• English
  • Login / Register

న్యూ బీటిల్ వివరాల బుకింగ్ ను ప్రారంభించిన వోక్స్వాగన్ ఇండియా

వోక్స్వాగన్ బీటిల్ కోసం raunak ద్వారా నవంబర్ 18, 2015 05:43 pm ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

మీరు ఇప్పుడు రూ 1 లక్ష తో కొత్త బీటిల్ ను బుక్ చేసుకోవచ్చు. కొన్ని సంవత్సరాల క్రితం, మునుపటి మోడల్ ఉపసంహరించుకోవడంతో ఇప్పుడు దేశం లో జర్మన్ వాహన తయారీదారుడు బీటిల్ ను తిరిగి ప్రారంభించాడు.

వోక్స్వాగన్ ఇండియా, కొత్త బీటిల్ యొక్క బుకింగ్ వివరాలను తీసుకోవడం మొదలుపెట్టింది. జర్మన్ తయారీదారుడు, కొన్ని సంవత్సరాల క్రితం మునుపటి వెర్షన్ ను ఉపసంహరించడం తో ప్రస్తుతం ఒక కొత్త బీటిల్ ను దేశం లో తిరిగి ప్రవేశపెడుతున్నాడు మరియు ఇది మునుపటి వెర్షన్ వలే సిబియూ మార్గం ద్వారానే ప్రవేశపెట్టబడుతుంది. ఇది, సుమారు 30 లక్షలు ఉంటుంది అని అంచనా. ఈ వాహనాన్ని, కేవలం ఒక లక్ష రూపాయలతో బుక్ చేసుకోవచ్చు అని చెబుతున్నారు. అంతేకాకుండా ఈ వాహనం, మిని కూపర్ ఎస్ మరియు ఫియాట్ అబార్త్ 595 కాంపిటిజన్ వంటి వాహనాలతో గట్టి పోటీను ఇస్తుంది.    

లక్షణాల గురించి మాట్లాడటానికి వస్తే, ఈ కొత్త బీటిల్, వోక్స్వాగన్ యొక్క మీడియా టచ్ స్క్రీన్ సమాచార వ్యవస్థ తో పాటు ఎనిమిది స్పీకర్ల సిస్టం తో వస్తుంది. ఈ వ్యవస్థ, యూఎస్బి, ఆక్స్ ఇన్, బ్లూటూత్ వంటి కనెక్టవిటీ లకు మద్దతిస్తుంది. ఈ వాహనానికి, బై జినాన్ తో ఎల్ఈడి డే టైం రన్నింగ్ లైట్లను (డి ఆర్ ఎల్ ఎస్) లను కలిగిన హెడ్ లైట్ల ను మరియు స్టాటిక్ కార్నరింగ్ లైట్లను కలిగిన ఫాగ్ ల్యాంప్లను అందించడం జరిగింది. వెనుక టైల్ ల్యాంప్లకు కూడా ఎల్ ఈ డి లైట్లను అందించడం జరిగింది. మరోవైపు క్యాబిన్ లో ఉండే సీట్లు, లెధర్ అపోలిస్టీ తో కప్పబడి ఉంటాయి అలాగే స్టీరింగ్ వీల్, గేర్ షిఫ్ట్ నాబ్ మరియు హ్యాండ్ బ్రేక్ లెవర్ లకు కూడా లెధర్ ను అందించడం జరిగింది. ఈ వాహనానికి, మూడు రంగుల ఎంపికలతో యాంబియంట్ లైటింగ్ ను అందించడం జరిగింది. వీటన్నింటితో పాటు ఈ వాహనానికి, పనోరామిక్ సన్ రూఫ్, ఎత్తు సర్ధుబాటు మరియు లుంబార్ మద్దతు అలాగే హీటింగ్ ఆప్షన్ లను కలిగిన ముందు సీట్లు వంటి అంశాలు అందించబడతాయి. వెలుపలి రేర్ వ్యూ మిర్రర్ ల విషయానికి వస్తే, విధ్యుత్తు సర్ధుబాటు అలాగే మడత మరియు హీటింగ్ సౌకర్యాన్ని కలిగి ఉంటాయి. ఆటో రైన్ మరియు లైట్ సెన్సార్లు, క్రూజ్ కంట్రోల్ వంటి వాటిని అందించడం జరిగింది.   

      

భద్రత విషయానికి వస్తే, ఈ కొత్త బీటిల్ కు ఆరు ఎయిర్బాగ్లు ప్రామాణికంగా అందించబడతాయి. అవి వరుసగా, డ్రైవర్ అలాగే ముందు ప్రయాణికుడికి (ప్రయాణికుడి ఎయిర్బాగ్ డియాక్టివేషన్) తో పాటు సైడ్ అలాగే కర్టైన్ ఎయిర్బాగ్లు. వీటన్నింటితో పాటు ఈ వాహనానికి, హిల్ హోల్డ్ ఫంక్షన్ అలాగే ఈ ఎస్ సి (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), ఏబిఎస్ (యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం), ఏ ఎస్ ఆర్ (యాంటీ స్లిప్ రెగులేషన్), ఈ డి ఎల్ (ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్), మరియు ఈ డి టి సి (ఇంజన్ డ్రేగ్ టార్క్ కంట్రోల్) వంటి అంశాలను అందించడం జరిగింది.   

ప్రస్తుతం ఈ బీటిల్, ఒకే ఒక ఇంజన్ ఎంపిక తో అందుబాటులో ఉంది. ఈ వాహనం, వోక్స్వాగన్ యొక్క 1.4 లీటర్ టిఎస్ ఐ టర్బో చార్జెడ్ పెట్రోల్ ఇంజన్ తో జత చేయబడి ఉంటుంది మరియు ఇది, 7- స్పీడ్ డిసిటి డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 150 పి ఎస్ పవర్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఈ వాహనం యొక్క పవర్ ను, ఈ సంవత్సరం మొదటిలో ప్రవేశపెట్టబడిన ఫియాట్ అబార్త్ 595 కాంపిటిజన్ మరియు మిని కూపర్ ఎస్ వాహనాలతో పోలుస్తున్నారు. అంతేకాక ఈ వాహనం, స్టార్ట్ మరియు స్టాప్ సిస్టం తో పాటు రిజనరేటివ్ బ్రేకింగ్ తో వస్తుంది. మరోవైపు ఈ వాహనం యొక్క చక్రాలకు, 205/60 క్రాస్ సెక్షన్ R16 పరిమాణం గల అల్లాయ్ వీల్స్ ను అందించడం జరిగింది. వీటితో పాటు, బూట్ కంపార్ట్మెంట్ లో 16 అంగుళాల ఒక విడి చక్రం కూడా అందించబడింది.

was this article helpful ?

Write your Comment on Volkswagen బీటిల్

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience