మీరు ఈ మారుతి సుజుకి జిమ్నీ రైనో ఎడిషన్ؚను కొనుగోలు చేస్తారా?
మారుతి జిమ్ని కోసం tarun ద్వారా జూన్ 26, 2023 12:54 pm ప్రచురించబడింది
- 38 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మూడు-డోర్‌ల వెర్షన్ؚలో ఈ SUVరైనో ఎడిషన్ؚను మలేషియాలో పరిచయం చేశారు, ఇది కేవలం 30 యూనిట్‌లకు మాత్రమే పరిమితమైంది
-
మారుతి జిమ్నీ రైనో ఎడిషన్ కేవలం లుక్ పరంగా మార్పులను పొందింది, ఫీచర్‌లు లేదా పవర్‌ట్రెయిన్ؚలలో ఎటువంటి మార్పులు ఉండవు.
-
వింటేజ్ మెష్ గ్రిల్, ఎక్కువ క్లాడింగ్,స్టిక్కర్‌లు మరియు ‘రైనో’ బ్యాడ్జింగ్ ముఖ్యాంశాలలో ఉన్నాయి.
-
పూర్తి నలుపు రంగు ఇంటీరియర్ؚలో ఎటువంటి మార్పులు లేవు, మరింత ఖరీదైన ఫుట్ మ్యాట్స్ ఉన్నాయి.
-
ఇండియా-స్పెక్ మోడల్ؚలో ఉన్న విధంగానే 4WDతో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚను పొందుతుంది.
-
ఇతర లిమిటెడ్ ఎడిషన్‌లతో పాటు భారతదేశంలో ఇది విడుదల అయ్యే అవకాశం ఉంది.
మారుతి సుజుకి జిమ్నీప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలోఅందుబాటులో ఉంది, కానీ కేవలం మూడు-డోర్‌ల వెర్షన్‌లో అందిస్తున్నారు. ఆకర్షణీయమైన రైనో ఎడిషన్ ట్రీట్మెంట్ؚతో ఇది మలేషియాలో కూడా ఎంతో ప్రజాదరణ పొందింది.కేవలం లుక్ పరమైన మార్పులతో అందిస్తున్నారు, కానీ విలక్షణమైన లుక్స్ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇక్కడ ‘రైనో’ సుజుకి ఆఫ్-రోడింగ్ క్లబ్ؚతో అనుసంధానమైంది, ఇందులో జిమ్నీ మరియు పాత గ్రాండ్ విటారా ఉన్నాయి.
ఎక్స్ؚటీరియర్ డిజైన్‌లో మార్పులు
ముందు వైపు, లోగోకు బదులుగా జిమ్నీ రైనో,‘సుజుకి’ అక్షరాలతో పాత-రకం గ్రిల్ؚను కలిగి ఉంది. మెష్ గ్రిల్ చుట్టూ ముదురు క్రోమ్ ప్యానెల్ ఉంది, గుండ్రని హెడ్ؚలైట్‌లుఇందులోఅమర్చబడి ఉన్నాయి. కొత్త, దృఢమైన క్లాడింగ్ؚతో ముందు బంపర్ కొద్దిగా వంగి ఉంది.
బోనెట్ֶపై, ప్రత్యేకమైన స్టిక్కర్‌లు ఉన్నాయి, ఇవి పక్క భాగం వరకు కొనసాగుతాయి. మడ్ؚగార్డ్ؚలు ఎరుపు రంగులో ఉన్నాయి మరియు డోర్ క్రింది సగంలో పెద్ద స్టిక్కర్ ఉంది. ఆఫ్-రోడింగ్ కోసం దీన్ని మరింత సమర్ధవంతం చేయడానికి క్లాడింగ్ؚలతో పక్క భాగంలో అదనపు రక్షణను అందిస్తున్నారు.
వెనుకప్రొఫైల్ؚలో మార్పులు లేవు,బూట్‌పై ‘రైనో’ లోగో మరియు స్పేర్ వీల్ కోసం సారూప్య కవరింగ్ ఉన్నాయి.
ఇది కూడా చదవండి:ఇప్పటికే 6 నెలలు దాటిన మారుతి జిమ్నీ వెయిటింగ్ పీరియడ్
ఇంటీరియర్‌లో కొన్ని మార్పులు
ప్రీమియం ఫుట్ మ్యాట్స్‌ను మినహాయించి ఇంటీరియర్ డిజైన్ؚలో మార్పులు లేవు. ఎటువంటి అప్ؚగ్రేడెడ్ ఫీచర్‌లు లేకుండా, అదే పూర్తి నలుపు రంగు థీమ్ؚనుపొందింది. మలేసియాలో అందిస్తున్న జిమ్నీలో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్ؚఉండగా, ఇండియా-స్పెక్ ఐదు-డోర్‌ల మోడల్ టాప్ వేరియెంట్ؚలో ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ؚప్లేలతో మరింత ఖరీదైన 9-అంగుళాల యూనిట్ؚతో వస్తుంది.
పవర్ؚట్రెయిన్ؚలో మార్పులు లేవు
భారతదేశం మరియు మలేషియాలలో జిమ్నీ, 4X4తో 1.5-లీటర్ నాలుగు-సిలిండర్‌ల పెట్రోల్ ఇంజన్ؚను ప్రామాణికంగా పొందుతుంది. భారతదేశంలో, 5-స్పీడ్‌ల మాన్యువల్ మరియు 4-స్పీడ్‌లAT ఎంపిక ఉంటుంది, మూడు-డోర్‌ల మలేసియా మోడల్ؚలో మాత్రం కేవలం 4-స్పీడ్‌లATతోవస్తుంది.
ఇది కూడా చదవండి:మీ మారుతి జిమ్నీని మీరు ఇలా వ్యక్తిగతీకరించవచ్చు
భారతదేశానికి వస్తోందా?
ఇప్పుడే ఊహించడం తొందరపాటే, కానీఈ మోడల్ జిమ్నీమరియు ఇటువంటి లిమిటెడ్ ఎడిషన్ؚలు భారతదేశానికి రాబోయే కాలంలో వస్తాయని ఆశించవచ్చు. కేవలం 30 యూనిట్‌లతో,ఈ రైనో ఎడిషన్ స్పెషల్ ఎడిషన్‌గా వస్తుంది. దీన్ని మరింత ఆకర్షణీయంగా చేయడానికి, రాబోయే సంవత్సరాలలో ఐదు-డోర్‌ల జిమ్నీలో మరి కొన్ని ప్రత్యేక ఎడిషన్‌లు వస్తాయని ఆశిస్తున్నాము. భారతదేశంలో ప్రస్తుతం దీని ధర రూ. 12.74 లక్షల నుండి రూ.14.89 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.
ఇక్కడ మరింత చదవండి: జిమ్నీ ఆన్ؚరోడ్ ధర
0 out of 0 found this helpful