• English
  • Login / Register

2015 లో రాబోయే వోక్స్వాగన్ వెంటో నుండి ఆశించేవి ఏమేమిటి?

వోక్స్వాగన్ వెంటో 2015-2019 కోసం sourabh ద్వారా జూన్ 10, 2015 11:23 am సవరించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: జర్మన్లు ఎల్లప్పుడు వారి ఉత్పత్తి శ్రేణి పునరుద్ధరించడానికి ఎదురుచూస్తూ ఉంటారు, మరియు కొన్నిసార్లు వినియోగదారులను ఫేస్ లిఫ్ట్ విధానంతో ఒప్పిస్తేనే సరిపోదు, ఉత్పత్తులు ఎప్పుడూ వినియోగదారులకు అప్ టు డేట్ ఉండాలి. కనీసం ఆ విషయం వోక్స్ వ్యాగన్ వెంటో సందర్భంలో అయిన నిజం అవుతుందని మేము అనుకుంటున్నాము అని అన్నారు. దీని తయారీ సంస్థ దీని ప్రారంభానికి ముందుగానే ముందస్తు బుకింగ్ లను రూ. 25,000 తో ప్రారంభించింది. ఈ వాహన ప్రారంభం జూన్ 23, 2015 న జరగనుంది. సరిగ్గా తొమ్మిది నెలల క్రితం వెంటో ఫేస్ లిఫ్ట్ లాంచ్ సెప్టెంబర్ 24, 2014 న జరిగింది. ఇది చాలా త్వరగా వచ్చిన ఇంకొక అప్డేట్. మనం ఆశించిన ఫలితాలను వోక్స్ వ్యాగన్ వెంటో 2015 ఇస్తుందో లేదో మనం చూద్దాం!

బాహ్యభాగాలు

  • దీని ముందరి భాగానికి వస్తే 2015 లో వెంటో కొత్త గ్రిల్ గెట్స్, పునఃరూపకల్పన బంపర్  మునుపటి వలె అదే డ్యుయల్-బారెల్ హెడ్ల్యాంప్స్  తో వస్తున్నయి.  
  • ఈ కొత్త త్రీ స్లాట్ క్రోమ్ గ్రిల్ చూడడానికి  సంస్థ యొక్క ఇతర ప్రీమియం సెడాన్ 2015 జెట్టాను ఫేస్లిఫ్ట్  మరియు కొత్త పస్సాత్ ని పోలి ఉంటుంది.  
  • దీని ముందరి బంపర్ కొత్త క్రోమ్ లైన్ మరియు పెద్ద ఎయిర్ ఇన్టేక్లు ఉండడం అధనపు బలం చేకూరుతుంది. అంతే కాకుండా స్పోర్టీ లుక్ ఇస్తుంది.  
  • దీని పక్క ప్రొఫైల్ కి వస్తే ఈ సెడాన్ కొత్త అలాయ్స్ ని కలిగి ఉంది ఇది మనం కొత్త పోలో మోడల్ లో కూడా చూడవచ్చు. అంతేకాకుండా ఈ వాహనాల యొక్క డోర్ హండిల్స్ క్రోమ్ తో వస్తాయి  మరియు వెలుపలి రేర్ వ్యూ మిర్రర్స్ తో పాటు టర్న్ సూచికలతో వస్తాయి.  
  • వాహనం యొక్క వెనుక విషయానికి వస్తే, చిన్న చిన్న మార్పులు జరిగి న్యూ ఎల్ ఈడి టైల్ ల్యాంప్ తో వస్తున్నాయి. దీనిని సంస్థ వారు 3డి ఎఫెక్ట్ టైల్ ల్యాంప్స్ అని అంటారు. టైల్ ల్యాంప్ క్లస్టర్ లో ఒక క్రోమ్ స్ట్రిప్ కూడా అందించబడుతుంది. మరియు రిఫ్రెష్ బంపర్ దిగువన అందించబడింది.

అంతర్గతభాగాలు

  • అంతర్గతభాగాలు కూడా నవీకరించబడినవి.  మరియు ఇప్పుడు లేత గోధుమరంగు లైట్ షేడ్ కనిపిస్తుంది; దీనిని ఈ సంస్థ "వాల్నట్ ఎడారి రంగు" అని పిలుస్తుంది.
  • సెప్టెంబర్ లో నవీకరణ పొందిన అదే డాష్బోర్డ్ తో రాబోతుంది.
  • కంఫర్ట్ లక్షణాల విషయానికి వస్తే, క్రూయిజ్ కంట్రోల్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ వెలుపలి రేర్ వ్యూ మిర్రర్స్, ఆటోమేటిక్ వేరియంట్ కొరకు డెడ్ పెడల్ వంటి లక్షణాలతో అందించబడుతుంది.
  • హోండా సిటీ లో ఉండేలా కాకుండా, ఇప్పటికీ ఏ టచ్స్క్రీన్ సమాచార వ్యవస్థ లేదు. కాని ఇప్పుడు నవీకరణ చేయబడిన వాహనంలో ఈ బ్లూటూత్ వ్యవస్థ తో రాబోతుంది.  

హుడ్ కింద భాగానికి వస్తే,

  • పాత మోడల్ లో అందించినట్టుగానే, ఈ మోడల్ లో కూడా అదే ఇంజెన్ అందించబడుతుంది, కాని ఇంధన సామర్ధ్యం మాత్రం కొంచెం మార్పు చేయబడి రాబోతుంది. అంటే 7.5 శాతం మెరుగుపరచబడింది.
  • ఈ వాహనాల యొక్క డీజిల్ వేరియంట్లు 1.5 టిడి ఐ పవర్ట్రైన్ ఇంజెన్ తో అందించబడతాయి. ఈ డీజిల్ ఇంజెన్లు 4400rpm వద్ద 103.5bhp పవర్ ను ఉత్పత్తి చేస్తాయి. మరియు 1500-2500rpm వద్ద 250Nm అత్యధిక టార్క్ ను విడుదల చేస్తుంది. ఈ ఇంజన్లు 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మరియు 7-స్పీడ్ డిఎస్జి ఆటోమేటిక్ సిస్టమ్ తో జత చేయబడి ఉంటాయి.
  • ఈ వాహనాల యొక్క పెట్రోల్ వేరియంట్లు 1.2 టిఎస్ ఐ ఇంజెన్ తో మరియు 1.6 లీటర్ ఎంపి ఐ ఇంజిన్ తో రాబోతున్నాయి. 1.6 లీటర్ ఎంపి ఐ ఇంజిన్ 103.5bhp పవర్ ను ఉత్పత్తి చేయగా 153Nm గల అత్యధిక టార్క్ ను విడుదల చేస్తాయి.  1.2 లీటర్ టర్బో ఇంజెన్ విషయానికి వస్తే, 103.5bhp పవర్ ను ఉత్పత్తి చేస్తాయి. అదే విధంగా అత్యధికంగా 175Nm గల టార్క్ ను విడుదల చేస్తాయి.
  • టర్బో పెట్రోల్ ఇంజన్ 7-స్పీడ్ డిఎస్ జి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో జతచేయబడతాయి.  1.6 ఎం పి ఐ పెట్రో ఇంజెన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడతాయి.

was this article helpful ?

Write your Comment on Volkswagen వెంటో 2015-2019

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience