2016 SEMA షో: కరోలా మరియు క్యామ్రీ యొక్క టీఅర్‌డి ఎడిషన్లను ప్రదర్శించిన టొయోటా సంస్థ
published on nov 09, 2015 06:45 pm by అభిజీత్ కోసం టయోటా కామ్రీ 2015-2022
- 12 సమీక్షలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
టొయోటా ప్రస్తుతం యుఎస్ఎ లాస్ వేగాస్,లో జరుగుతున్న SEMA ప్రదర్శనలో TRD (టయోటా రేసింగ్ డెవలప్మెంట్) క్యామ్రీ మరియు కరోలా ని వెల్లడించింది. ఈ రెండు కార్లు నిరాడంబరమైన బాహ్య స్వరూపాలని మరియు కొన్ని యాంత్రిక నవీకరణలను అందుకుంది.
అమెరికా లో కరోలా ఒకే బాడీ షెల్ ని కలిగి ఉన్నప్పటికీ వేరే ముఖం మరియు వెనుక భాగంతో ఉంది. టీఅర్‌డి కారు గురించి మాట్లాడుకుంటే, ఇది ముందరి స్పాయిలర్ తో ఉత్తేజపరిచే బాడీ కిట్ ని, సైడ్ స్కర్ట్స్ మరియు డిఫ్యూజర్ ని కలిగి ఉంది. వీటితో పాటూ ఈ వాహనం క్యాట్-బ్యాక్ ఎగ్సాస్ట్ వ్యవస్థ , లోవరింగ్ స్ప్రింగ్స్ మరియు బ్రాంజ్ ఫినిషింగ్ తో 19 అంగుళాల అలాయ్ వీల్స్ ని కలిగి ఉంది. ఇంజిన్ పరంగా, ఇది భారతదేశం లో కూడా అందుబాటులో ఉన్న 1.8 లీటర్ లైన్ నాలుగు సిలిండర్ పెట్రోల్ మోటార్ ని కలిగి 140bhp శక్తిని మరియు 171Nm టార్క్ ని అందిస్తుంది. కానీ, ఇది యుఎస్ లో ఒక 6-స్పీడ్ మ్యాన్యువల్ వ్యవస్థతో జత చేయబడి ఉంది.
క్యామ్రీ ఫ్రంట్ లిప్ స్పాయిలర్ తో సూక్ష్మ బాడి కిట్ ని, పొడిగించిన సైడ్ స్కర్ట్స్ మరియు ఒక కొత్త వెనుక డిఫ్యూజర్ ని కలిగి ఉంది. కారు ముందు భాగంలో ఒక అంగుళం తగ్గించబడినది. అయితే, వెనుక భాగం టీఅర్‌డి స్ప్రింగ్స్ సౌజన్యంతో 1.5 అంగుళాలు తగ్గించబడింది. ఈ స్పోర్టి క్యామ్రీ కరోలా రంగు మాదిరిగానే ఉన్న భారీ 21-అంగుళాల అలాయ్ వీల్స్ తో అందించబడుతుంది.
ఈ క్యామ్రీ యొక్క కొత్త సమూహంలో, మంచి బ్రేక్ మెత్తలు మరియు స్పోర్ట్స్ ఎగ్జాస్ట్ పొందింది. అయితే, టయోటా ప్రామాణిక కారు యొక్క శక్తి ఉత్పత్తిలో మార్పు గురించి ఏవ్యాఖ్యలు చేయలేదు. ఈ క్యామ్రీ ఒక V6 పెట్రోల్ మోటార్ ఇంక 268 bhp శక్తి కలిగి మరియు వరుసగా టార్క్ 336 Nm ఉత్పత్తి పొందగలదు.
- Renew Toyota Camry 2015-2022 Car Insurance - Save Upto 75%* with Best Insurance Plans - (InsuranceDekho.com)
- Loan Against Car - Get upto ₹25 Lakhs in cash
0 out of 0 found this helpful