టయోటా మరియు జనరల్ మోటర్స్ తో పోలిస్తే 2015 మొదటి భాగంలో ఎక్కువ అమ్మకాల చేసిన వోక్స్వ్యాగన్
జూలై 30, 2015 10:58 am akshit ద్వారా ప్రచురించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
డిల్లీ: జపనీస్ వాహన తయారీసంస్థ టయోటా మంగళవారం ఒక ప్రకటన జారీ చేసింది. అదేమిటంటే, టయోటా 5.02 మిలియన్ వాహనాలను ఈ సంవత్సరం మొదటి భాగానికి పంపిణీ చెయ్యగా, దాని సమీప పోటీదారు వోక్స్వ్యాగన్ ఈ నెల 5.04 మిలియన్ వాహనాలుగా నివేదించారు. రెండు బ్రాండ్లు అమ్మకాలు ప్రకారం టయోటా 1.5 శాతం అమ్మకాలు తగ్గిపోగా, జర్మన్ తయారీసంస్థ అయితే 0.5 శాతం అమ్మకాలు తగ్గాయి.
జనరల్ మోటార్స్, మూడవ అతిపెద్ద వాహన తయారీసంస్థ కూడా 4.86 మిలియన్ వాహనాలలో సంవత్సరం మొదటి భాగంలో 1.2 శాతం క్షీణత కనిపించింది.
చైనా లో మందగమనం ఉన్నప్పటికీ, దాని అతి పెద్ద మార్కెట్ అయినటువంటి వోక్స్వ్యాగన్ గత కొన్ని సంవత్సరాలుగా యూరోపియన్ మార్కెట్లో మంచి డిమాండ్ పొందుతుంది. ఇది 2018 నాటికి ప్రపంచంలో అతిపెద్ద వాహన తయారీసంస్థగా అయ్యి, మళ్ళీ 2007 లో నాటి వైభవాన్ని తిరిగి 2018 లో తీసుకువచ్చేందుకు కృషి చేస్తుంది. చైనాలో మార్కెట్ క్షీణించిన కారణంగా మరియు స్థానికంగా ఉన్న పోటీ, రెండిటినీ తట్టుకొని ఆ స్థానాన్ని చేరుకోగలగాలి.
క్రిందటి సంవత్సరం టయోటా 10.23 మిలియన్ వాహనాలను అమ్మగా, వోక్స్వ్యాగన్ 10.14 మిలియన్ వాహనాలు మరియు జనరల్ మోటార్స్ 9.92 మిలియన్ వాహనాలను అమ్మకాలు చేసింది.