మారుతి యొక్క పోర్ట్ఫోలియోలో కి బాలెనో యొక్క ప్రయోజనం ఏమిటి
మారుతి బాలెనో 2015-2022 కోసం manish ద్వారా అక్టోబర్ 09, 2015 12:50 pm సవరించబడింది
- 13 Views
- 4 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
జపనీస్ వాహన తయారీసంస్థ వారి కాన్స్పెట్లను రోడ్ పైకి తీసుకువచ్చేందుకు ముఖ్యంగా సుజికీ వంటి కార్లను తీసుకువచ్చేందుకు చాలా నేర్పుని కలిగి ఉంది. సుజికి కిజాషీ ఏ-స్టార్ రోడ్ పైకి ఎటువంటి కాన్స్పెట్ తో అయితే వచ్చిందో అలానే చిన్న చిన్న మార్పులు మాత్రమే చేయబడి ఫైనల్ గా రోడ్ పైకి తీసుకురావడం జరిగింది. మారుతీ యొక్క తాజా సమర్పణ కూడా అదే మార్గంలో రాబోతున్నది. బాలేనో బాహ్యబాగాలలో ముందరి వైపు 'వి 'ఆకారపు గ్రిల్, కొంతవరకూ ఫ్లోటింగ్ రూఫ్, పైకప్పు రూఫ్, రేర్ స్పాయిలర్ మరియు కొత్త సుజుకి అలాయిస్ ని కలిగి ఉంది. 2015 మారుతి సుజుకి బాలెనో ప్రీమియం హ్యాచ్బ్యాక్ విభాగంలో సంస్థ యొక్క సరైన ఎంట్రీ. ఈ కారు హ్యుందాయ్ ఐ 20 మరియు హోండా జాజ్ వంటి వాటికి పోటీగా ఉండవచ్చు.
మారుతి బాలెనో బుకింగ్ ఇప్పుడు ప్రారంభమయ్యింది మరియు కారు మారుతి ప్రీమియం నెక్సా డీలర్షిప్ ద్వారా అమ్మకాలు జరుగుతుంది. కారు మారుతి ఎస్ హెచ్విఎస్ తేలికపాటి హైబ్రిడ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది మరియు తక్కువ ఖర్చులో హైబ్రిడ్ ని కలిగి ఉంటుంది. హైబ్రిడ్ టెక్నాలజీ, డీజిల్ వేరియంట్లలో ప్రత్యేకమైనది, ఇది బాలెనో ని భారతదేశం యొక్క మొదటి ప్రీమియం హైబ్రిడ్ హాచ్బాక్ గా చేస్తుంది. ఇది కొనుగోలుదారులకు ప్రభుత్వ ఫేం పథకం ద్వారా ప్రయోజనాలు పొందేందుకు కూడా సహాయపడుతుంది.
దీని పవర్-ప్లాంట్ 1.3 లీటర్ డిడిఐఎస్200 డీజిల్ ఇంజన్ తో అమర్చబడి 30kmpl ఇంధన సామర్థ్యం అందిస్తుంది. కారు పెట్రోల్ వేరియంట్ లో కూడా అందించబడి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో వస్తుంది. కానీ డీజిల్ వేరియంట్ లో అటువంటిది అందించడం లేదు. దీనిలో 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఉంటుంది.
అంతర్భాగాలు ఖరీదైన ప్రీమియం భావంతో నలుపు రంగు స్కీమ్ తో వస్తున్నాయి. అలానే దీనిలో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు స్టీరింగ్ వీల్ సిల్వర్ మరియు క్రోం చేరికలను కలిగి ఉన్నాయి. ఇతర చేరికలు 7 అంగుళాల స్మార్ట్ ప్లే సమాచార వ్యవస్థ తో కలిపి ఉన్నాయి. వీటిని ముందుగా సియాజ్ మరియు ఎస్-క్రాస్ లో కనిపించాయి.