DRLS తో వోక్స్వ్యాగన్ వెంటో 2016 ఆటో ఎక్స్పోలో ప్రదర్శించబడింది
వోక్స్వాగన్ వెంటో 2015-2019 కోసం raunak ద్వారా ఫిబ్రవరి 09, 2016 03:08 pm సవరించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
వోక్స్వ్యాగన్ సంస్థ ఆటో ఎక్స్పోకి కొద్ది రోజుల ముందే నవీకరించిన పోలో మరియు వెంటో ని ప్రారంభించింది. 2016 ఆటో ఎక్స్పో వద్ద ఈ ప్రదర్శించబడిన కారు పగటిపూట నడుస్తున్న LED లతో ట్వీకెడ్ హెడ్ల్యాంప్స్ ని కలిగి ఉంది. అయితే, జర్మన్ వాహన సంస్థ ఆ వాహనాల ప్రారంభ సమయంలో హెడ్ల్యాంప్స్ గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. వోక్స్వ్యాగన్ సంస్థ పోలో మరియు రాబోయే ఏమియో కాంపాక్ట్ సెడాన్ మధ్య భేదం ఉంచే క్రమంలో, 2016 లో వెంటో లో ఇది అందివ్వచ్చు. ఈ సందర్భంలో ఇది వెంటో ని నిలబెట్టి జెట్టా మరియు రాబోయే పస్సాత్ తో చేరుకొనేలా చేస్తుంది. ఈ హెడ్లైట్ ఎక్కువగా హైలైన్ ట్రిం లో రావచ్చు లేదా ఆప్ష్నల్ గా రావచ్చు.
ఇదికాకుండా వెంటో వాహనం పత్రికా ప్రకటనలో పేర్కొన్న అన్ని నవీకరణలను కలిగి ఉంది. దీనిలో ముఖ్యమైన అంశం ఏమిటంటే టచ్స్క్రీన్ సమాచార వినోద వ్యవస్థ. ఈ కొత్త యూనిట్ మిర్రర్ లింక్ కనెక్టివిటీతో కూడా వస్తుంది. ఈ వ్యవస్థ ట్చ్స్క్రీన్ పై మీ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ వచ్చేలా చేస్తుంది. ఇది రెయిన్ సెన్సింగ్ వైపర్స్ తో పాటూ ఆటో డిమ్మింగ్ అంతర్గత వెనుక వ్యూ అద్దం తో కూడా వస్తుంది.
యాంత్రికంగా, వెంటో, ఏమాత్రం మార్పులేకుండా ఉంది. ఇది 1.6 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ మరియు 1.5 లీటర్ TDi తో పాటూ 1.2 లీటర్ TSi పెట్రోల్ తో వస్తుంది. ట్రాన్స్మిషన్ పరంగా ఈ వాహనం 5-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ డ్యూయెల్-క్లచ్ డ్శ్ఘ్ గేర్బాక్స్ తో అందించబడుతుంది.