• English
  • Login / Register

యు.ఎస్ లో ప్రకటించబడిన 2016 హోండా సివిక్ సెడాన్ యొక్క ధరలు

హోండా సివిక్ కోసం nabeel ద్వారా అక్టోబర్ 21, 2015 12:36 pm ప్రచురించబడింది

  • 13 Views
  • 87 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

2016 Honda Civic

హోండా యుఎస్ లో దాని కొత్త 10 వ తరం సివిక్ సెడాన్ యొక్క ధరలను విడుదల చేసింది. 2016 సివిక్ సెడాన్ యుఎస్ లో హోండా యొక్క కొత్త టర్బో ఇంజిన్ టెక్నాలజీ తో కలిపి కొత్త ఇంజిన్లతో ఒక 'కొత్త-నుండి-గ్రౌండ్ అప్' డిజైన్ ని కలిగి ఉంది. ఈ సివిక్ సెడాన్ యుఎస్ మార్కెట్లో కొత్త 10 వ తరం సివిక్ మోడల్స్ లో సెడాన్, కూపే, అధిక పనితనం గల ఎస్ఐ నమూనాలు, 5-డోర్ల హాచ్బాక్ మరియు మొట్టమొదటి సివిక్ టైప్-ఆర్ మోడల్ తో కలిపి ఈ సిరీస్ లో మొదటిది.

అంతేకాక, ఈ సివిక్ సెడాన్ ఆధునిక భద్రత మరియు కొలిజన్ మిటిగేషన్ బ్రేకింగ్, రోడ్ డిపార్చర్ మిటిగేషన్ మరియు తక్కువ-స్పీడ్ ఫాలోతో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి డ్రైవర్ -సహాయక టెక్నాలజీలను కలిగి ఉంది. హోండా భారతదేశంలో 10 వ తరం సివిక్ సెడాన్ ని తీసుకొనిరావచ్చు, కానీ ఇప్పటివరకూ ఈ సెడాన్ దేశంలోనికి వస్తుందన్నట్టు వార్తలు లేవు. 

2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో ఎల్ఎక్స్ వేరియంట్ మరియు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ 18,640 డాలర్ల (రూ. 12,12,279) వద్ద మొదలవుతుంది. ఇఎక్స్ వేరియంట్ 21,040 డాలర్ల (రూ. 13,68,366) ధర వద్ద మరియు 1.5 టర్బో ఇంజన్ తో ఇఎక్స్-ఎల్ వేరియంట్ 23,700 డాలర్ల (రూ. 15,41,363) వద్ద మొదలవుతుంది.

2016 Honda Civic Rear

ఆవిష్కరణ గురించి అమెరికన్ హోండా మోటార్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, జాన్ మెండెల్ మాట్లాడుతూ " ఈ పదవ తరం సివిక్, చాలా సరళంగా మన దగ్గర ఉన్న సివిక్ కి ఎన్నడూ లేనటువంటి అత్యంత ప్రతిష్టాత్మక పునర్ణిర్మాణం. దీనిలో ఒక కొత్త టెక్నాలజీ, అద్భుతమైన డ్రైవింగ్ అనుభవానికి అందించేందుకు వినూత్న ఆలోచన చేయడం, ఇంధన సామర్థ్యం, భద్రమైన పనితీరును మరియు కాంపాక్ట్ తరగతిలో శుద్ధీకరణ వంటివి అందించడం జరిగిందని తెలిపారు." 

బాహ్యస్వరూపాలు: 

2016 సివిక్ తక్కువ మరియు విస్తృత నిష్పత్తితో మరింత అథ్లెటిక్ వైఖరి కలిగి ఉంది. ప్రస్తుత నమూనాతో పోలిస్తే, 2016 సివిక్ సెడాన్ 1.2 అంగుళాల పొడవాటి వీల్ తో దాదాపు 2 అంగుళాలు విస్తృతంగా మరియు 1 అంగుళం లోవర్ ని కలిగి ఉంది. కొత్త సివిక్ హోండా యొక్క కొత్త ఎల్ఇడి హెడ్లైట్స్ వలే ఎల్ఇడి బాహ్య లైటింగ్, ఎల్ఇడి పగటి పూట నడిచే లైట్లు మరియు విలక్షణమైన సి- ఆకారపు ఎల్ఇడి టెయిల్ లైట్స్ ని కలిగి ఉంది. 

హోండా ఆర్ & డి అమెరికా, సివిక్ సెడాన్ యొక్క సీనియర్ బాహ్య డిజైనర్ మరియు ప్రాజెక్ట్ లీడర్ అయినటువంటి జరడ్ హాల్ మాట్లాడుతూ " హోండా సివిక్ నిజంగా మా ప్రతిష్టాత్మక వాహనం నిర్మించాలనే మా లక్ష్యానికి ఒక ప్రతిరూపంగా ఉంది. దీని యొక్క తక్కువ మరియు విస్తారమైన శరీరం కారణంగా ఇది మూలలో కూడా సులభంగా ప్రయాణించగలదు మరియు దీని మస్క్యులర్ లుక్ ఒక పులి వలే కనిపిస్తుంది అని తెలిపారు. " 

అంతర్భాగాలు: 

2016 సివిక్ సెడాన్ ఒక అధునాతన స్మార్ట్ఫోన్ తో సమగ్రపరచబడే 7 అంగుళాల హై-డెఫినిషన్ డిస్ప్లే ఆడియో టచ్స్క్రీన్ తో అందించబడుతుంది. ఈ వ్యవస్థ iOS 8.4 తో ఆపిల్ కార్ ప్లే కంపాటబుల్ ని కూడా కలిగి ఉంది. అంతేకాకుండా ఐఫోన్ 5 మరియు ఆండ్రాయిడ్ ఆటో కంపాటబుల్ తో ఆండ్రాయిడ్ 5.0 మరియు హైయర్ ని కలిగి ఉంది. 

ఈ కారు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆటో-అప్ / డౌన్ ఫ్రంట్ పవర్ విండోస్, బ్రేక్ హోల్డ్ తో ఒక ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, వాక్ వే ఆటో డోర్ లాక్స్ మరియు 14 డిగ్రీల టిల్ట్ సర్దుబాటుతో డ్రైవర్ సీట్ తొడ మద్దతు వంటి ఆధునిక లక్షణాలను అందిస్తుంది. అంతేకాకుండా కారు వన్ పీస్, సాఫ్ట్-టచ్ ఇన్స్ట్రుమెంట్ పానెల్, కొత్త పూర్తిస్థాయి కలర్ టీఎఫ్టీ సెంటర్ మీటర్, పియానో నలుపు ఫినిషింగ్ తో సెంటర్ కన్సోల్ మరియు హై కాంట్రాస్ట్ సిల్వర్ బెజెల్, ఎల్ఇడి షిఫ్ట్ సూచిక మరియు ఇఎక్స్ మరియు అగ్ర శ్రేణి వేరియంట్స్ కొరకు ఎల్ఇడి ఓవర్హెడ్ లైటింగ్ మరియు లెథర్ షిఫ్ట్ బూట్ వంటి లక్షణాలను కూడా కలిగి ఉంది. ఇంకా దీనిలో ఉన్నత శ్రేణి లో మరింత ప్రీమియం లక్షణాలను అందించే 8-వే శక్తి సర్దుబాటు డ్రైవర్ సీట్, 4-వే పవర్ ముందరి ప్రయాణీకుల సీట్, వేడి ముందు మరియు వెనుక సీట్లు మరియు వేడి సైడ్ అద్దాలు వంటివి ఉన్నాయి. 

2016 Honda Civic Interiors

ఇంజిన్: 

2016 సివిక్ సెడాన్ రెండు కొత్త ఇంజిన్లతో అందించబబడుతుంది. సివిక్ సెడాన్ ఎల్ఎక్స్ మరియు ఇఎక్స్ ట్రింస్ 2.0-లీటర్ i-VTECఇంజిన్ ని కలిగియుండి డిఒహెచ్సి వాల్వ్ ఆధారంగా 4 సిలెండర్ మరియు 16 వాల్వులతో 6-స్పీడ్ మాన్యువల్ లేదా ఒక సివిటి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ తో జత చేయబడి ఉంటుంది. ఇఎక్స్టి, ఇఎక్స్ఎల్ మరియు టూరింగ్ ట్రింస్ 1.5-లీటర్ డైరెక్ట్- ఇంజెక్టెడ్ మరియు టర్బోచార్జ్డ్ 16-వాల్వ్ డిఒహెచ్సి ఇన్లైన్ 4 ఇంజిన్ తో అమర్చబడి సివిటి ఆటోమెటిక్ తో జతచేయబడి ఉంటుంది. 

బాడీ మరియు చాసిస్:

దాని పెద్ద పరిమాణం ఉన్నప్పటికీ, కొత్త సివిక్ 30 కిలోలు తేలికైనది. ఇది ఫ్లష్-మౌంటెడ్ ఆక్వాస్టిక్ గ్లాస్ విండ్షీల్డ్, కటినంగా సీల్ చేయబడిన ఇంజిన్ కంపార్ట్మెంట్ మరియు ట్రిపుల్ సీలు డోర్లను కలిగియుండి క్యాబిన్ లో ఎయిర్ లీక్స్ ని తగ్గిస్తుంది.

2016 Honda Civic Transmission

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Honda సివిక్

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience