ఎన్ ఏ ఐ ఏ ఎస్ 2016 లో బహిర్గతం కాబోతున్న 2017 మెర్సిడెస్ బెంజ్ ఈ క్లాస్
modified on జనవరి 18, 2016 11:02 am by manish కోసం మెర్సిడెస్ బెంజ్
- 10 సమీక్షలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
2016 నార్త్ అమెరికన్ ఇంటర్నేషనల్ ఆటో షో (ఎన్ ఏ ఐ ఏ ఎస్) లో అన్ని కొత్త మెర్సిడెస్ బెంజ్ ఈ క్లాస్ వాహనాలు రంగ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ వాహనం, భారతదేశంలో వచ్చే సంవత్సరం ప్రారంబించబడుతుంది. 2016 వసంతంలో యూ కె లో పరిచయం అవుతుంది మరియు తరువాత సంవత్సరం వేసవి లో యూ ఎస్ లో అమ్మకానికి వెళుతుంది. ఈ లగ్జరీ సెడాన్ వాహనాల ధర ట్యాగ్ గురించిన సమాచారాన్ని సంస్థ ఏ విధంగా బహిర్గతం చేయలేదు.
అన్ని కొత్త ఈ క్లాస్ వాహనాలు, మెర్సిడెస్ బెంజ్ లైనప్ లో ఉండే ఇతర వాహనాలు అయిన ఎస్ చ్లాస్ మరియు సి క్లాస్ వాహనాల డిజైన్ రూపకల్పన ను తీసుకోబోతుంది. మునుపటి వెర్షన్ తో పోలిస్తే, ఈ కొత్త ఈ క్లాస్ వాహనం పొడవు పరంగా 1.7 అంగుళాల ఎక్కువ పొడవుగా మరియు దీని యొక్క మొత్తం పొడవు 193.8 అంగుళాళు. 2017 మెర్సిడెస్ బెంజ్ ఈ క్లాస్ వాహనం, బారీ వీల్బేస్ తో రాబోతుంది. మునుపటి వెర్షన్ తో పోలిస్తే 2.6 అంగుళాల వీబేస్ ఎక్కువగా ఉండబోతుంది మరియు దీని మొత్తం వీల్బేస్ 115.7 అంగుళాలు.
ఈ మెర్సిడెస్ బెంజ్ ఈ క్లాస్ వాహనంలో అనేక సౌకర్యవంతమైన అంశాలు అందించబడతాయి. సంస్థ ఈ వాహనానికి, 12.3 అంగుళాల రెండు ఎల్ ఈ డి స్క్రీన్లు, దీనిలో ఒకటి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ యొక్క విదులను ప్రదర్శించడానికి నిర్వర్తిస్తుంది మరియు రెండవది ప్రయాణికులకు సమాచార వ్యవస్థ లక్షణాలను అందజేయడం లో సహాయం చేస్తుంది. క్యాబిన్ లో ఉండే స్టీరింగ్ వీల్ కు కూడా, ఒక ప్రకాశవంతమైన టచ్ ప్యాడ్ అందించబడుతుంది మరియు ఇది స్మార్ట్ ఫోన్ ద్వారా స్పందనను అందిస్తుంది. క్యాబిన్ లో ఉండే సంగీత వ్యవస్థ, 23 బర్మస్టర్ 3డి సరౌండ్ సౌండ్ స్పీకర్ లను కలిగి ఉంటుంది.
భారతదేశంలో అందించబడే ఈ క్లాస్ వాహనంలో, మెర్సిడెస్ బెంజ్ సి చ్లాస్ వాహనం లో ఉండే అదే 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ అందించబడుతుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 184 పి ఎస్ పవర్ ను అదే విధంగా 300 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు ఈ వాహనానికి 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ ను అందించడం జరిగింది. ఈ ఇంజన్ అత్యధికంగా, 194 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 400 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.
ఈ వాహనం యొక్క పవర్ ప్లాంట్లు విడుదల చేసే పవర్ ను గనుక గమనించినట్లైతే, వీటి ప్రత్యర్ధులు అయిన బిఎండబ్ల్యూ 5 సిరీస్ మరియు ఆడి ఏ 6 వంటి వాహనాలు ఉత్పత్తి చేసే పవర్ కంటే ఈ క్లాస్ వాహనాలు తక్కువ పవర్ ను విడుదల చేస్తాయి. ం
ఇవి కూడా చదవండి:
జిఎల్ ఈ 450 ఏఎంజి కూపే ను ప్రారంభించడానికి సిద్దపడుతున్న మెర్సిడెస్ బెంజ్
- Renew Mercedes-Benz E-Class Car Insurance - Save Upto 75%* with Best Insurance Plans - (InsuranceDekho.com)
- Best Health Insurance Plans - Compare & Save Big! - (InsuranceDekho.com)
0 out of 0 found this helpful