2018 రెనాల ్ట్ క్విడ్ పాతది VS కొత్తది: ప్రధాన వ్యత్యాసాలు
ఏప్రిల్ 24, 2019 12:29 pm khan mohd. ద్వారా ప్రచురించబడింది
- 28 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
2018 లో రెనాల్ట్ క్విడ్ లో ఏంటేంటి మార్చబడ్డాయి? పదండి కనుక్కుందాము
రెనాల్ట్ సంస్థ 2018 క్విడ్ ని భారతదేశంలో కొన్ని నవీకరణలతో ప్రారంభించింది. 2018 రెనాల్ట్ క్విడ్ లో ప్రతి వేరియంట్ యొక్క ధరలు అంతకు ముందుదాని లాగానే ఉన్నాయి (రూ. 2.72 లక్షలు - రూ.4.69 లక్షలు, ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). కానీ కార్ల తయారీదారుడు ఈ హ్యాచ్‌బ్యాక్ ని డబ్బుకి తగ్గ విలువైనదిగా చేయడానికి కొన్ని కొత్త లక్షణాలను జోడించాడు. నవీకరించబడిన క్విడ్ లో ఏమిటి మార్చబడ్డాయి(మరియు ఏమిటి మార్చబడలేదు)చూద్దాము పదండి.
కొత్తవి ఏమిటి?
- క్విడ్ ఇప్పుడు ఒక ప్రామాణిక ఎమర్జెన్సీ లాకింగ్ రెట్రాక్టర్ (ELR) తో వెనుక సీటు బెల్ట్ కోసం వస్తుంది. ఇది ఆకస్మిక బ్రేకింగ్ వేసినప్పుడు ముందుకు వెళ్లకుండా ప్రయాణీకులను ఆపుతుంది.
- క్విడ్ యొక్క RXL వేరియంట్ ఇప్పుడు ముందు పవర్ విండోస్, రిమోట్ సెంట్రల్ లాకింగ్, ఫాగ్ లాంప్స్ మరియు ఫుల్ వీల్ కవర్లు తో వస్తున్నాయి.
- క్విడ్ యొక్క మిడ్ RXT (O)వేరియంట్ ముందు గ్రిల్ మరియు గేర్ నాబ్ మీద క్రోమ్ ని పొందుతుంది. వెనుక ప్రయాణీకులకు 12V సాకెట్ మరియు ఒక వెనుక పార్కింగ్ కెమెరా కూడా అందించడం జరుగుతుంది.
- క్విడ్ క్లైంబర్ ఇప్పుడు రేర్ ఆర్మ్రెస్ట్ ని పొందుతుంది.
- క్విడ్ యొక్క AMT ట్రాన్స్మిషన్ ఒక నవీకరణ ఇవ్వబడింది మరియు ఇది ఇప్పుడు క్రీప్ లక్షణాన్ని పొందుతుంది (దీనిని రెనాల్ట్ సంస్థ ట్రాఫిక్ అసిస్ట్ అని పిలుస్తుంది). ఇది స్థిరమైన పొజిషన్ నుండి కారు కదలడానికి ఆక్సిలరేషన్ నొక్కాల్సిన అవసరం లేదు, ఇది మీకు బంపర్ నుండి బంపర్ ట్రాఫిక్ లో బాగా ఉపయోగపడుతుంది. దీని యొక్క ప్రత్యర్ధులు అయిన డాట్సన్ రెడ్డి-GO, మారుతి ఆల్టో K10 మరియు టాటా టియాగో వంటి కార్లలో ఈ లక్షణం ఇప్పటికే వారి AMT లలో చేర్చబడింది.
ఏమిటి మార్చబడలేదు?
- 2018 రెనాల్ట్ క్విడ్ RXT (O) వేరియంట్ లో ముందు గ్రిల్ పైన క్రోం ని జోడించడం తప్ప ఎటువంటి సౌందర్య మార్పులను కలిగి ఉండదు.
- అంతర్భాగాలు కూడా అదే విధంగా ఉన్నాయి.
- క్విడ్ కూడా అదే ఇంజిన్లు అయిన 0.8-లీటరు మరియు 1.0 లీటర్ పెట్రోల్ మోటార్లు తోనే దాని మునుపటి వెర్షన్ లో ఉన్నట్టు అందించబడుతుంది. ట్రాన్స్మిషన్ ఎంపికలు కూడా చెక్కుచెదరకుండా ఉంటాయి – 5- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మరియు ఒక AMT.
దీని ధరలు అదే విధంగా ఉన్నాయి, ఈ రెనాల్ట్ యొక్క విలువల నిష్పత్తిని కూడా ఈ లక్షణాలతో రెనాల్ట్ పెంచిందని చెప్పవచ్చు, దీనికి గానూ రెనాల్ట్ సంస్థ కి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. దాని ప్రస్తుత మరియు కొత్త స్టాక్ ఆఫర్ల గురించి తెలుసుకోవటానికి, 'ఆగస్టు ఆఫర్స్ వీక్షించండి'.