వోక్స్వ్యాగన్ వారు బుగాటి, లాంబోర్ఘిని, డ్యుగాటి లేదా బెంట్లీ వదులుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి

డిసెంబర్ 09, 2015 07:26 pm manish ద్వారా ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఇటీవల డీజిల్ గేట్ కుంభకోణం యొక్క అభియోగాన్ని ఎదుర్కొంటున్న వోక్స్వ్యాగన్ వారు భారీ నష్టాలతో, అప్పుల వలన ఆర్ధిక ఇబ్బందులలోకి వెళ్ళబోతున్నట్టు కనిపిస్తున్నారు. తద్వారా ఈ జర్మన్ కారు తయారీదారులు తమ యొక్క ప్రపంచ ప్రక్యాత ఉత్పాదకాలైన మరియు గౌరవించబడే కారు బ్రాండులను వదులుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. నివేధికల ప్రకారం  వోక్స్వ్యాగన్ వారు రూ.1.4 లక్షల కోట్ల భారీ అప్పుకి సంతకాలు జరిగి ఉన్నాయి. ఈ ఆర్ధిక నష్టాన్ని యూరప్ లో వ్యాపించి ఉన్న 17 ఆర్ధిక సంస్థలు సర్దుబాటు చేయడం జరిగింది.   వోక్స్వ్యాగన్ వారి సమాచారం ప్రకారం ఈ ఆర్ధిక వ్యవహారాలకి రాబోయే కాలాలకి రీ-ఫైనాన్సింగ్ కు అనుగుణంగా పూచీ కట్టు బాండ్లను ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.    

తాము ఎదుర్కొంటున్న ఈ ఆర్ధిక సంక్షోభం నుండి బయటపడడానికి వోక్స్వ్యాగన్ వారు తమ యొక్క ప్రత్యేకమైన బ్రాండ్లు అయిన లాంబోర్ఘిని, బెంట్లీ, బుగాటి, MAN మరియు డ్యుగాటి లను వదులుకొనే అవకాశాలు ఉన్నాయి. అయితే MAN వీరి యొక్క ఉప బ్రాండ్ గా కలిగియుండగా వీరు ముఖ్యంగా జనరేటర్స్, భారీ పారిశ్రామిక మెషినరీ, షిప్ మిషన్లు వగైరా వంటివి తయారు చేస్తున్నారు. వీటి నికర మూల్యం దాదాపు 3700 కోట్లు కలిగి ఉన్నాయి. అయితే, వారి ఈ ముఖ్యమైన బ్రాండ్ లు వదులుకోవడం ఊహాజనితం అయి ఉండవచ్చు. ఎందుకంటే, ఈ బ్రాండ్ ల అమ్మకాలు వోక్స్వ్యాగన్ వారికి ఒక ఆఖరి అవకాశం అనే చెప్పాలి. ఇక ఈ డీల్ గేట్ కుంభకోణం సరిదిద్దుకొనేందుకు నష్టాన్ని పూరించే విధంగా భాద్యతలను డాక్టర్ స్టీఫెన్ నర్జ్ అందిపుచ్చుకొని అందుకు ఆడీ AG యొక్క కొత్త బోర్డ్ సభ్యుడిగా జాయిన్ అవ్వనున్నారు. 

ఇంకా చదవండి 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience