2017 హ్యుండై ఎలాంట్రా 2015 ఎల్ఏ ఆటో షోలో ఆరంగ్రేటం చేసింది
హ్యుందాయ్ ఎలన్ట్రా 2015-2019 కోసం nabeel ద్వారా నవంబర్ 20, 2015 11:04 am ప్రచురించబడింది
- 13 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
హ్యుండై వారు యూఎస్ మార్కెట్ కి 2017 ఎలాంట్రా ని ఇప్పుడు జరుగుతున్న ఎల్ఏ ఆటో షోలో ప్రదర్శించారు. ఇది ఈ కారు యొక్క ఆరవ తరం. ఇది 2017 ప్రారంభంలో యూఎస్ డీలర్ల వద్దకు చేరుకుంటుంది. భారతదేశంలో ఇది 2016 చివరికి అందించవచ్చును.
దక్షిణ కొరియాలో ఈ ఎలాంట్రా ని అవాంతె గా అందిస్తున్నారు. ఈ రెండు మోడల్స్ కి కేవలం సున్నితమైన తేడాలు ఉంటాయి. దిగువ శ్రేణి ఎస్ఈ ఇంకా లిమిటెడ్ ఎడిషన్ కి కూడా 2.0-లీటర్ ఎంపీఐ అట్‌కిన్సన్ 4-సిలిండర్ల ఇంజిను ఉండి, ఇది 147bhp శక్తిని 6,200rpm వద్ద ఇంకా 179Nm టార్క్ ని 4,500rpm వద్ద ఉత్పత్తి చేయగలిగే సామర్ధ్యం కలిగి ఉంటుంది. రెండవ ఇంజిను సరికొత్త 1.4-లీటర్ కాప్పా టర్బో చార్జడ్ జీడీఐ 4-సిలిండర్ ఇంజిను గా ఉండి ఇది ఎలాంత్రా ఈకో వేరియంట్ లో ఉండి ఇది 2016 చివరిలో అందుబాటులోకి వస్తుంది. ఈ ఇంజిను 5,500 వద్ద 128 శక్తిని ఇంకా 1,400-3,700 వద్ద 211.5 టార్క్ ని విడుదల చేయగలదు. దినికి ఈకోషిఫ్ట్ 7-స్పీడ్ డ్యువల్ క్లచ్ ట్రాన్స్మిషన్ జత చేయబడి ఉండి, ఈకో ట్రిం అయితే, దాదాపు లీటరుకి 14 కిలోమీటర్ల ఇంధన సామర్ధ్యం ఇవ్వగలదు.
యూఎస్ వెర్షన్ ఎలాంట్రాకి ఫ్రంట్ గ్రిల్లు పై క్రోము ఉండి, బంపర్ పై డే లైట్ రన్నింగ్ ల్యాంప్స్ ఉంటాయి. మునుపటి ఫ్లూయిడిక్ డిజైన్ ని వదిలి హ్యుండై వారు కొత్త డిజైన్ ని అమలౌ పరిచిన కారణంగా ఇంకా ఏరోడైనమిక్ గా ఈ కారు తయారైంది. హెక్సాగోనల్ గ్రిల్లుకి సీ-ఆకారపు ఫాగ్ ల్యాంప్స్ తోడు అయ్యాయి. టెయిల్ ల్యాం ఇంకా బూట్ కూడా భిన్నంగా తయారు చేశారు. లోపల, కారులో అధునాతన 8.0-అంగుళాల నావిగేషన్ సిస్టము ఉండి, దీనికి టచ్ సెన్సివిటి, డ్రాగ్ కంట్రోల్, పెరిగిన స్క్రీన్ బ్రైట్‌నెస్, స్ప్లిట్ స్క్రీన్ డిస్ప్లే లో మ్యాప్ మరియూ మ్యూజిక్ డాటా ఉండగలవు. అధిక కనెక్టివిటీకై, ప్రీ-లోడెడ్ ఆప్స్, వాయిస్ కంట్రోల్ ఫంక్షన్లు, ప్రీమియం సీరియస్ ఎక్స్ఎం లక్షణాలు కూడా ఉంటాయి. పైగా, మొట్టమొదటి సారిగా ఎలాంట్రాలో 8-స్పీకర్ల ఇంఫినిటీ ప్రీమియం ఆడియో సిస్టము తో పాటుగా సెంటర్ స్పీకరు ఇంకా సబ్ వూఫరు కూడా కలవు.