• English
  • Login / Register

పోలో జిటి ఐ ను 2016 భారత ఆటో ఎక్స్పోలో ప్రదర్శించనున్న వోక్స్వాగన్

వోక్స్వాగన్ పోలో 2015-2019 కోసం manish ద్వారా జనవరి 21, 2016 04:36 pm ప్రచురించబడింది

  • 21 Views
  • 1 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరియు ఇటీవల "అమియో" అను పేరుపొందిన కాంపాక్ట్ సెడాన్ ప్రదర్శన తో పాటు, వోక్స్వ్యాగన్ ఫిబ్రవరి 5 వ తేది నుండి 9 వరకు గ్రేటర్ నోయిడా ప్రాంతంలో జరుగనున్న రాబోయే 2016 భారత ఆటో ఎక్స్పోలో దాని పోలో జిటి ఐ హాచ్బాక్ ను ప్రదర్శించనుంది. 

ఈ వాహనం యొక్క బాహ్య భాగం విషయానికి వస్తే, ఈ వాహనానికి ఎల్ ఈ డి హెడ్ ల్యాంప్లు, డ్యూయల్ ఎగ్జాస్ట్ పైపులు, మార్పు చేయబడిన సైడ్ స్కర్ట్లు, బారీ అల్లాయ్ వీల్స్, హనీ కోంబ్ గ్రిల్ మరియు కారు ముందు అలాగే వెనుక భాగంలో జిటి ఐ బ్యాడ్జింగ్ వంటి అంశాలు అందించబడ్డాయి.  

ఈ వాహనం యొక్క లోపలి భాగం విషయానికి వస్తే, క్యాబిన్ లో ఉండే సీట్లకు ఫ్యాబ్రిక్ కవర్ లు అందించబడతాయి మరియు దీనికి వ్యతిరేక కుట్టు అందించబడుతుంది. అంతేకాకుండా లోపలి భాగంలో స్పోర్టీ క్యాబిన్, ఫ్లాట్ బోటం స్టీరింగ్ వీల్ మరియు అల్యూమినియం రేసింగ్ పెడల్స్ వంటి అంశాలు అందించబడ్డాయి.  

ఈ వాహనం యొక్క హుడ్ క్రింది భాగం విషయానికి వస్తే, అత్యంత ప్రముఖమైన నవీకరణ పొందిన ఇంజన్ అందించబడుతుంది. ఈ హాచ్బాక్ కు, 192 పి ఎస్ పవర్ ను అందించే 1.4 లీటర్ టిఎస్ ఐ పవర్ మిల్ అందించబడుతుంది. మరోవైపు ఈ పోలో జిటి ఐ వాహనం, అబార్త్ పుంటో ఈవో  వంటి వాహనానికి గట్టి పోటీను ఇస్తుంది. ఈ ఇటాలియన్ హాచ్బాక్ మాత్రం 147 పి ఎస్ పవర్ ను మాత్రమే విడుదల చేస్తుంది.

ఈ పవర్ ప్లాంట్, 6- స్పీడ్ మాన్యువల్ లేదా 7- స్పీడ్ డి ఎస్ జి ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. ఈ వాహనం యొక్క త్వరణం విషయానికి వస్తే, 0 నుండి 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి 6.7 సెకన్ల సమయం పడుతుంది. మరోవైపు ఇదే వాహనం 236 కె ఎం పి హెచ్ గల అధిక వేగాన్ని చేరుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ కారు ధర ఇప్పటికీ ఒక ఊహాత్మక విషయంగా ఉంది, కానీ ఈ జర్మన్ హాట్ హాచ్బాక్ యొక్క ధర రూ 9.9 లక్షలు ఉండవచ్చునని ఆశిస్తున్నారు. ఈ పోలో జిటి ఐ వాహనం 2016 వ సంవత్సరం మధ్యలో అమ్మకానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి:వోక్స్వ్యాగన్ బీటిల్ 2016 భారత ఆటో ఎక్స్పోలో ప్రదర్శించబోతోంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Volkswagen పోలో 2015-2019

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience