• English
  • Login / Register

2016 టొయోటా ఇన్నొవా ని నవంబర్ 23, 2015 న ఆవిష్కరిస్తారా?

టయోటా ఇనోవా కోసం nabeel ద్వారా అక్టోబర్ 19, 2015 01:15 pm ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

ఈ కారు 2005 లో విడుదల అయినప్పటి నుండి టొయోటా కి లాభం చేకూర్చుంది. ఇది టొయోటా క్వాలిస్ ని భర్తీ చేసింది. అప్పటి నుండి 2009, 2012, 2013 ఇంకా 2015 సంవత్సరాలలో మార్పులు పొందింది. ఇప్పటికే ఐదు మోడల్స్ ఉండటంతో ఇన్నొవా వారు కొత్త మోడల్ ని నవంబర్ 23, 2015 న విడుదల చేయనున్నారు. ఈ ఎంపీవీ ని 2016 ఆటో ఎక్స్‌పో లో సరికొత్త ఫార్చునర్ తో పాటుగా ప్రదర్శించనున్నారు.  

రాబోయే ఇన్నొవా కి 2.4-లీతర్ జీడీ సీరీస్ కి చెందిన ఇంజిను కలిగి ఉంటుంది. ఈ 2జీడీ -ఎఫ్‌టీవీ ఇంజిను 148 శక్తి ఇంకా 40.78 టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ సీరీస్ యొక్క 2.8-లీటర్ వెర్షన్ 2016 ఫార్చునర్ లో అమర్చబడనుంది. ఇది 175 శక్తి ఇంకా 45.9 టార్క్ విడుదల చేస్తుంది. ఈ 2016 ఇన్నొవా కూడా కొత్త ఫార్చునర్ తరహాలో ఉంటుంది. ఇది టోయోటా వారి ఇన్నొవేటివ్ ఇంటర్‌న్యాషనల్ మల్టీ-పర్పస్ వెహికల్ని ఆధారం చేసుకుని ఉంది. ఈ కారుని చూస్తే, ఇది 2015 మోడలు కంటే పొడవుగా ఉంది కనుక లోపల రెండవ మరియూ మూడవ వరుసలకి ఖాళీ కూడా ఎక్కువగ ఉంటుంది. గ్రిల్లుపై క్రోము పూతలు మరియూ కొత్త టెయిల్ లైట్ క్లస్టర్ కలిగి ఉంటుంది. కొత్త హెక్సాగొనల్ ఎయిర్ డ్య్యాం దీని ధుడుకు రూపానికి ఆజ్యం పోస్తుంది. 

2015 ఇన్నొవా సాంకేతికంగా అలాగే ఉంది కాని ఎయిర్ బ్యాగ్స్ వంటివి అన్ని వేరియంట్స్ కి ప్రామాణికం చేయడం వంటి మార్పులు జరిగాయి. ఇతర మార్పులు కొత్త ముందు వైపు గ్రిల్లు, స్పోర్టీ మౌల్డింగ్ పక్క వైపున, వెనుక డోర్ కి క్రోము పూత మరియూ బాహ్యపు అద్దాలకి టర్న్ సిగ్నల్ ఇండికేటర్ వంటివి అందుకుంది.

was this article helpful ?

Write your Comment on Toyota ఇనోవా

ట్రెండింగ్‌లో ఉంది ఎమ్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience