2017 ఆడీ S4 సూపర్ చార్జర్ ని కోల్పోతుంది, మాన్యువల్ గేర్ బాక్స్ టర్బో చార్జర్ ని ఎంచుకుంటుంది
సెప్టెంబర్ 21, 2015 05:28 pm bala subramaniam ద్వారా సవరించబడింది
- 19 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
ఆడి సంస్థ 2015 ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షోలో 2017 ఆడీ S4 సెడాన్ మరియు S4 అవంత్ ను ఆవిష్కరించారు. కొత్త ఆడి S4 చూడడానికి కొత్త A4 కంటే పెద్ద తేడాగా ఏమీ లేదు. దీనిలో చిన్న చిన్న నవీకరణలైనటువంటి ఎస్-నిర్ధిష్ట వెనుక డిఫ్యూజర్ తో పాటూ క్వాడ్ ఎగ్జాస్ట్ టెయిల్ పైపులు మరియు బాహ్య వెనుక వీక్షణ అద్దాలపై అల్యూమినియం ముగింపులు వంటి నవీకరణలు తప్ప A4 కి S4 కి పెద్ద తేడా ఏమీ లేదు. కొత్త S4 లో అన్నిటికంటే ముఖ్యమైన మార్పు ఏమిటంటే, ప్రస్తుత నమూనా యొక్క సూపర్ చార్జర్ టెక్ స్థానంలో టర్బో చార్జింగ్ టెక్నాలజీ అమలు చేయడమే.
ఈ 2017 ఆడీ S4 కి కొత్తగా అభివృద్ది చేయబడిన V6 పెట్రోల్ ఇంజినుతో టర్బో చార్జింగ్ అమర్చబడి ఉంటుంది. ప్రస్థుతం ఉన్న కారుని తలదన్నుతూ, ఈ కారు 1300rpm నుండి 4500rpm వద్ద 354bhp శక్తి మరియూ 500Nm టార్క్ ని విడుదల చేసే 3.0-లీటర్ ఇంజిను కలిగి ఉంటుంది.
ఇది 8-స్పీడ్ టిప్ ట్రానిక్ ట్రాన్స్మిషన్ కి జత చేయబడి ఉంది. ఈ S4 గంటకి 0 నుండి 100 మైళ్ళను కేవలం 4.7 సెకనుల్లో (ప్రస్తుత మోడలు కంటే 0.2 సెకనులు ఎక్కువగా) మరియూ గరిష్ట వేగం గంటకి 250 కీ.మీ లు గ ఉంది.
లోపల, కొత్త S4 స్ స్పోర్ట్స్ సీట్లు పర్ల్ నాప్పా లెదర్ లో ఉండి మరియూ అల్కంట్రా ని ఇబోనీ, రోటోర్ గ్రే మరియూ మ్యాగ్మా రెడ్ లలో పొందవచ్చు. సీట్లకి అడ్జస్టబుల్ సైడ్ ఫంక్షన్స్, అనుసంధానం కలిగిన హెద్ రెస్ట్స్ మరియూ నుమాటిక్ మసాజ్ ఫంక్షన్ కలిగి ఉంటుంది.
ఆడీ S4 కి ఆడీ వర్చువల్ కాక్ పిట్, ఒక 12.3 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియూ MMI ఆపరేటింగ్ సిస్టము తో ఆప్షనల్ MMI నావిగేషన్ ప్లస్ తో MMI టచ్ మరియూ 8.3 అంగుళాల మానిటర్, ఒక రోటరీ పుష్ బటన్ కి ఒక అనుసంధాన టచ్ ప్యాడ్ ని జూమింగ్ మరియూ స్క్రోలింగ్ కోసం అమర్చబడి ఉంటాయి.