• English
  • Login / Register

పోటీ కి సిద్ధపడుతున్న వోక్స్ వ్యాగన్ వెంటో

వోక్స్వాగన్ వెంటో 2015-2019 కోసం అభిజీత్ ద్వారా జూన్ 24, 2015 12:40 pm ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: ఫేస్లిఫ్ట్ వెంటో ఆవిష్కరించడంతో, జర్మన్ కార్ల తయారీ సంస్థ మరోసారి తమ భారత సి-సెగ్మెంట్ విషయంలో తన ఉనికిని ప్రదర్శించింది. అదే విభాగంలో ఇది, మన దేశంలో అత్యంత విజయవంతమైన హోండా సిటీ, మారుతి సుజుకి సియాజ్, మరియు హ్యుందాయ్ వెర్నా, 4ఎస్ కార్లతో గట్టి పోటీను ఇవ్వడానికి సిద్దంగా ఉంది. అయితే స్కోడా రాపిడ్, సన్నీ నిస్సాన్, మరియు ఫోర్డ్ ఫియస్టా వంటి కొన్ని ఇతర కార్లతో కూడా ఈ నవీకరించిన వెంటో పోటీ గా నిలుస్తుంది. ఈ వోక్స్వాగన్ వెంటో కి వచ్చిన నవీకరణలు దీనిని ఎంత ఉన్నత స్థాయిలో ఉంచుతుందో చూద్దాం.

బాహ్య భాగాలు:

ఇప్పటివరకు వెంటో కేవలం చిన్న చిన్న నవీకరణలు మాత్రమే పొందింది. దీని యొక్క ముందు భాగం రూపకల్పన మాత్రం ఎక్కువగా పునరుద్దరించలేదు. ఈ కారు సూక్ష్మమైన లైన్లతో కూడి మరింత సొంపుగా కనబడుతుంది. కానీ కంపెనీ మాత్రం దీని ముందు మరియు వెనక భాగాలను క్రోమ్ పూతతో, బంపర్ ఇంటెగ్రేటెడ్ రెఫ్లెక్టార్స్, క్రోమ్ ఎగ్జాస్ట్ టిప్ లను మరియు కొత్త అల్లాయ్ వీల్స్ లని మరింత అందంగా అలంకరించారు. ఇక పోటీ విషయానికొస్తే హోండా సిటీ, వెర్నా మరియు ఫోర్డ్ ఫియస్టా వాటి వాటి క్రీడా వైఖరి కలిగించే ప్రతిభతో కిరీటాన్ని దక్కించుకోవాలని చూస్తున్నాయి. అయితే సియాజ్ మాత్రం అద్భుతంగా మరియు స్పోర్టీనెస్ రెండు లక్షణాలతో ఉంది అని చెప్పవచ్చు. స్కోడా రాపిడ్ మరియు నిస్సాన్ సన్నీని చూసినట్లైతే ఇవి చూడడానికి చాలా సహజంగా ఉన్నాయి అని తెలుస్తుంది. 

అంతర్గత భాగాలు 

ఈ వెంటో యొక్క ముందరి భాగం చాలా ఆకర్షణీయంగా మరియు మంచి నాణ్యత కలిగిన మెటీరియల్ తో అమర్చారు. చెప్పదగిన విషయమేమిటంటే దీనిలో ఒక అధునాతమైన మ్యూజిక్ సిష్టం తో పాటూ సౌకర్యవంతమైన సీట్లు మరియు మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ ని కలిగి ఉంటాయి. వెంటోస్ సమాచార వ్యవస్థ, కాక్పిట్ విభాగం రెండూ కూడా హోండా సిటీ మరియు సియాజ్ మోడల్స్ కి ఉన్నట్లే ఆకర్షణీయంగా ఉంటుంది. 

ఇంజన్ 

దీనిలో రెండు పెట్రోల్ ఇంజిన్లలో లభ్యమవుతున్నది. ఒకటి 1.5 లీటర్ టిడి ఐ డీజిల్ మోటార్ లో అందుబాటులో ఉంది. ఈ రెండూ కూడా అత్యుత్తమ పనితీరుని అందిస్తాయి. అయితే హోండా 1.5 ఇ-డి టెక్, సియాజ్ 1.3 ఎం జె డి మరియు ఫియస్టా 1.5 టి డి సి ఐ ఇంజిన్లని కలిగి ఉన్నప్పటికీ వెంటో 1.5 లీటర్ టిడి ఐ డీజిల్ మోటార్ వీటన్నిటి మీద 25 కి.మీ ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Volkswagen వెంటో 2015-2019

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience