• English
  • Login / Register

2016 టొయోటా ఇన్నొవా యొక్క చిత్రాలు అధికారిక బ్రోషర్ ద్వారా కంటపడ్డాయి

టయోటా ఇనోవా కోసం raunak ద్వారా అక్టోబర్ 28, 2015 04:14 pm ప్రచురించబడింది

  • 13 Views
  • 13 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

వచ్చే నెల ఆవిష్కారానికి మునుపే ఈ రెండవ తరం 2016 ఇన్నొవా యొక్క చిత్రాలు బ్రోషర్ ద్వారా కంటపడటం జరిగింది.  టొయోటా వారు ఇన్నోవా ని పూర్తిగా పునరుద్దరించారు. రాబోయే ఫార్చునర్ లాగా ఈ ఇన్నోవా కి కొత్త ఇంజిను లభిస్తుంది.  ఈ బ్రోషర్ ఇండొనేషియా ప్రత్యేక రెండవ తరం ఇన్నోవా. టొయోటా వారు దీనిని 2016 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో బహిర్గతం చేయవలసి ఉంది.

డిజైన్ గురించి మాట్లాడుతూ, ఇన్నోవా మరింత పెద్దగా ఉండి ఫ్రంట్ ఫాసియా తాజా టొయోటా మోడల్స్ కి ఉన్న విధంగానే ఉంటుంది. ఒక పెద్ద హెక్సాగొనల్ గ్రిల్లు మరియూ చాలా క్రోము కలిగి ఉంటుంది, హెడ్‌ల్యాంప్స్ కి ఎల్ఈడీ ప్రొజెక్టర్ తో డే టైం రన్నింగ్ ఎల్ఈడీలు అనుసంధానం అయ్యి ఉంటాయి. ఇవి అచ్చం క్యామ్రీ ఇంకా కరొల్లా మాదిరిగా ఉంటాయి.  ఇండికేటర్లు ఫాగ్ ల్యాంప్స్ తో పాటుగా ఉటాయి. క్యాబిన్ కొత్తది మరియూ డిజైన్ కొద్దిగా కరొల్లా/ఫార్చునర్ (2వ తరం) లా ఉంటుంది.  కొత్త ఇన్నోవా లో విలాసం ఎన్నో రెట్లు పెంచడం జరిగింది. ఇందులో భాగంగా, క్యాబిన్ లైటింగ్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇంఫొటెయిన్‌మెంట్ సిస్టం, ఆల్ ఆటో-డౌన్ పవర్ విండోస్ మరియూ మరెన్నో లక్షణాలు ఇందులో ఉన్నాయి.

భారతదేశం గురించి మాట్లాడుతూ, టొయోటా వారు ఇన్నోవా ని పెట్రోల్ ఇంజినుతో అందించేవారు కానీ ఇప్పుడు ఈ ప్రస్తుతం పునరుద్దరణలో దీనిని నిలిపివేశారు. కాబట్టి ఇప్పుడు ఇన్నోవా కేవలం డీజిల్ లో మాత్రమే లభ్యం అవుతుంది. వీటికి కొత్త 2.4-లీటర్ టర్బో-ఇంటర్‌కూలడ్ డైరెక్ట్-ఇంజెక్షన్ డీజిల్ ఉంటుంది. ఈ ఇంజిను 149bhp శక్తి 3,400 ఆర్పీఎం వద్ద మరియూ 342Nm టార్క్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో జత చేసినప్పుడు విడుదల చేయగా, 6-స్పీడ్ ఆటోమాటిక్ గేర్ బాక్స్ తో జత చేయబడినప్పుడు 360Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. అంతర్జాతీయంగా ఇది 2.0-లీతర్ డ్యువల్ VVT-i పెట్రోల్ ఇంజిను కలిగి ఉంటుంది.

was this article helpful ?

Write your Comment on Toyota ఇనోవా

ట్రెండింగ్‌లో ఉంది ఎమ్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience