• English
  • Login / Register

టెస్ట్ డ్రైవ్ జరుగుతుండగా కంటికి పట్టుబడ్డ 2015 చేవ్రొలెట్ ట్రయల్బ్లేజర్ అక్టోబర్ లో ప్రారంభం

చేవ్రొలెట్ ట్రైల్ కోసం manish ద్వారా ఆగష్టు 03, 2015 03:57 pm ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: నేడు ఉదయం జైపూర్ లో, 2015 చేవ్రొలెట్ ట్రయల్బ్లేజర్ వాహనం టెస్ట్ డ్రైవ్ లో చేస్తుండగా దర్శనమిచ్చింది. ట్రైల్ బ్లేజర్ యొక్క గత గూఢచారి షాట్లు, భారీగా ఈ ఎస్యువి ని మభ్యపెట్టే విధంగా చిత్రీకరించబడ్డాయి. కానీ, ఈ చిత్రాలు అయితే, ఫ్రంట్ స్ప్లిట్ గ్రిల్, టైల్ లైట్ క్లస్టర్స్, హెడ్ల్యాంప్స్, ఫ్లేర్డ్ వీల్ ఆర్చెస్ వంటి భాగాలు మరింత స్పష్ట్టమైన లుక్ ను అందించాయి. అంతేకాకుండా ఈ రాజస్థాన్ అందించే విభిన్న టెర్రైన్ల కారణంగా ఈ కారు ను ఇక్కడ రోడ్ టెస్ట్ నిర్వహిస్తోంది అని చెప్పవచ్చు.

ఈ కారు జవహర్ సర్కిల్ సమీపంలో తిరుగుతున్నప్పుడు, కారు యొక్క ఫ్లాంటెడ్ ప్రొజెక్టర్ హెడ్లైట్లు, ఎల్ఇడి టెయిల్ లైట్లు మరియు అల్లాయ్ వీల్స్ వంటి భాగాలు స్పష్ట్టంగా కనబడ్డాయి. ఈ లక్షణాలు థాయిలాండ్ వంటి మార్కెట్లలో అందుబాటులో ఉన్న నమూనాల మాదిరిగానే ఈ చిత్రాలలో కూడా కనిపించాయి. ఈ లక్షణాలను ట్రైల్ బ్లేజర్ లో ప్రామాణికంగా అందించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.  

థాయిలాండ్ లో అందుబాటులో ఉన్న ఇంజిన్ మాదిరిగా, భారతదేశంలో రాబోయే ఈ వాహనం లో కూడా అదే ఇంజన్ వచ్చే అవకాశాలున్నాయి. ఆ ఇంజన్ ఏమిటంటే, 2.8 లీటర్ డురామేక్స్ డీజిల్ ఇంజన్. ఈ ఇంజన్ అత్యధికంగా 197 బి హెచ్ పి పవర్ ను విడుదల చేస్తుంది. అదే విధంగా 500 ఎన్ ఎం గల పీక్ టార్క్ ను విడుదల చేసే సామర్ద్యాన్ని కలిగి ఉంటుంది.

ఈ ఎస్యువి యొక్క పరిమాణాలను గమనించినట్లైతే, 4878 మిల్లీ మీటర్ల పొడవును, 1902 మిల్లీ మీటర్ల వేడల్పును మరియు 1847 మిల్లీ మీటర్ల ఎత్తు ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ విభాగం లో ఉన్న ఫార్చ్యూనర్, పజీరో, సాంట ఫీ వంటి వాహనాల కంటే పెద్దగా ఉంటుంది. ఇటువంటి భారీ కొలతలను కలిగి ఉండటం వలన పుష్కలమైన ఖాళీలతో రాబోయే అవకాశాలున్నాయని భావించవచ్చు. ఈ వాహనం యొక్క అంతర్గత భాగాల్ను చూసినట్లైతే, స్టైలింగ్ తో మరియు షిఫ్ట్ ఆన్ ఫ్లై టోగుల్ వంటి అంశాలతో రాబోతుంది. ఇటువంటి తీవ్రమైన రోడ్డు పరీక్ష లు తరువాత ఈ వాహనాన్ని అక్టోబర్ లో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Chevrolet ట్రైల్

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience