2016 టయోటా ఇన్నోవా: మీరు తెలుసుకోవలసిన విషయాలు

టయోటా ఇనోవా కోసం manish ద్వారా నవంబర్ 26, 2015 11:11 am ప్రచురించబడింది

జైపూర్:

రెండవ తరం టయోటా ఇన్నోవా అధికారికంగా ఇండోనేషియా లో ప్రారంభించబడింది. ఈ ప్రారంభం,  టయోటా MPVయొక్క అంతర్జాతీయ రంగప్రవేశానికి కూడా గుర్తింపబడింది. ఈ కారు IDR 282 మిలియన్(రూ.13.60 లక్షలు) ధరకు ప్రారంభించబడినది. ఈ ధర పెట్రోల్ వేరియంట్ కి గానూ అందించడమైనది. ఈ వేరియంట్  భారతదేశానికి రాకపోవచ్చు. భారతదేశానికి ప్రత్యేకమైన డీజిల్ వేరియంట్ IDR 310.1 మిలియన్(రూ.14.95 లక్షల) ధరతో ప్రారంభించబడినది. రెండవ తరం టయోటా ఇన్నోవా ఫిబ్రవరి 2016 లో జరుగనున్న ఆటో ఎక్స్పోలో భారతదేశం లో ప్రారంభించబడుతుంది. అయితే, భారతదేశ ప్రత్యేకమైన  ఇండోనేషియన్ వేరియంట్ వివరాలు ఆన్లైన్ లో విడుదలైనాయి. కనుక, కొత్త టయోటా ఇన్నోవా 2016 గురించి మొత్తం వివరాలు తెలుసుకుందాం పదండి.  

బాహ్యభాగాలు:

కారు యొక్క ఇండోనేషియా వేరియంట్  అల్యూమినా జాడే, ఆటిట్యుడ్ బ్లాక్, అవాంట్ గ్రాండే బ్రోంజ్, డార్క్ గ్రే మైకా మెటాలిక్, సిల్వర్ మెటాలిక్ మరియు సూపర్ వైట్ అను ఆరు రంగులలో లభిస్తుంది. అంతేకాకుండా ముందర కొత్త ఎల్ఇడి ప్రొజక్టర్ హెడ్‌ల్యాంప్స్, పెద్ద హెగ్సాగొనల్ ఎయిర్‌డ్యాం, డ్యుయల్ స్లాట్ క్రోం గ్రిల్, స్మార్ట్ క్లోజ్ టెయిల్‌గేట్, 16 మరియు 17 అంగుళాల ఆప్షనల్ అలాయ్ వీల్స్ వంటి సౌందర్య నవీకరణలను కూడా పొందింది.

అంతర్భాగాలు:

ఈ కారు యొక్క అంతర్భాగాలు ప్రకాశవంతమైన ల్యాంప్స్, వుడెన్ ఫినిష్, ట్రికెల్ డౌన్ డాష్‌బోర్డ్ మరియు టిల్ట్ స్టీరింగ్ వీల్(ఆప్షనల్ ట్రిం) ఇవన్నీ  కూడా చూడడానికి ప్రీమియం ఫీల్ ని అందిస్తాయి. ఇన్స్టృమెంట్స్ పరంగా, కొత్త ఇన్నోవా ఎయిర్ గెస్చర్, వెబ్ బ్రౌజర్, మిరా కాస్ట్, టొయోటా మూవ్, వాయిస్ కమాండ్, డిజిటల్ లివింగ్ నెట్వర్క్ అలయన్స్ మరియు HDMI, బ్లూటూత్ & స్మార్ట్ఫోన్ కనెక్టివిటీ వంటి లక్షణాలను కలిగియున్న క్రొత్త 8 అంగుళాల అడ్వాన్స్ టచ్స్క్రీన్ సమాచార వినోద వ్యవస్థను కలిగి ఉంది. అలానే కారు  ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆటోమెటిక్ పవర్ విండోస్, టిఎఫ్టి టైప్ MID అన్నీ కూడా  ప్రీమియం క్యామ్రీ సెడాన్ యొక్క స్మృతిగా ఉన్నటువంటి లక్షణాలను కలిగి ఉంది.  

గ్రంట్ :

ఈ వాహనంలో ఇంజిన్ విషయానికి వస్తే, కొత్త ఇన్నోవా  2.4-లీటర్, 2 GD FTV 4 సిలిండర్ ఇన్-లైన్, VNT ఇంటర్ కూలర్ తో 16 వాల్వ్ DOHC ఇంజన్ ని కలిగి ఉంటుంది. ఈ పవర్‌ప్లాంట్  3400rpm వద్ద 149ps శక్తిని మరియు 1,200-2,800Rpm మధ్య 342Nm టార్క్ ని అందిస్తుంది. ఈ ఇంజిన్  ప్రామాణిక 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఆప్ష్నల్ 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటుంది. ఈ పవర్‌ప్లాంట్ ఎకో, నార్మల్ మరియు పవర్ మోడ్ అను మూడు ఫార్మేట్స్ లో లభిస్తాయి.  ఈ డ్రైవ్ సెలెక్టర్ MPV యొక్క అన్ని వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది.  

భద్రత:

కొత్త ఇన్నోవా అన్ని మోడళ్లు అంతటా ప్రమాణంగా EBD తో ABS ని కలిగి ఉంది. ఈ కారు స్మార్ట్ కీ ఎంట్రీ, చైల్డ్ సీటుకి ఈసొఫిక్ష్, హిల్ అసిస్ట్ కంట్రోల్ మరియు వాహన స్థిరత్వం నియంత్రణ వంటి లక్షణాలతో అందుబాటులో ఉంది. ఎయిర్‌బ్యాగ్స్ పరంగా, 2016 ఇన్నోవా కర్టైన్, సైడ్, నీ మరియు  డ్యుయల్-ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ వంటి భద్రతా లక్షణాలతో సురక్షితంగా ఉంటుంది.

ఇంకా చదవండి:

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన టయోటా ఇనోవా

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎమ్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience