• English
  • Login / Register

2015 ఫోక్స్వాగెన్ వెంటో ఫేస్ లిఫ్ట్ జూన్ 23 న విడుదల కాబోతుంది- మీరు తెలుసుకోవాల్సినదంతా

వోక్స్వాగన్ వెంటో 2015-2019 కోసం raunak ద్వారా జూన్ 05, 2015 04:33 pm సవరించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

దీనితో, వెంటోకి ఆశ్చర్యకరంగా ఒకే సంవత్సరంలో రెండు ఫేస్లిఫ్ట్లు ఉన్నట్టు.

జైపూర్:  

తొమ్మిది నెలలలోగా ఫోక్స్వాగెన్ వెంటో యొక్క మరొక ఫేస్లిఫ్ట్ ని విడుదల చేయడానికి సిద్దంగా ఉంది. 2015 వెంటో ఈ నెల 23న్ విడుదల అవుతుంది. తొమ్మిది నెలలకు మునుపు వెంటో కి సరికొత్త 1.5-లీటరు టీడీఐ ఇంజిను, 7-స్పీడ్ డీఎస్జీ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ ని అమర్చారు. దీనికి ఇప్పుడు అల్లోయ్ వీల్స్ తో మరియూ పునరుద్ధరించిన లోపలి అలంకరణతో విడుదలకు సిద్దం చేసారు. ఈ 2015 ఫోక్స్వాగెన్ వెంటోలో కొత్తగా ఏముందో చూద్దాము.    

ఏంటి కొత్త?

  • బయట వైపు, దీనికి కొత్త గ్రిల్లు, బంపరు మరియూ డ్యుఎల్-బ్యారెల్ హెడ్ల్యాంప్స్ ఉంటాయి.
  • కొత్త మూడు పలకల క్రోము గ్రిల్లు, చూడటానికి హుందాగా ఉండటమే గాక, సెడాన్ వంశానికి చెందిన 2015 జెట్టా ఫేస్లిఫ్ట్ సరసన చేరుతుంది. కొత్త పస్సట్ బంపర్ కి కొద్దిగా పెద్ద ఎయిర్  డ్యాం రావడమే గాక, అంచు పొడవునా క్రోము అలంకరణ వస్తుంది. 2014 పోలో ఫేస్లిఫ్ట్ కి ఉన్నట్టుగానే దీనికి ఫాగ్ ల్యాంప్స్ లలో కార్నరింగ్ ల్యాంప్స్ ఉంటాయి.

  • వెనుక వైపున చూస్తే, కొద్ది మార్పులు తప్ప పెద్దగా ఏమీ తేడాలు లేవనే చెప్పాలి. కొత్త పోలో నుండి పునికి తెచుకున్న అల్లోయ్ వీల్స్, డోరు హ్యాండిల్స్ పైన క్రోము పూత,బాహ్యపు అద్ధాలకు టర్న్ ఇండికేటర్స్ ని అమర్చడం జరిగింది.
  • వెనుక వైపు భాగానికి కూడా మార్పులు చేయడం జరిగింది. కాని ఈ మార్పులు ముందు వైపు ఉన్నంతగా ఉండవనే చెప్పాలి. టెయిల్ లైట్స్ కి సున్నితమైన మార్పులు, అంటే కొత్త ఫాక్స్ ఎల్లీడీ ట్రీట్మెంట్ ని ఇవ్వడం వంటివి జరిగాయి( ఫోక్స్వాగెన్ వీటిని త్రీడీ ప్రభావం ఉన్న ల్యాంప్స్ అని పరిణమిస్తుంది). టెయిల్ లైట్స్ కి మరియూ నూతన బంపర్ యొక్క రెఫ్లెక్టర్స్ కి మధ్యలో క్రోము అలంకరణ ఇవ్వడం జరిగింది.

  • ఇంతకు మునుపు వర్షెన్లా కాకుండా, ఎగ్సాస్ట్ టిప్పు బంపర్ గుండా బయటకు ప్రవేశం పొందగా, దీనికి క్రోము పూత కూడా ఉంది.

  • ఇప్పటికి కూడా ఇందులో టచ్స్క్రీన్ ఇంఫోటెయిన్మెంట్ సిస్టం ని అమర్చలేదు మరియూ అంతకు మునుపటి బ్లూటూత్ నే కలిగి ఉంది.
  • కొత్త క్రుయిస్ కంట్రోలు, చళ్ళ గ్లవ్ బాక్స్, ఆటోమాటిక్ ట్రింస్ కి డెడ్ పెడల్ లాంటి సదుపాయాలతో పాటుగా బాహ్యపు అద్దాలకు పవర్ ద్వారా సరి చేసే వెసులుబాటుని కల్పిస్తున్నరు.

సాంకేతిక పరంగా చూసుకుంటే, ఈ ఫోక్స్వాగెన్ కి మునుపటి 1.5-లీటర్ల టీడీఐ డీజిల్ ఇంజిను మరియూ, 1.2-లీటరు టీఎసై & 1.6-లీటరు ఎంపీఐ ఇంజిన్లతో వస్తుంది. అయినప్పటికీ, ప్రస్తుత వెంటో కంటే ఈ డీజిలు రకం 7.5 శాతం మరింత సామర్ధ్యంతో వస్తొందని కంపెనీ వారు చెబుతున్నారు. కాబట్టి, కారు నడిపే విధానంలో ఎటువంటి మార్పులు ఉండబోవు.  

1.5-లీటరు మోటరు 4400ఆర్పీఎం వద్ద 103.5బీహెచ్పీని మరియూ 1500-2500ఆర్పీఎం వద్ద 250ఎనెం ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజినుకి 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మరియూ 7-స్పీడ్ డీఎస్జీ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ ని అందించడం జరిగింది.

పెట్రోలు - 1.6-లీటరు ఎంపీఐ  ఇంజిను 103.5బీహెచ్పీ శక్తిని మరియూ 153ఎనెం టార్క్ ని ఉత్పత్తి చేయగా, 1.2 టీఎసై టర్బో 103.5బీహెచ్పీ ని మరియూ 175ఎనెం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ 1.6 ఎంపీఐ కి 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్మిషను మరియూ 1.2 టీఎసై కి 7-స్పీడు డీఎస్జీ ఆటోమాటిక్ ట్రాన్స్మిషను అందించబడింది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Volkswagen వెంటో 2015-2019

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience