వోక్స్వ్యాగన్ తమ తొలి బీటిల్ యొక్క ఉత్పత్తిలో 70 వార్షికాలను జరుపుకుంటున్నారు
వోక్స్వాగన్ బీటిల్ కోసం raunak ద్వారా డిసెంబర్ 31, 2015 04:26 pm ప్రచురించబడింది
- 13 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జర్మన్ వాహనతయారి సంస్థ ప్రపంచవ్యాప్తంగా 21 మిలియన్ల బీటిల్స్ ని అమ్మకాలు చేసింది, మొదటి తరం ఉత్పత్తి మెక్సికోలోని ప్యూబ్లా లో జూలై 2003 లో ముగిసింది
న్యూ డిల్లీ:
వోక్స్వ్యాగన్ సంస్థ జర్మనీ వోఫ్స్బర్గ్ లో దాని ఆటోమోటివ్ చరిత్రలో మొదటి బీటిల్ వచ్చిన రోజు కారణంగా 70 వ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. ఈ ఉత్పత్తి రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత మరియు క్రిస్మస్ సమయంలో ప్రారంభించబడింది. వారు 1945 చివరినాటికి దాదాపు 55 యూనిట్లను తయారుచేయగలిగారు. తరువాతి సంవత్సరాలలో తక్కువగా ఉన్న మెటీరియల్ కారణంగా ఒక నెల సుమారు 1000 యూనిట్లకు పరిమితం చేయబడింది.
వోక్స్వ్యాగన్ అకిటెంగ్సెల్స్చాఫ్ట్గా కార్పొరేట్ హిస్టరీ డిపార్ట్మెంట్ యొక్క హెడ్ డాక్టర్ మాన్ఫ్రెడ్ గ్రింజెర్ ఈ విధంగా అన్నారు. " ఈ వాహనం చాలా దృఢంగా ఉండడం వలన దీనిని బ్రిటీష్ మిలటరీ కొరకు ఉపయోగించుకొనేవారు. ఈ కారు కి బ్రిటీష్ యొక్క సైనిక సిబ్బంది మరియు జర్మన్ కార్మికుల రెండిటి ప్రోత్సాహం ఉండడం వలన ఇది మార్కెట్ లో ముందు ఉండగలుగుతుంది. ఆయనకు వోక్స్వ్యాగన్ సెలూన్ యొక్క లక్షణాలు తెలిసి వాటిని రోడ్డు పైన తీసుకొచ్చారు.
యుద్దానికి ముందు, హిట్లర్ యొక్క 630 యూనిట్ల 'పీపుల్స్ కార్' -'KdF-Wagen' (బీటిల్ యుద్ధానంతరం అని పిలుస్తారు) నిర్మించబడ్డాయి మరియు తయారీయూనిట్ ప్రధానంగా సైనిక వస్తువులను ఉత్పత్తి చెసే జర్మనీ యుద్ద ఆయుధాల పరిశ్రమతో విలీనం అయ్యింది. 11 ఏప్రిల్ 1945 న, ఈ సైట్ యు.ఎస్ దళాలతో ఆక్రమించబడింది మరియు జూన్ 1945 లో, బ్రిటిష్ సైనిక ప్రభుత్వం ఫ్యాక్టరీ యొక్క ధర్మకర్తృత్వం చేపట్టారు. Volkswagenwerk GmbH చివరకు అక్టోబర్ 1949 లో జర్మన్ చేతుల్లోకి తిరిగి బదిలీ చేయబడింది. ఇంకా, బీటిల్ డిమాండ్ గణనీయంగా జూన్ 1948 లో కరెన్సీ సంస్కరణ తర్వాత పెరిగింది చెప్పారు. బీటిల్ యొక్క ఆఖరి తయారీ స్థానం Puebla, Mexico లో 21 మిలియన్ వాహనాలకు పైగా ఉత్పత్తి చేయబడ్డాక జూలై 2003 చివరిలో నిలిపివేయబడింది.
ఇంకా చదవండి : వోక్స్వ్యాగన్ ఇండియా రూ. 28.73 లక్షల ధర వద్ద 21 వ శతాబ్దం బీటిల్ ని ప్రారంభించింది
0 out of 0 found this helpful