• English
  • Login / Register

అమెరికాలో ఆవిష్కరించిన వోక్స్ వ్యాగన్ జెట్టా-2016

వోక్స్వాగన్ జెట్టా కోసం అభిజీత్ ద్వారా జూన్ 11, 2015 12:26 pm ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఢిల్లీ: అమెరికాలో వోక్స్ వ్యాగన్ జెట్టా జిఎల్ఐ 2016 ను ఆవిష్కరించారు, ఇది గోల్ఫ్ జిటిఐ నుండి తీసుకోబడిన శక్తివంతమైన ఈఎ888 4-సిలిండర్ ఇంజన్ ను కలిగి ఉంది. జెట్టా ప్రస్తుతం అమెరికన్ మార్కెట్ లో ఎక్కువగా అమ్ముడవుతున్న మోడల్, బహుశా భారతదేశంలో ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్న నవీకరణమైన కారు ఇదేనేమో అనిపించేలా జెట్టా కనిపిస్తుంది, కనీసం దీని ఇంజన్ డిజైన్ దానిది కాకపోయినా వినియోగదారుల మన్ననలు పొందుతుంది. జిఎల్ఐ గరిష్టంగా 210bhp శక్తి ఉత్పత్తి చేసే 2.0 లీటర్ టర్బోచార్జ్ డైరెక్ట్ ఇంజన్ ను కలిగి ఉంది. 

ఈ వోక్స్వాగన్ జట్టా జిఎల్ ఐ ముందరి భాగం చూడటానికి వస్తే, హనీకోంబ్ గ్రిల్ మరియు ఫాగ్ ల్యాంప్స్ తో చూడటానికి మరింత ఆకర్షణీయం గా కనబడుతుంది. ఈ జెట్ట వెనుక భాగం కూడా అనేక నవీకరణలతో రాబోతుంది. కొత్త డిజైన్ మరియు డిఫ్యూజర్ తో పాటు ఒక అందమైన  క్రోమ్-కొనలతో ఎక్సాస్ట్ లను కూడా కలిగి ఉంది. అంతేకాకుండా 18-అంగుళాల నూతన మాలోరీ డిజైన్ అల్యూమినియం అల్లాయ్ వీల్స్ ను కలిగి ఉంది. ఈ వాహనం ఆల్ వెధర్ టైర్స్ తో లేదా సమ్మర్ ప్రెఫరెన్స్ టైర్లతో రాబోతుంది.  

ఈ కారు యొక్క లొపలి భాగాలను గమనించినట్లైతే, ఒక కొత్త ఎం ఐ బి2 సమాచార వ్యవస్థ తో పాటు, యుఎస్బి మరియు కార్ నెట్ కనెక్టవిటీ ఆప్షన్లతో రాబోతుంది. ఈ జెట్ట యొక్క ఎస్ ఈ వేరియంట్లో ఎల్ఇడి టెయిల్-లైట్స్, పుష్-బటన్ స్టార్ట్ తో పాటు కీలెస్ ఎంట్రీ, క్లిమేట్రోనిక్ ఆటోమేటిక్ డ్యూయల్ జోన్ వాతావరణ నియంత్రణ, సన్రూఫ్, 6-వే పవర్ డ్రైవర్ సీటు, వెనుక వ్యూ కెమెరా, ముందు మరియు  వెనుక పార్క్ డిస్టన్స్ కంట్రోల్, ఫెండర్  ప్రీమియం ఆడియో సిస్టమ్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ మరియు ఆటోమేటిక్ హెడ్ల్యాంప్స్ వంటి వాటితో రాబోతుంది.   


జెట్టా లో ఉండే సాధారణ లక్షణాలను ప్రక్కన పెట్టినట్లైతే, దీని యొక్క  ఉన్నతస్థాయి లక్షణాలు గురించి మట్లాడటానికి వస్తే, వెనుక ట్రాఫిక్ హెచ్చరికను తో బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, ఒక నావిగేషన్ సిస్టమ్, బైజినాన్ హెడ్లైట్ల తో పాటు అడాప్టివ్ ఫ్రంట్-లైటింగ్ సిస్టం, మరియు హోంలింక్. అంతేకాకుండా ఏఎఫెస్ వ్యవస్థ ను కలిగి ఉండటం వలన వీటి ఫ్రెంట్ హెడ్ల్యాంప్స్, స్టీరింగ్ వీల్ ఆదీనంలో ఉంటాయి. అంటే, కారు రోడ్ పై వెళుతున్నప్పుడు, కారుని స్టీరింగ్ వీల్ సహాయంతో లెఫ్ట్ సైడ్ కు తిప్పినట్లైతే, ఈ ఫ్రెంట్ లైటింగ్ కూడా లెఫ్ట్ సైడ్ మరింత ప్రకాశవంతంగా కనపడటం లో సహాయపడుతుంది. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Volkswagen జెట్టా

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience