ఇండోనేషియా లో ప్రారంభించబడిన 2016 టయోటా ఇన్నోవా
టయోటా ఇనోవా కోసం raunak ద్వారా నవంబర్ 24, 2015 09:20 am ప్రచురించబడింది
- 11 Views
- 6 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఈ కొత్త ఇన్నోవా ను, ఫిబ్రవరి లో జరిగే 2016 భారత ఆటో ఎక్స్పోలో ప్రదర్శించనున్నారు అయితే, ఈ వాహనం వచ్చే సంవత్సరం ప్రవేశపెట్టే అవకాశం ఉంది అని భావిస్తునారు.
జైపూర్: వరుస అపజయాలు తర్వాత, టయోటా అధికారికంగా ఇండోనేషియా లో ఇన్నోవా యొక్క రెండవ తరం వాహనాన్ని ప్రారంభించింది. ఈ టయోటా, ఎంపివి యొక్క ప్రపంచ అరంగేట్రాన్ని సూచిస్తుంది. ఈ కొత్త ఇన్నోవా యొక్క ధర ఐడిఆర్ 282 మిలియన్ (భారతీయ రూపాయిలలో సుమారు 13.60 లక్షలు) ఇది దిగువ శ్రేణి పెట్రోల్ వాహనం యొక్క ధర. అదే దిగువ శ్రేణి డీజిల్ వాహనం విషయానికి వస్తే, ఐ డి ఆర్ 310.1 మిలియన్ (భారతీయ రూపాయిలలో సుమారు 14.95 లక్షలు). భారతదేశంలో ప్రారంభం విషయానికి వస్తే, ఈ ఇన్నోవా భారతదేశంలో వచ్చే ఫిబ్రవరి ఆటో ఎక్స్పోలో ప్రదర్శింపబడుతుంది. అదే ప్రయోగం విషయానికి వస్తే, ఈ వాహనం వచ్చే సంవత్సరంలో ప్రవేశపెట్టబడుతుంది.
కొత్త ఇన్నోవా యొక్క ధర, ప్రస్తుతం ఉన్న వాహనం కంటే ఎక్కువ అని చెప్పవచ్చు. ఇండోనేషియాలో వాహనాల ధరలు వరుసగా, పెట్రోల్ ఐ డి ఆర్ 282- 384.8 మిలియన్ (భారతీయ రూపాయిలలో సుమారు 13.60 - 18.6 లక్షలు) మరియు డీజిల్ - ఐ డి ఆర్ 310.1- 423.8 మిలియన్ (భారతీయ రూపాయిలలో సుమారు 14.95 - 20.43 లక్షలు). భారతదేశం గురించి మాట్లాడటానికి వస్తే, పెట్రోల్ ఎంపికకు ఉన్న తక్కువ డిమాండ్ కారణంగా ఈ వాహనాన్ని నిలిపివేసి దాని స్థానంలో కొత్త ఇన్నోవా తో భర్తీ చేశారు. ఈ టయోటా, రాబోయే రెండవ తరం లో డీజిల్ ఎంపిక తో మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
యాంత్రికంగా చెప్పాలంటే, ఈ వాహనం 2.4 లీటర్ యూనిట్ 2 జిడి ఎఫ్టివి 4 సిలండర్ ఇన్ లైన్ డీజిల్ ఇంజన్ తో వస్తుంది. ఈ ఇంజన్, డి ఓ హెచ్ సి వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా నాలుగు సిలండర్లను మరియు 16 వాల్వ్ లను కలిగి ఉంటుంది మరియు దీనితో పాటు ఒక విఎన్ టి ఇంటర్ కూలర్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 2393 సిసి స్థానభ్రంశ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 3400 ఆర్ పి ఎం వద్ద 149 పి ఎస్ పవర్ ను అదే విధంగా 1200 నుండి 2800 ఆర్ పి ఎం మధ్యలో 342 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ట్రాన్స్మిషన్ ఎంపికల విషయానికి వస్తే, ఈ వాహనానికి 5- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ప్రామాణికంగా అందించబడుతుంది. దీనితో పాటు, ఈ వాహనానికి 6- స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అనేది ఆప్షనల్ ఎంపిక గా అందించబడుతుంది.
ఇంకా చదవండి