చూడండి: టాటా టియాగో EV vs సిట్రోయెన్ eC3 - AC వినియోగం వలన బ్యాటరీ డ్రైన్ టెస్ట్
టాటా టియాగో ఈవి కోసం ansh ద్వారా జూన్ 22, 2023 09:50 pm ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
రెండు EVలు ఒకే పరమాణంగల బ్యాటరీ ప్యాక్‌లను అందిస్తున్నాయి, కానీ వీటిలో ఒకదాని ఛార్జింగ్ వేగంగా తగ్గిపోతుంది.
భారతదేశంలోని రెండు ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ కార్లను ఈ టెస్ట్ కోసం ఎంచుకున్నాము: టాటా టియాగో EV మరియు సిట్రోయెన్ eC3, వీటిపై ఒక కీలకమైన పరీక్ష నిర్వహించాము. రెండు వాహనాలలో లోపల కూర్చొని, ఒకే విధమైన వాతావరణ పరిస్థితుల్లో ఎయిర్ కండిషనింగ్ ఆన్ చేసి, బ్లోయర్ స్పీడ్‌ను గరిష్టంగా సెట్ చేసి, 30 నిమిషాలలో ఈ రెండిటిలో ఏది ఎక్కువ ఛార్జింగ్ కోల్పోతుంది అని పరీక్షించాము. మా పరిశీలన వివరాలు ఇక్కడ చూడవచ్చు:
టాటా టియాగో EV
టాటా టియాగో EV |
ప్రారంభంలో |
చివరిలో |
బ్యాటరీ శాతం |
64 % |
57 % |
పరిధి |
140 km |
128 km |
టియాగో EVలో 140 కిమీ పరిధిని సూచిస్తూ, 64 శాతం బ్యాటరీ ఛార్జింగ్ ఉన్నపుడు AC టెస్ట్ను ప్రారంభించాము. టెస్ట్ సమయంలో, ఆ వాహన బ్యాటరీని డ్రెయిన్ చేసే ఏ ఇతర ఫీచర్‌లను ఉపయోగించలేదు. 30 నిమిషాల తర్వాత, దిని ఛార్జ్ 7 శాతం మరియు పరిధి 12 కి.మీ వరకు తగ్గింది.
టాటా ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో వస్తుంది: 19.2 kWh మరియు 24 kWh. ఈ రెండు బ్యాటరీలు ఎలక్ట్రిక్ మోటారుతో జతచేయబడినవి, చిన్న బ్యాటరీ ప్యాక్ 61 PS/110 NM మరియు పెద్ద బ్యాటరీ ప్యాక్ 75 PS/114 NM పవర్ మరియు టార్క్‌ను మరియు వరుసగా 250 కిమీ మరియు 315 కిలోమీటర్ల పరిధిని అందిస్తాయి. మా పరీక్ష కోసం, మేము పెద్ద బ్యాటరీ ప్యాక్ కలిగిన టాటా టియాగో EVని ఎంచుకున్నాము.
సిట్రోయెన్ eC3
సిట్రోయెన్ eC3 |
ప్రారంభంలో |
ఆఖరులో |
బ్యాటరీ శాతం |
56.6 % |
54 % |
సిట్రోయెన్ eC3లో ఇదే పరీక్షను నిర్వహించాము మరియు చాలా భిన్నమైన ఫలితాన్ని పొందాము. 30 నిమిషాల సమయ వ్యవధిలో, eC3 ఛార్జ్ 56.6% నుండి 54% అంటే కేవలం 2.6 శాతం మాత్రమే తగ్గింది. టియాగో EVతో పోలిస్తే eC3లో పెద్ద బ్యాటరీ ప్యాక్ ఉండడం దీనికి కారణం కావచ్చు. C3 ఎయిర్ కండిషనింగ్ కంప్రెసర్ పరిస్థితులకు అనుగుణంగా ఆఫ్ అవుతూ ఉంది అని కూడా గమనించాము, టెస్ట్ సమయంలో దాన్ని తిరిగి ఆన్ చేయాల్సి వచ్చింది.
సిట్రోయెన్ eC3 29.2kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది ఇది 57PS పవర్ మరియు 143Nm టార్క్‌ను అందించే ఎలక్ట్రిక్ మోటార్‌తో వస్తుంది. ఈ సెటప్‌తో, eC3 320కిమీ మైలేజ్‌ను అందిస్తుంది, ఇది టియాగో EV కంటే కొంత ఎక్కువ.
ఇవి కూడా చదవండి: ఈ 10 కార్ల కంటే 0-100 KMPH వేగాన్ని టాటా టియాగో EV త్వరగా అందుకుంటుంది.
త్వరలోనే టాటా టియాగో EV వాస్తవ పరిస్థితుల పరిధిని అందిస్తాము మరియు ఇది సిట్రోయెన్ eC3తో ఎలా పోటీపడుతుందో చూద్దాం.
ధర
టాటా టియాగో EV ధర రూ.8.69 లక్షల నుండి రూ.12.04 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) మరియు eC3 ధర రూ.11.50 లక్షల నుండి రూ.12.76 లక్షలగా ఉంది (ఎక్స్-షోరూమ్). ఈ కథనం గురించి మీ ఆలోచనలను మాకు తెలియజేయండి మరియు ఈ రెండు EVల మధ్య మరిన్ని పోలికల కోసం CarDekhoను చూడండి.
మరింత చదవండి: టియాగో EV ఆటోమేటిక్
0 out of 0 found this helpful