• English
  • Login / Register

రేపే విడుదల కాబోతున్న వోక్స్వాగన్ వెంటో ఫేస్లిఫ్

వోక్స్వాగన్ వెంటో 2015-2019 కోసం sourabh ద్వారా జూన్ 22, 2015 04:21 pm ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: వోక్స్వ్యాగన్ ఇండియా, వెంటో యొక్క ఫేస్లిఫ్ట్ వెర్షన్ ను రేపు ప్రవేశపెట్టబోతున్నట్లు తెలిపారు. రాబోయే ఫేస్లిఫ్ట్ వెర్షన్ లో నవీకరణలు ఎక్కువగా ముందు ప్రొఫైల్లో మరియు అతి పెద్ద మార్పులు కాస్మెటిక్ రూపంలో చేయబడ్డాయి. సెడాన్ ఇప్పుడు, 2015 జెట్టా ఫేస్లిఫ్ట్ మరియు కొత్త పసత్ నుంచి తీసుకోబడిన కొత్త మూడు స్లాట్ క్రోమ్ గ్రిల్ తో రాబోతుంది. ఈ వెంటో ఫేస్లిఫ్ట్ వెర్షన్, సి విభాగంలో ఉన్న హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా మరియు మారుతి సుజుకి సియాజ్ వంటి వాహనాలతో గట్టి పోటీను ఇవ్వడానికి రాబోతుంది. ఈ వాహనం కోసం, డీలర్స్ రూ .25,000 ఒక ముందస్తు చెల్లింపు తో ముందుగానే బుకింగ్ తీసుకోవడం మొదలు పెట్టారు. 

రాబోయే ఫేస్లిఫ్ట్ వెర్షన్ లో కొత్త గ్రిల్ ఏ కాకుండా, పునఃరూపకల్పన చేయబడిన బంపర్, గత నవీకరణ నుండి అదే డ్యుయల్-బారెల్ హెడ్ల్యాంప్స్ తో రాబోతుంది. ఫ్రంట్ ఇప్పుడు, రూపకల్పన చేయబడిన  బంపర్ తో పాటు క్రొత్త క్రోం లైన్ మరియు పెద్ద గాలి సంగ్రహణ లను కలిగి ఉంటుంది. దీని వలన మరింత స్పోర్టీ లుక్ ను ఇస్తుంది. ఈ వాహనం యొక్క సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఈ సెడాన్ న్యూ సెట్ అల్లాయ్ వీల్స్ అందించబడతాయి. ఈ వీల్స్ ను కొత్త పోలో లో చూడవచ్చు. ఈ వాహనాల డోర్ హ్యాండిల్స్ క్రోం చేరికలతో రాబోతుంది దీనితో పాటు గా ఓఆర్ విఎం పై టర్న్ సూచికలతో రాబోతుంది.  

ఈ వాహనం యొక్క వెనుక భాగం విషయానికి వస్తే, 3డి ప్రభావం కలిగిన టైల్ ల్యాంప్స్ గా పిలిచే కొత్త ఎల్ ఈడి లుక్-అలైక్ చికిత్స రూపంలో సూక్ష్మ మార్పులు ఉన్నాయి. ఒక క్రోమ్ స్ట్రిప్ కూడా టైల్ ల్యాంప్ క్లస్టర్ మరియు రిఫ్రెష్ బంపర్ దిగువన అందించబడింది.

క్యాబిన్ లోపల, కారు లేత గోధుమరంగు యొక్క తేలికైన నీడ రూపంలో సూక్ష్మ మార్పులు లేకుండా అదే కనిపిస్తుంది; ఇది సంస్థ ప్రకారం 'వాల్నట్ డెసర్ట్ బీజ్' ఉంది. ఈ సెలూన్ లో టచ్ స్క్రీన్ సమాచార వ్యవస్థ లేకపోవడం మరియు చివరి నవీకరణ నుండి అదే బ్లూటూత్ తో రాబోతుంది.   

హుడ్ క్రింది భాగానికి వస్తే, చివరి నవీరణలో అందించబడిన అవే నిర్దేశాలు మరియు అదే పవర్ తో రాబోతుంది. కానీ, ఇంధన సామర్ధ్యం విషయానికి వస్తే, 7.5 శాతం పెరుగుదలతో రాబోతుంది. ఈ వెంటో ఫేస్లిఫ్ట్ వెర్షన్ యొక్క డీజిల్ వేరియంట్లు 1.5 లీటర్ టిడి ఐ ఇంజన్ తో రాబోతుంది. ఈ ఇంజన్ అత్యధికంగా 4400 rpm వద్ద 103.5 bhp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది, అదే విధంగా టార్క్ విషయానికి వస్తే, అత్య్ధికంగా 1500 నుండి 2500 rpm వద్ద 250 Nm టార్క్ ను విడుదల చేస్తుంది. ఈ ఇంజన్ లు 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో మరియు 7-స్పీడ్ డిఎస్ జి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటాయి.

అంతేకాక, ఈ వెర్షన్ యొక్క పెట్రోల్ వేరియంట్లు 1.2 లీటర్ టిఎస్ ఐ మరియు 1.6 లీటర్ ఎంపి ఐ ఇంజన్ తో రాబోతుంది. 1.6 లీటర్ ఎంపి ఐ పెట్రోల్ ఇంజన్ అత్యధికంగా 103.5 bhp పవర్ ను ఉత్పత్తి చేయగా, అత్యధికంగా 153 Nm గల టార్క్ ను విడుదల చేస్తుంది. అయితే 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, అదే 103.5bhp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. టార్క్ విషయం లో మాత్రం కొంచెం మార్పు రాబోతుంది, ఇంతకి ఎంత అంటే, 175 Nm టార్క్ విడుదల అవుతుంది. ఈ టర్బో పెట్రోల్ ఇంజన్ 7-స్పీడ్ డిఎస్ జి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటుంది. అయితే, 1.6 ఎంపి ఐ పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటుంది.   

was this article helpful ?

Write your Comment on Volkswagen వెంటో 2015-2019

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience