ఆటో ఎక్స్పో లో ప్రదర్శించబోయే వోక్స్వాగన్ యొక్క రాబోయే కాంపాక్ట్ సెడాన్ అనధికారంగా బహిర్గతమయింది.
డిసెంబర్ 30, 2015 03:49 pm nabeel ద్వారా ప్రచురించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
న్యూ డిల్లీ;
వోక్స్వాగన్ యొక్క రాబోయే కారు సబ్-4 మీటర్ల పోలో సెడాన్ ని NH-4( పూనే సమీపంలో) టెస్ట్ డ్రైవ్ జరుపుకుంటూ అనధికారికంగా పట్టుబడింది. దీనిని 2016 ఆటో ఎక్స్పోలో ప్రారంభించాలని షెడ్యుల్ వేసుకుంది. ఈ వోక్స్వాగన్ యొక్క రాబోయే కారు సబ్-4 మీటర్ల పోలో సెడాన్ భారత దేశంలో కొత్త డిజైన్ తో రాబోతోందని భారతీయ ఆటో స్పేస్ లో వారు అందరు ఉత్సుకత తో ఉన్నారు. అలాగే ఈ కారు ఒక చిన్న వేంటో లేదా బూట్ ని జోడించుకున్న పోలో అనే వాదన జరుగుతుంది. చిత్రం లో చూసినట్లయితే ఈ కారు భారీ కవర్ తో కప్పబడినప్పటికీ దీని యొక్క టెయిల్ లైట్ క్లస్టర్ పోలో యొక్క భాగస్వామ్యం అని తెలుస్తుంది. ఇది డిజైర్ేజ్మరియు ఆస్పిరె లకు పోటీగా ఉండబోతోంది. పోలో హాచ్ ని గనుక చూసినట్లయితే ఇది దాని సెగ్మెంట్ లో అధిక ధరతో రాబోతోంది. దీని ధర కొంచెం పెరగబోతోంది అని అందరు ముందుగానే అంచనా వేసారు. కానీ దీని ధర దాని ప్రత్యర్ధి కార్లతో పోలిస్తే సమానం కాదు.
జర్మన్ కార్ల తయారీ సంస్థ నుండి ఎటువంటి నిర్ధారణ సమాచారం లేనప్పటికీ ఈ సెడాన్ ఎక్కువగా పోలో యొక్క ఇంజిన్ ఎంపికల ని అరువు తీసుకున్నట్టుగా 1.2 లీటర్ MPI 3-సిలిండర్ పెట్రోల్, మరియు 1.5 లీటర్ TDi డీజిల్ ఆప్షన్లని కలిగి ఉంది. దీని యొక్క పెట్రోల్ ఇంజిన్ 5400rpm వద్ద 74 bhp శక్తిని మరియు 3750rpm వద్ద 110 Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు చూస్తే దీని డీజిల్ యూనిట్ 4200rpm వద్ద 88.8bhp శక్తిని మరియు 1500 to 2500rpm వద్ద దాదాపు 230 Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. దీని 2 ఇంజిన్లు 5-స్పీడ్ మాన్యువల్ సిస్టమ్ తో రాబోతున్నాయి. వోక్స్వాగన్ యొక్క 7-స్పీడ్ DSG వేంటో కి వచ్చిన ప్రజాదరణ కారణంగా తీసుకొని ఈకారు 1.5 లీటర్ TDi తోడైన ఆటోమేటిక్ ద్వంద్వ-క్లచ్ తో రాబోతుంది. పూనే సమీపంలోని వోక్స్వాగన్ యొక్క చకన్ ప్లాంట్లో ఈ సెడాన్ యొక్క ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుంది.
ఇది కుడా చదవండి ;
భారతదేశం ఆటో ఎక్స్పో 2016 వద్ద ఒక కాంపాక్ట్ సెడాన్ ని ప్రారంభిస్తున్న వోక్స్వ్యాగన్ ఇండియా