16,444 ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌లను ఉపసమ్హరించుకున్నారు

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ 2015-2021 కోసం nabeel ద్వారా నవంబర్ 16, 2015 05:51 pm ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

2015 సంవత్సరపు ద్వితీయ భాగం పెద్దగా ఆకట్టుకోలేదు. జులై లో జీప్ నుండి మొదలుకొని, సెప్టెంబర్ లో హోండా, తరువాత అక్టోబర్ లో టొయోటా, ఆటో తయారీదారులు వారి ఉత్పత్తులలో ఎదో ఒక ఇబ్బందితో ఉపసమ్హరించుకోవలసి వస్తోంది. ఆ తరువాత వోక్స్వాగెన్ వారి డీజిల్ గేట్ మొత్తం ప్రపంచ తయారీదారుల నాణ్యత పై అనుమానాలకు తెర తీసింది.  పై బ్రాండ్‌ల జాబితాలో ఫోర్డ్ ఇండియా వారు కూడా చేరి, 16,444 ఈకోస్పోర్ట్లను రేర్ ట్విస్ట్ బీం బోల్ట్ ఇబ్బందిపై వాహనాలను ఉపసమ్హరించుకున్నారు. ఈ లోపం కారణంగా, అంత బిగుతుగా లేక బోల్ట్ విరిగి వాహనం నడిచేందుకు ఇబ్బంది కలిగించవచ్చును. ఈ కారణంగా ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోలేదు అని కంపెనీ వారు తెలిపడం జరిగింది. కానీ, ఈ లోపం సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తాము అని హామీని ఇచ్చారు.

చెన్నై సదుపాయంలో నవంబర్ 2013 నుండి ఏప్రిల్ 2014 వరకు తయారు అయిన అన్ని ఈకోస్పోర్ట్‌లను ఉపసమ్హరించుకున్నారు. " ఫోర్డ్ ఇండియా వారు కొన్ని కస్టమర్లను ఎంపిక చేసుకుని వారి వాహనాలను ప్రథమంగా పరీక్షిస్తున్నాము. కొన్ని వాహనాలలో, ఆర్టీబీ బోల్ట్ సరిగా బిగించబడి ఉండక పోవచ్చును అని, తద్వారా పైవట్ బోల్ట్ విరిగే అవకాశం ఉంది. ఇది ప్రమాదానికి దారి తీయవచ్చును,"  అని కంపెనీ వారు అన్నారు.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన ఫోర్డ్ ఎకోస్పోర్ట్ 2015-2021

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience