక్కడ మా ఎంపికగా ఉంది. ఈ లక్షణాలు మన వాహనాలలో తప్పక కలిగి ఉండాలి మరియు టిగార్లో ఉండవు.
టిగార్ ఎక్స్ జెడ్ + వర్సెస్ డిజైర్ వి
|
టాటా టిగార్ ఎక్స్జెడ్ |
డిజైర్ ఎల్ |
తేడా |
పెట్రోల్ |
రూ. 6.49 లక్షలు |
రూ 6.48 లక్షలు |
రూ 1,000 (టిగార్ ఎక్కువ ఖరీదైనది) |
డీజిల్ |
రూ 7.38 లక్షలు |
రూ 7.45 లక్షలు |
రూ 7,000 (డిజైర్ ఎక్కువ ఖరీదైనది) |
సాధారణ ఫీచర్లు (మునుపటి వేరియంట్ లలో అందించబడిన అన్ని అంశాలతో పాటు):
భద్రత: ఏబిఎస్ తో ఈబిడి
ఇన్ఫోటైన్మెంట్: బ్లూటూత్ మరియు స్టీరింగ్- మౌంట్ నియంత్రణలతో సంగీత వ్యవస్థ.
ఇతర ఫీచర్లు: ఎత్తు సర్దుబాటు డ్రైవర్ సీటు, వెనుక సెంటర్ ఆర్మ్ రెస్ట్, డే అండ్ నైట్ ఐఆర్విఎమ్, సర్దుబాటు ముందు హెడ్ రెస్ట్లు, ముందు మరియు వెనుక పవర్ విండోలు మరియు టర్న్ సూచికలు తో విద్యుత్ సర్దుబాటు ఓఆర్విఎం లు.
డిజైర్ తో పోలిస్తే టిగార్ లో ఉన్న అంశాలు: కార్నరింగ్ స్టెబిలిటీ కంట్రోల్, అల్లాయ్ వీల్స్, ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, టర్న్ ఇండికేటర్లతో కూడిన ఎలక్ట్రానిక్ ఫోల్డబుల్ ఓఆర్విఎం లు, ఆటో క్లైమేట్ కంట్రోల్, కుల్డ్ గ్లోవ్ బాక్స్, కెమెరా తో రేర్ పార్కింగ్ సెన్సార్స్, ఫ్రంట్ ఫాగ్ లాంప్స్, ఆండ్రాయిడ్ ఆటో మరియు బహుళ డ్రైవింగ్ మోడ్ లతో 7- అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్.
టిగార్ తో పోలిస్తే డిజైర్ లో అదనంగా ఏ అంశాలు ఉన్నాయి:ఐసోఫిక్స్ చైల్డ్ సీటు యాంకర్లు.
తీర్పు: రెండు వేరియంట్ల మధ్య, టిగార్ ఎక్స్జెడ్ + ఖచ్చితంగా మా ఎంపికగా ఉంది. అదే శ్రేణిలో ఉండగా, డిజైర్ కంటే బాగా అమర్చబడింది. అయితే, మీరు చిన్న పిల్లలను కలిగి ఉంటే, మేము డిజైర్ కోసం వెళ్ళమని సిఫార్సు చేస్తాము, ఎందుకంటే ఇది ఐసోఫిక్స్ చైల్డ్ సీటు యాంకర్లను కలిగి ఉంటుంది.
టాటా టిగార్ ఎక్స్జెడ్ఏ వర్సెస్ మారుతి డిజైర్ విఎక్స్ఐ ఏజిఎస్
టాటా టైగర్ ఎక్స్జెడ్ఏ |
మారుతి డిజైర్ విఎక్స్ఐ ఏజిఎస్ |
తేడా |
రూ 6.65 లక్షలు |
రూ 6.95 లక్షలు |
రూ. 30,000 (డిజైర్ మరింత ఖరీదైనది) |
సాధారణ లక్షణాలు:
భద్రత: ఏబిఎస్ తో ఈబిడి మరియు ద్వంద్వ ముందు ఎయిర్ బాగ్లు
ఇన్ఫోటైన్మెంట్: బ్లూటూత్ మరియు స్టీరింగ్- మౌంట్ నియంత్రణలతో సంగీత వ్యవస్థ.
ఇతర ఫీచర్లు: ఎత్తు సర్దుబాటు డ్రైవర్ సీటు, మాన్యువల్ ఏసి, వెనుక సెంటర్ ఆర్మ్ రెస్ట్, డే / నైట్ ఐవిఆర్ఎం, సర్దుబాటు ముందు హెడ్ రెస్ట్, ముందు మరియు వెనుక పవర్ విండోలు మరియు టర్న్ ఇండికేటర్లతో విద్యుత్ సర్దుబాటు ఓఆర్విఎం లు.
డిజైర్ కంటే టిగార్ లో అదనంగా అందించే అంశాలు: కార్నరింగ్ స్టెబిలిటీ కంట్రోల్, అల్లాయ్ వీల్స్, ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, టర్న్ ఇండికేటర్లతో కూడిన ఓఆర్విఎం లు, కుల్డ్ గ్లోవ్ బాక్స్, వెనుక పార్కింగ్ సెన్సార్లు, ముందు ఫాగ్ లాంప్లు మరియు స్పోర్ట్ డ్రైవింగ్ మోడ్.
టిగార్ కంటే డిజైర్ లో అదనంగా అందించే అంశాలు: ఐసోఫిక్స్ చైల్డ్ సీటు యాంకర్లు
తీర్పు: టిగార్ ఖచ్చితంగా మా ఎంపిక. మరింత సరసమైన ధరలో ఉండటమే కాకుండా డిజైర్ కంటే మరింత అద్భుతంగా అమర్చబడింది. అయితే, మీ కుటుంబంలో చిన్న పిల్లలను కలిగి ఉన్నట్లయితే, మీరు డిజైర్ కోసం వెళ్లమని సూచిస్తున్నాము, ఎందుకంటే ఇది ఐసోఫిక్స్ చైల్డ్ సీటు యాంకర్లను కలిగి ఉంటుంది.
టాటా టిగార్ |
మారుతి డిజైర్ |
ఎక్స్ఈ పెట్రోల్ రూ 5.20 లక్షలు |
|
ఎక్స్ఎమ్ పెట్రోల్ ధర 5.55 లక్షలు |
ఎల్ఎక్స్ఐ రూ 5.60 లక్షలు |
ఎక్స్జెడ్ పెట్రోల్ రూ 5.95 లక్షలు |
|
ఎక్స్జెడ్ + పెట్రోల్ రూ 6.49 లక్షలు |
విఎక్స్ఐ రూ 6.48 లక్షలు |
|
జెడ్ఎక్స్ఐ రూ 7.10 లక్షలు |
|
జెడ్ఎక్స్ఐ + రూ 8.0 లక్షలు |
ఎక్స్జెడ్ఏ రూ 6.65 లక్షలు |
విఎక్స్ఐ ఏజిఎస్ రూ 6.95 లక్షలు |
|
జెడ్ఎక్స్ఐ ఏజిఎస్ రూ 7.57 లక్షలు |
|
జెడ్ఎక్స్ఐ + ఏజిఎస్ రూ 8.47 లక్షలు |
|
|
ఎక్స్ఈ డీజిల్ రూ. 6.09 లక్షలు |
|
ఎక్స్ఎమ్ డీజిల్ రూ 6.41 లక్షలు |
ఎల్డిఐ రూ .6.57 లక్షలు |
ఎక్స్జెడ్ డీజిల్ రూ 6.84 లక్షలు |
|
ఎక్స్జెడ్ + డీజిల్ రూ. 7.38 లక్షలు |
విడిఐ రూ 7.45 లక్షలు |
|
జెడ్డిఐ రూ 8.07 లక్షలు |
|
జెడ్డిఐ + రూ 8.97 లక్షలు |
|
విడిఐ ఏజిఎస్ రూ 7.92 లక్షలు |
|
జెడ్డిఐ ఏజిఎస్ రూ 8.54 లక్షలు |
|
జెడ్డిఐ + ఏజిఎస్ రూ 9.44 లక్షలు |
ఇవి కూడా చదవండి
• 2018 ఫోర్డ్ అస్పైర్ ఫేస్లిఫ్ట్ వర్సెస్ మారుతి డిజైర్: వేరియంట్ల పోలిక
• 2018 ఫోర్డ్ అస్పైర్ ఫేస్లిఫ్ట్ వర్సెస్ హోండా అమేజ్: వేరియంట్ల పోలిక
మరింత చదవండి: టిగార్ ఆన్ రోడ్ ధర