వోల్వో ఎక్సీ కి యూరప్-ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ లో ఫైవ్ స్టార్ రేటింగ్ లభించింది
published on సెప్టెంబర్ 03, 2015 03:03 pm by raunak కోసం వోల్వో ఎక్స్ 90
- 10 సమీక్షలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఎక్సీ90 కి అత్యధికంగా మరియూ మొదటి సారిగా సేఫ్టీ అస్సిస్ట్ విభాగంలో వంద శాతం స్కోరు దక్కింది
జైపూర్: యూరప్ ఎన్సీఏపీ క్రాష్ అస్సెస్మెంట్ 2015 లో వోల్వో ఎక్సీ90 ఫైవ్-స్టార్ రేటింగ్ ని అందుకుని ప్రపంచంలోనే యూరో ఎన్సీఏపీ అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ కార్ తు కార్ రేర్-ఎండ్ టెస్ట్స్ (ఏఈబీ సిటీ & ఏఈబీ ఇంటరర్బన్) లో పూర్తి పాయింట్లను అందుకున్న మొట్టమొదటి ఆటోమొబైల్ గా నిలిచింది. ఈ సిటీ సేఫ్టీ టెక్నాలజీ ఎక్సీ90 లో ప్రాథమికంగా అందించబడి ఉంటుంది.
" వోల్వో ఎక్సీ90 తో మేము ప్రపంచంలోనే అతి సురక్షితమైన కారు తయారు చేసామన్న విషయానికి ఇదొక ప్రమాణం. సేఫ్టీ అస్సిస్ట్ కేటగరీ లో మేము వంద శాతం స్కోరు చేసాము. ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే, మేము కారు యొక్క సురక్షణ విషయం లో ఇంకా లీడర్ గానే ఉన్నాము," అని వోల్వో కార్ గ్రూపు కి రీసర్చ్ మరియూ డెవెలప్మెంట్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయిన డా.పీటర్ మెర్టెన్స్ అన్నారు.
" ఏఈబీ ఇంటరుర్బన్ మరియూ సిటీ టెస్టింగ్ ప్రొసీజర్స్ కి యూరో ఎన్సీఏపీ పెట్టిన పరిధిని దాటగలిగిన ఏకైకా కారు తయారిదారులము. అధునాతన ప్రాథమిక క్రాష్ నిరోధనా ఆఫర్లను మాడర్న్ కారులో పొందేందుకు గాను సిటీ సేఫ్తీ అత్యుత్తమమైనది. వాహనాలు, సైకిళ్ళి మరియూ పాదచారులకు కొన్ని సందర్భాలలో, పగలు మరియూ రాత్రి," అని వోల్వో కార్ గ్రూపు కి ప్రిన్సిపల్ ఇంజినీరు అయిన మార్టిన్ మాగ్నూస్సన్ అన్నారు.
ఈ ఏడాది మే నెలలో వోల్వో ఇండియా ఎక్సీ90 యొక్క రెండవ తరాన్ని దేశం లో రూ.64.9 (ఎక్స్-షోరూం, ముంబై, ప్రీ-ఒక్ట్రాయ్) ధరకి విడుదల చేసారు. ఈ ఎస్యూవీ కేవలం డీజిల్ ఇంజిను తో , మొమెంటం మరియూ ఇన్స్క్రిప్షన్ లగ్జరీ అనే రెండు ట్రింలలో లభ్యం అవుతుంది. బుకింగ్స్ విడుదల నుండే మొదలయాయి కాకపోతే డెలివరీలు వచ్చే నెల నుండి ప్రారంభం అవుతాయి.
- Renew Volvo XC90 Car Insurance - Save Upto 75%* with Best Insurance Plans - (InsuranceDekho.com)
- Best Health Insurance Plans - Compare & Save Big! - (InsuranceDekho.com)
0 out of 0 found this helpful