• English
  • Login / Register

రెనాల్ట్ వారి భారతదేశం పోర్ట్ఫోలియో కి క్విడ్ ఎటువంటిది

రెనాల్ట్ క్విడ్ 2015-2019 కోసం manish ద్వారా సెప్టెంబర్ 22, 2015 12:57 pm ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: ఎంతగానో ఎదురు చూస్తున్న క్విడ్ ని భారతదేశంలో విడుదల చేసేందుకు రెనాల్ట్ సిద్దం అయ్యింది. కారుకి 800cc ఇంజిను ఉంటుంది. ఇది 54bhp మరియూ 74Nm టార్క్ ని విడుదల చేస్తుంది. క్విడ్ లో మొట్టమొదటి సారిగా ఈ సెగ్మెంట్ లో అందించేటువంటి ఎన్నో లక్షణాలు చోటు సంపాదించుకున్నాయి. ఇందులో టచ్ స్క్రీన్ ఇంఫొటెయిన్మెంట్ సిస్టం మరియూ ఎయిర్-కండిషనింగ్ కంట్రోల్స్ ఉంటాయి. డిజిటల్, స్పోర్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియూ ఎన్నో విభిన్న పరికరాలు కూడా ఇందులో కంపెనీ వారిచే అందించబడుతున్నాయి.

కారు బుకింగ్స్ ఇప్పుడు లైవ్ లో ఉన్నాయి మరియు "రెనాల్ట్ క్విడ్" అనే మొబైల్ ఫోన్ ఆప్ ద్వారా కూడా బుకింగ్స్  చేసుకోవచ్చును. రెనాల్ట్ డస్టర్ వంటి విజయవంతమైన కారు తరువాత ఇది ఈ కంపెనీ కి మరోక దశ అని చెప్పవచ్చు. కాంపాక్ట్ ఎస్యూవీ లలో డస్టర్ విప్లవాన్ని సృష్టించింది మరియూ ఇప్పటికీ ఈ విభాగంలో రాజ్యం ఏలుతోంది.

సాంట్రో ద్వారా కొరియన్ తయారీదారి అయిన హ్యుండై కి భారతదేశంలో స్థానం ఎలాదొరికిందో, ఈ క్విడ్ రెనాల్ట్ వారికి అలాగే బలమైన పునాదులు చిన్న కారు మార్కెట్లలో నిర్మించుకోడానికి సహాయపడుతుంది. ఆకర్షణీయమైన పరికరాలతో పాటుగా ఈ ఫ్రెంచ్ తయారిదారి ఈ కారుని సరసమైన ధరకి కూడా అందిస్తున్నారు. దిగువ శ్రేని మోడలుని రూ. 3.0 లక్షల నుండి అందించడంతో ఇది హ్యుండై ఈయాన్, డాట్సన్ గో మరియూ మారుతీ ఆల్టో 800 వంటి వాటిని మించిపోతుంది.

was this article helpful ?

Write your Comment on Renault క్విడ్ 2015-2019

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience