2015 ఫోర్డ్ ఫీగో రేపు విడుదల కానుంది
ఫోర్డ్ ఫిగో 2015-2019 కోసం raunak ద్వారా సెప్టెంబర్ 22, 2015 03:55 pm ప్రచురించబడింది
- 19 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఆస్పైర్ లాగా రెండవ తరం ఫీగో కి కూడా ఆశ్చర్య పరిచే ధరలకి అందించవచ్చు!
జైపూర్: పాత కారుని భర్తీ చేస్తూ రెండవ తరం ఫీగో రేపు దేశంలో విడుదల కానుంది. ఈమధ్యనే విడుదల అయిన ఫీగో ఆస్పైర్ కాంపాక్ట్ సెడాన్ లాగానే ఇది కూడా ధర విషయం లో ఆశ్చర్య పరచవచ్చును. పోటీదారుల విషయానికి వస్తే, మారుతీ సుజుకీ స్విఫ్ట్ దీని ప్రధాన పోటీదారి అయినా కూడా, హ్యుండై గ్రాండ్ i10 మరియూ టాటా బోల్ట్ కూడా పోటీగా నిలబడతాయి.
వెనుక భాగం తప్ప, ఫీగో కి అన్నీ ఆస్పైర్ లాగానే లక్షణాలు ఉంటాయి. ఫోర్డ్ సింక్ ఇంఫొటెయిన్మెంట్ సిస్టం, ఫోర్డ్ మైకీ, మై డాక్ వగైరా వంటి ఉపకరణాలు కూడా రెండు వాహనాలలో ఒకేలా ఉంటాయి. రక్షణ విషయంలో ఫీగో కి డ్యువల్ ముందు వైపు ఎయిర్ బ్యాగ్స్ ప్రామాణికంగా ఆస్పైర్ లాగానే ఇవ్వబడతాయి. పైగా, ఉన్నత శ్రేణి టైటానియం+ కి సెగ్మెంట్ ఫర్స్ట్ సైడ్ మరియూ కర్టెయిన్ ఎయిర్ బ్యాగ్స్ కలగలుపుకుని 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి.
ఇంజిన్లు పరంగా,మొదటి తరం ఫిగో యొక్క రెండు మోటార్లు కూడా ఆస్పైర్ తో భర్తీ చేయనున్నది. పెట్రోల్ వేరియంట్స్ కొత్త 1.2 లీటర్ టి ఐవిసిటి 4-సిలిండర్ మోటార్ ద్వారా ఆధారితం చేయబడి ఉంటుంది మరియు డీజిల్ వేరియంట్లు నవీకరించబడిన 1.5 లీటర్ టిడిసి ఐ మోటార్ ద్వారా అమర్చబడి ఉంటుంది. అంతేకాక, 6-స్పీడ్ డ్యూయెల్-క్లచ్ పవర్ షిఫ్ట్ ఆటోమెటిక్ తో ఆస్పైర్ 1.5 లీటర్ టివిసిటి ఫిగో లో అందించబడుతుందా లేదా అనేది సందేహం.