• English
  • Login / Register

వోక్స్వ్యాగన్ వెంటో ఫేస్ లిఫ్ట్ విడుదల - దీని గురించి మీరు తెలిసుకోవలసిన అంశాలు

వోక్స్వాగన్ వెంటో 2015-2019 కోసం raunak ద్వారా జూన్ 24, 2015 12:34 pm ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: వోక్స్వ్యాగన్ 2015 వెంటో ఫేస్లిఫ్ట్ ను ప్రవేశపెట్టింది. రూ.7.70 లక్షలు (ఎక్స్-షోరూమ్ ముంబై) వద్ద మరియు రూ.7.85 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వద్ద ప్రారంబించింది. ఈ వోక్స్వ్యాగన్  వెంటో, ఒకే సంవత్సరంలో రెండుసార్లు నవీకరణ పొందింది. ఇది గత సంవత్సరం నవంబర్ లో  కొన్ని శైలీ నవీకరణలతో పాటు కొత్త డీజిల్ ఇంజన్ తో వచ్చింది. ఇప్పుడు వచ్చిన 2015 వెంటో ఫేస్లిఫ్ట్ వెర్షన్, అనేక లక్షణాలతో పాటు సమగ్ర శైలీ తో అందుబాటులో ఉంది. ఈ కొత్త వెంటో, ఏమేమి అందిస్తుందో చూద్దాం రండి.

ధరలు

ఎక్స్-షోరూమ్ న్యూఢిల్లీ


పెట్రోల్

1.6 లీటర్ ఎంపి ఐ

  • ట్రెండ్లైన్ - రూ. 7.85 లక్షలు
  • కంఫోర్ట్లైన్ - రూ. 8.67 లక్షలు
  • హై లైన్ - రూ. 9.42 లక్షలు

1.2 లీటర్ టిఎస్ ఐ

  • కంఫోర్ట్లైన్ - రూ. 9.87 లక్షలు
  • హై లైన్ - రూ. 10.62 లక్షలు

డీజిల్

1.5 లీటర్ టిడి ఐ

  •      ట్రేండ్లైన్ - రూ. 9.1 లక్షల
  •      కంఫోర్ట్లైన్ - రూ. 9.92 లక్షల
  •      హై లైన్ - రూ. 10.67 లక్షల

1.5 లీటర్ టిడి ఐ ఆటోమేటిక్

  •      కంఫోర్ట్లైన్ - రూపాయలు. 11,12 లక్షల
  •       హై లైన్ - రూపాయలు. 11,87 లక్షల

కొలతలు

  •      పొడవు - 4390 మీ.మీ
  •      వెడల్పు  - 1699 మీ.మీ
  •      ఎత్తు  - 1467 మీ.మీ
  •      వీల్బేస్  - 2553 మీ.మీ
  •      గ్రౌండ్ క్లియరెన్స్ -163 మీ.మీ
  •      బూట్ సామర్ధ్యం - 494 లీటర్లు
  •      ఇంధన ట్యాంక్ కెపాసిటీ - 55 లీటర్లు
  •      టైర్స్ - 175/70 R-14 (ట్రేండ్లైన్), 185/60 R-15 (కంఫోర్ట్లైన్) మరియు 185/60 R-15 అల్లాయ్స్ (హై లైన్)

బాహ్య భాగాలు

  • 2015 వెంటో లో  ఒక కొత్త త్రీ స్లాట్ క్రోమ్ గ్రిల్ తో రాబోతుంది. దీని వలన స్పోర్టీలుక్ ను ఇస్తుంది మరియు ఈ  త్రీ స్లాట్ క్రోమ్ గ్రిల్, 2015 జెట్టాను ఫేస్లిఫ్ట్ మరియు పసత్ ను పోలి ఉంటుంది. చివరి నవీకరణ లో ఉండే అదే డ్యూయల్ బ్యారెల్ హెడ్ల్యాంప్స్ తో వచ్చింది. 
  • దీనిలో ఉండే బంపర్ కొత్తది మరియు మార్పు చేయబడిన పెద్ద గాలి ఆనకట్ట ను అందిస్తుంది. ఒక క్రోం లైన్ బంపర్ తో పాటు అమర్చబడి ఉంటుంది. అది ఫాగ్ ల్యాంప్స్ తో పాటు కార్నరింగ్ లైట్లను కలిగి ఉంటుంది. 
  • దీని యొక్క సైడ్ ప్రొఫైల్ విషయంలో ఏ మార్పులు చేయబడలేదు. పోలో లో ఉండే అవే అల్లాయ్ వీల్స్ తో వచ్చింది. ఈ వాహనాల డోర్ హ్యాండిల్స్ వద్ద క్రోం చేరికలను కూడా కలిగి ఉంది దీనితో పాటు గా ఓఆర్ విఎం లపై టర్న్ సూచికలతో వచ్చింది.

  • ఈ వాహనం వెనుక బాగంలో, న్యూ బంపర్, ఫ్లాకెండ్ రౌండ్ లో టైల్ లైట్ క్లస్టర్ ఉంటుంది, మరియు దీని చుట్టూ ఒక క్రోం స్ట్రిప్ బిగించబడి ఉంటుంది. ఎగ్జాస్ట్ కొన భాగంలో ఒక క్రోమ్ మఫ్లర్ ఉంటుంది. 
  • అదే టైల్ లైట్ క్లస్టర్ తో రాబోతుంది. కానీ, కొత్త గ్రాఫిక్స్ తో వచ్చింది. అంతేకాకుండా ఫ్లాక్స్ ఎల్ ఈ డి లేయవుట్ ను కూడా కలిగి ఉంది.

అంతర్గత భాగాలు

  • బాహ్య భాగాలను ప్రక్కన పెడితే, వెంటో యొక్క అంతర్గత భాగాలు అనేక కాస్మటిక్ మార్పులను కలిగి ఉంది. నవంబర్ 2014 లో చివరి అప్డేట్లో మార్పు చేయబడిన అంశాలు వరుసగా, ఫ్లాట్ బోటం స్టీరింగ్ వీల్ మరియు సెంట్రల్ కన్సోల్ లో వెండి చేరికలు.
  • కారు లేత గోధుమరంగు యొక్క తేలికైన నీడ రూపంలో సూక్ష్మ మార్పులు లేకుండా అదే కనిపిస్తుంది; ఇది సంస్థ ప్రకారం 'వాల్నట్ డెసర్ట్ బీజ్' గా పిలవబడుతుంది.
  • మునుపటి సాధారణ లక్షణాలను ప్రక్కన పెడితే, 2015 వెంటో ఫేస్లిఫ్ట్ వెర్షన్, ఒక క్రూయిస్ కంట్రోల్, ఒక కూలింగ్ గ్లోవ్ బాక్స్, ఒక డేల్ పెడల్ (ఆటోమేటిక్ వేరియంట్) మరియు విద్యుత్తో మడత వేయగలిగే వెలుపలి రేర్ వ్యూ మిర్రర్స్ వంటి లక్షణాలతో అండుబాటులో ఉంది 


భద్రతా లక్షణాలు

  •  ముందు వలె, 2015 వెంటో లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ ప్రామాణికంగా అందించబడుతున్నాయి. 
  •  అయితే, ఏబిఎస్ రెండవ వైవిధ్యమైన వేరియంట్ నుండి మొదలవుతుంది - అంటే, కంఫోర్ట్ లైన్ మొదలుకొని 
  •  డిఎస్జి డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ వేరియంట్లలో కూడా ఈ ఎస్ ఒఇ ను అందిస్తున్నాయి - అంటే, ఎలక్ట్రానిక్ స్థిరీకరణ ప్రోగ్రాం మరియు హిల్ హోల్డ్ కంట్రోల్


ఇంజిన్లు

1.5 లీటర్ టిడి ఐ డీజిల్:

  • ఈ డీజిల్ ఇంజన్ 1498 సిసి స్థానభ్రంశాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 4400 rpm వద్ద 103.5 bhp పవర్ ను విడుదల చేస్తుంది. మరియు టార్క్ విషయానికి వస్తే, 1500 నుండి 2500 rpm మధ్య 250 Nm గల టార్క్ విడుదల అవుతుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ డిఎస్ జి డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఇంజన్ మాన్యువల్ లో 20.64 kmpl మైలేజ్ ను అందిస్తాయి.  మరియు ఆటోమేటిక్ లో 21.5 kmpl మైలేజ్ ను అందిస్తుంది.  


1.6 లీటర్ ఎంపి ఐ మరియు 1.2 లీటర్ టిఎస్ ఐ పెట్రోల్:

  • ఈ వెంటో యొక్క పెట్రోల్ వేరియంట్లు 1.6 లీటర్ ఎంపి ఐ ఇంజన్ మరియు 1.2 లీటర్ టిఎస్ ఐ పెట్రోల్ టర్బోచార్జ్డ్ ఇంజన్లతో అందుబాటులో ఉంది. 
  • 1.6 ఎంపి ఐ ఇంజన్ 5250 rpm వద్ద అత్యధికంగా 103.5 bhp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా, 3800 rpm వద్ద అత్యధికంగా 153 Nm గల టార్క్ ను విడుదల చేస్తుంది. ఈ ఇంజన్లు 5- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జతచేయబడి ఉంటాయి. ఈ ఇంజన్ లు 16.09 kmpl మైలేజ్ ను అందిస్తాయి. 
  • 1.2 లీటర్ టిఎస్ ఐ టర్బోచార్జ్డ్  ఇంజన్ 5000 rpm వద్ద అత్యధికంగా 103 bhp పవర్ ను విడుదల చేస్తుంది. అదే విధంగా 1500 నుండి 4100 rpm మధ్య 175 Nm గల అత్యధిక టార్క్ ను విడుదల చేస్తుంది. అయితే 1.2 లీటర్ టిఎస్ ఐ పెట్రోల్ ఇంజన్ లు 7- స్పీడ్ డిఎస్ జి డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటాయి. ఈ ఇంజన్ లు సర్టిఫై ప్రకారం 16.93 kmpl మైలేజ్ ను అందిస్తాయి.    
ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Volkswagen వెంటో 2015-2019

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience